వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవీ కొత్త జిల్లాలు: యువతకు ఆశాదీపాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాత వరంగల్ జిల్లా పలు కొత్త జిల్లాలుగా విడిపోయి ఉంది. ఈ కొత్త జిల్లాల్లో యువత తీరు తెన్నులపై ఓ వార్తాకథనం.

వరంగల్‌, 29 అక్టోబర్‌ :

వరంగల్‌ అర్బన్‌
జనాభా : 11,35,707
యువత : 44 శాతం
వరంగల్‌ గ్రామీణం
జనాభా : 7,16,457
యువత : 42 శాతం

రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా, పోరాటాలకు పురిటిగడ్డగా... చైతన్యానికి ప్రతీకగా.. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా వరంగల్‌ అర్బన్‌కు పేరుంది. వీరిలో 23 శాతం మంది బీటెక్‌, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదువుకున్నవారు ఉంటే.. 15 శాతం మంది పీజీ అపై చదువులు పూర్తి చేసిన వారు ఉన్నారు. మరో 25 శాతం మంది డిగ్రీ వరకు చదువుకున్నారు. మిగిలిన 37 శాతం మందిలో ఇంటర్మీడియెట్‌లోపు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ, కేఎంసీ విద్యాసంస్థలున్నాయి. వీరిలో ఇప్పటికీ చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేవు.

ప్రస్తుతం కొంతమంది హైదరాబాద్‌లాంటి పెద్ద నగరాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండగా, మరి కొంతమంది నగరంలోనే ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ వ్యాపార కేంద్రాల్లో చాలీచాలనీ వేతనాలతో పని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన అర్బన్‌ జిల్లాతోనైనా ఉపాధి అవకాశాలు పెరగాలని ఇక్కడి యువత కోరుకుంటుంది. చారిత్రక నగరంగా చెప్పుకునే ఓరుగల్లులో ఇప్పటికీ కేవలం 100 మందికి ఉపాధి కల్పించే ఒక్క కంపెనీ కూడా లేదని, ఈ పరిస్థితి మారాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఉత్తమ విద్యాసంస్థలకు నిలయమైన ఈ జిల్లాలో ఐటీ, ఫార్మ, రైల్వే, ఎలక్ట్రికల్‌, మొబైల్‌ తదితర కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని యువత కోరుకుంటుంది.

వరంగల్‌ నగరానికి సమీపంగా ఉండి, వ్యవసాయానికి అనుకూలంగా ఉంది ఈ జిల్లా. ఇందులో నర్సంపేట, పరకాల పెద్ద పట్టణాలున్నాయి. యువతలో 21 శాతం మంది వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేయగా, 12 శాతం మంది పీజీ అపై కోర్సులు చదివినవారు ఉన్నారు. 22 శాతం మంది డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. మిగిలిన 45 శాతం యువత డిగ్రీలోపు చదివారు. ఈ జిల్లాలో ప్రసుత్తం కొన్ని కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులు, రైస్‌ మిల్లులు మినహ ఇస్తే.. ఇక్కడ ఎలాంటి ఉపాధిని ఇచ్చే పరిశ్రమలు లేవు.

ఇక్కడి నిరుద్యోగ యువతలో కొంతమంది పెద్ద నగరాలకు పోయి ఏదో పని చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది స్థానికంగానే తక్కువ వేతనాలతో చిరుద్యోగులుగా ఉన్నారు. కొత్త జిల్లా ఏర్పడటంతో ఇక్కడి యువతలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికైనా స్థానికంగా మంచి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయనే కొంగొత్త ఆశలతో ఎదురు చుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో అతి పెద్ద వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో దీని ద్వారానైన కొంత మంది ప్రత్యక్షంగా, రి కొంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. పరకాల పట్టణం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, నర్సంపేటలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఐటీ పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది. యువతకు ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది.

జయశంకర్‌
జనాభా : 7,05,054
యువత : 39 శాతం
జనగామ
జనాభా : 5,82,457
యువత : 38శాతం
జనాభాలో అధికభాగం వీరే

తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి... పాలనలో సరికొత్త మార్పులు తీసుకురావడానికి.. అభివృద్ధిని వికేంద్రీకరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఐదు కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో తమ జీవితాల్లో మెరుగైన మార్పులు వస్తాయనే నమ్మకంతో ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రత్యేకించి యువతీయువకులు కొత్త జిల్లాలతోనైనా సరైన ఉపాధి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఉన్నత చదువులు చదివినా ఇప్పటి వరకు సరైన ఉద్యోగంలేదని జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోనైనా అవి దరి చేరాలని వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లాలకు సంబంధించిన యువత శాతం, వారి చదువులు, ఉపాధి అవకాశాలు, తదితర అంశాలపై 'న్యూస్‌టుడే' అందిస్తున్న కథనం.

