• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దత్తత కోసం మహిళ పాట్లు: మొహం చాటేసిన సరోగసీ దంపతులు

By Swetha Basvababu
|

హైదరాబాద్: ఆ మహిళ భర్తతో విడిపోయింది. కానీ అప్పటికే గర్భవతి.. విడిగా ఉంటున్న సదరు మహిళకు తన కడుపులో ఉన్న బిడ్డ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ నగర శివారు కాలనీలో నివాసం ఉంటున్న ఆ మహిళకు ఒక సరోగసి మధ్యవర్తి కలిశారు.

గుంటూరుకు చెందిన ఒక జంటకు సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు మహబూబ్ నగర్ జిల్లా ఝాన్సీలక్ష్మి సంగతి తెలిసి అందుకూ సరేనన్నారు. తన బిడ్డ భవితవ్యం కోసం ఆమె.. పుత్రుడి కోసం సదరు గుంటూరు జంట మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. చివరకు ఏడో నెలలో ఆడపిల్ల అని తేలడంతో గుంటూరు జంట మొహం చాటేయడం.. ప్రసవం కోసం సదరు పాలమూరు జిల్లా వాసి ఝాన్సీలక్ష్మి పేట్ల బురుజు ఆసుపత్రిలో చేరడంతో అసలు కథ బయట పడింది.

సరగసీ ఉత్తదే.. ఆ బిడ్డ సరగసీ ద్వారా పుట్టలేదు.. ఈ విషయం గుంటూరు దంపతులకూ.. మహబూబ్‌నగర్‌ దంపతులకూ తెలుసు! అయినా, చివరి వరకూ హైడ్రామా! చివరకు, ఆ బిడ్డ మహబూబ్‌నగర్‌ దంపతుల బిడ్డే అని డీఎన్‌ఏ పరీక్ష తేల్చింది. దాంతో, వారిపైనే కేసు నమోదుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.

In the name of surrogacy trying to cheat

గత నెల 18న పేట్ల బురుజులో ఆడపిల్లకు జననం

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఝాన్సీలక్ష్మి జూలై 18న పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాన్పు కోసం ఆమె సుధారాణి పేరుతో ఆస్పత్రిలో చేరింది. కాన్పు తర్వాత ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఆధార్‌ కార్డు పరిశీలిస్తే ఆమె పేరు ఝాన్సీలక్ష్మి అని తేలింది. వైద్యుల విచారణలో గుంటూరు దంపతులకు తాను సరగసీ ద్వారా బిడ్డకు జన్మినిచ్చినట్లు చెప్పింది. ఆస్పత్రి వైద్యులు అటు పోలీసులు, ఇటు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఝాన్సీలక్ష్మి, లక్ష్మణ్‌ దంపతులకు, శిశువుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా ముగ్గురి డీఎన్‌ఏలు సరిపోలాయి. దాంతో, ఆ బిడ్డ సరగసీ ద్వారా జన్మించలేదని తేలింది.

పాలమూరు ఝాన్సీలక్ష్మి విడిగా ఇలా జీవనం

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఝూన్సీలక్ష్మి, లక్ష్మణ్‌ దంపతులు. ఆమె భర్తతో విడిపోయి పెద్ద అంబర్‌పేటలో వేరుగా ఉంటోంది. భార్యాభర్తలు విడిపోయే నాటికే ఆమె గర్భవతి. ఇంటి పక్కన ఉండే ఒక సరగసీ బ్రోకర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ''గుంటూరుకు చెందిన దంపతులకు కూతురు ఉంది. ఆమెకు పిల్లల్లేరు. సరగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని వారు కోరుతున్నారు.

ఇందుకు మూడు లక్షలు ఇస్తారు'' అని మధ్యవర్తిఆమెకు తెలిపారు. సరగసీ ద్వారా బిడ్డను కని ఇవ్వాలని కోరింది. అయితే, అప్పటికే ఆమె గర్భవతి కావడంతో, సరగసీ కాకపోయినా, ఝాన్సీలక్ష్మికి పుట్టిన బిడ్డను తీసుకునేందుకు గుంటూరు దంపతులు అంగీకరించారు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ఝూన్సీలక్ష్మి కూడా ఒప్పుకొంది.

ఇలా పట్టించుకోవడం మానేశారని ఆరోపణలు

పుట్టబోయే బిడ్డ తమ కూతురుకు పుట్టిన బిడ్డగా చలామణీ కావాలని గుంటూరు దంపతులు కోరుకున్నారు. ఇందులో భాగంగానే ఝాన్సీలక్ష్మి సరగసీ ద్వారా బిడ్డను మోస్తున్నట్లు ప్రచారం చేశారు. వాళ్ల అమ్మాయి పేరు సుధారాణి కావడంతో ఆమె పేరుతోనే ఝాన్సీలక్ష్మికి చికిత్స చేయించారు. తనకు ఆడబిడ్డ పుడుతుందని గుంటూరు దంపతులు నిర్ధారించుకున్నారని, దాంతో ఏడో నెల నుంచి పట్టించుకోవడం మానేశారని ఝాన్సీలక్ష్మి తెలిపింది.

పేట్ల బురుజు దవాఖానలో ఇలా అడ్మిట్

చివరకు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో పేట్ల బురుజు ఆస్పత్రిలో చేర్పించారు. అంతవరకూ సుధారాణి పేరుతో చికిత్సలు జరగడం, ఆధార్‌ కార్డులో ఝాన్సీలక్ష్మి పేరు ఉండడంతో ఆమెను విచారించారు. సరగసీ ద్వారా తాను బిడ్డను కన్నానని చెప్పిన ఝాన్సీలక్ష్మి.. రెండు ఆస్పత్రుల పేర్లు చెప్పింది.

ఆ రెండు ఆస్పత్రుల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాటిలో సరగసీ జరగలేదని నిర్ధారణ చేసుకున్నారు. సరగసీ అంతా ఉత్తదేనని, దత్తత కోసం హైడ్రామా నడిపారని నిర్ధారించుకున్నారు. పుట్టిన బిడ్డకు, ఝాన్సీలక్ష్మిలకు గత నెల 24న డీఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. భర్త లక్ష్మణ్ అందుబాటులో లేకపోవడంతో ఈ నెల ఒకటో తేదీన పరీక్షలు నిర్వహించిన తర్వాత జన్యువులు ఒకటేనని తేలాయి. దీంతో వీరిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahaboob Nagar Woman had living separately in Hyderabad sub urban colony. But separated with her husband had concieved pregnancy while she concerned her kid's future. At the same time Sarogacy mediator meeted her and explained matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more