రాష్ట్రంలోనే అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా, సింగరేణి గనులకు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి చిరునామాగా, భవిష్యత్తులో ప్రతిష్ఠాత్మకమైన సాగు నీటి ప్రాజెక్టులు వచ్చే జిల్లాగా గుర్తింపు పొందింది జయశంకర్‌ భూపాలపల్లి. యువతలో 14 శాతం మంది వివిధ రకాల వృత్తి విద్య కోర్సులు పూర్తి చేయగా, 10 శాతం మంది పీజీ అపై కోర్సులు చదివారు. మరో 20 శాతం మంది డిగ్రీ వరకు చదువుకున్నారు. డిగ్రీ కంటే తక్కువగా 56 శాతం మంది చదువుకున్నారు. కొంతమంది సింగరేణి, జెన్‌కోలో పని చేస్తుండగా చాలామంది మాత్రం ప్రస్తుతం నిరుద్యోగులుగానే ఉన్నారు.

వీరిలో కొందరు వ్వవసాయ ఆధారిత పనులు చేస్తుండగా, ఇంకొందరు చిన్న చిన్న వ్వాపారాలు చేస్తున్నారు. కొత్తగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు కావడంతో ఇక్కడి యువతలో ఆనందం వెల్లివిరిసింది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఈ జిల్లా అనుకూలంగా ఉండటంతో ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు, పురుగుమందుల తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇక్కడి యువత కోరుకుంటుంది. వీటి ఏర్పాటుతో తమ జీవితాల్లో సరికొత్త వెలుగులు వస్తాయని ఇందుకోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహబూబాబాద్‌
జనాభా : 7,70,170
యువత : 37శాతం

తెలంగాణ సాయిధ పోరాటానికి వేదికగా.. సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా, ప్రజా చైతన్యానికి పుట్టిల్లుగా.. హైదరాబాద్‌ మహా నగరానికి దగ్గరగా ఉన్న జనగామకు ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాకు సాగునీటి సౌకర్యం మిగత జిల్లాలతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం యువకులు ఎక్కువగా ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌ పైనే ఆధారపడుతుంటారు. ఎక్కువ మంది రాష్ట్ర రాజధానికి రైళ్లలో వెళ్తుంటారు. కొంతమంది స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక జిల్లాతోనైనా తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఇందుకు అవకాశాలు సైతం ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పీజీ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు మధ్యలో ఉండటంతో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రికల్‌ తదితర కంపెనీలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. పోరాడి సాధించుకున్న జిల్లాతో తమకు మేలు జరిగిందన్నారు. తమతోపాటు భవిష్యత్తు తరాలు గర్వంగా చెప్పుకుంటారని ఈ జిల్లా నవతరం అభిప్రాయపడింది.

పోరటాలకు, అనేక ఉద్యమాలకు, ఎక్కువ మంది గిరిజనులకు.. మరెన్నో ప్రత్యేకతలకు నిలయమైన మహబూబాద్‌ జిల్లాలో 7,70,170 మంది జనాభా ఉంది. యువతలో 17 శాతం మంది వివిధ వృత్తి విద్య కోర్సులు చదవగా, 11 శాతం మంది పీజీ అపై కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇక 23 శాతం మంది డిగ్రీ వరకు చదువుకున్న వారు ఉన్నారు. మిగిలిన 49 శాతం మంది డిగ్రీ కంటే తక్కువ చదువుకున్నారు. వీరిలో ఎక్కువ మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయి వివిధ రకాల పనులు చేస్తున్నారు.

కొత్తగా ఏర్పడిన ప్రత్యేక జిల్లాతోనైనా స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ జిల్లా యువత భావిస్తుంది. మరి ముఖ్యంగా దిల్లీ-చెన్నై రైల్వే మార్గం ఈ జిల్లా నుంచే ఉండటంతో పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు, రైల్వేకు సంబంధించిన పరిశ్రమలు కూడా ఇక్కడకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని యువత కోరుకుంటుంది. అప్పుడే ఈ జిల్లాలో ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు దరి చేరుతాయని వారు అంటున్నారు.

English summary
Youth dominates in new districts divided from old Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X