వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ స్మోకర్స్: అమెరికా తర్వాత మనమే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళుతున్నది. అదే విధంగా భారత్ లో లేడీ స్మోకర్లు పెరిగిపోయారని, ప్రపంచంలో రెండవ స్థానంలో మనం ఉన్నామని వెలుగు చూసింది. అమెరికా ఆడాళ్ల తరువాత భారత్ లో మహిళలు అత్యధికంగా సిగరెట్లు తాగుతున్నారని సర్వే వెల్లడించింది.

భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో తెలిపిన తాజా గణాంకాల్లో సిగరేట్ ఉత్పత్తి, వినియోగం వివరాలు వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో భారత్ లో 10,180 కోట్ల సిగరేట్లు తాగేశారు. 2014-15లో ఈ సంఖ్య 9,320 కోట్లకు పడిపోయింది.

ఇది కొంతవరకు ఊటర కలిగించే అశం అని తెలిపింది. సిగరేట్ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో భారత్ లో 11,010 కోట్ల సిగరేట్లు ఉత్పత్తి అయ్యాయి.

Increasing Women smokers in India

2014-15 సంవత్సరంలో సిగరేట్ల ఉత్పత్తి 10,530కి పడిపోయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిగరేట్లు తాగే ఆడాళ్ల సంఖ్య భారత్ లో బాగా పెరిగింది. గ్లోబల్ టొబాకో స్టడీ సర్వే తెలిపిన వివరాల ప్రకారం అమెరికా తరువాత అత్యధికంగా సిగరేట్లు తాగుతున్న ఆడవాళ్లు భారత్ లో ఉన్నారని వెలుగు చూసింది.

1980 నాటికి భారత్ లో 53 లక్షల మంది ఆడవాళ్లు సిగరేట్లు తాగుతున్నారు. 2012 సంవత్సరానికి భారత్ లో 1.25 కోట్ల మంది ఆడవాళ్లు సిగరేట్లు తాగుతున్నారని గ్లోబల్ టొబాకో స్టడీ తన నివేదికలో తెలిపింది. భారత్ లో సిగరేట్లు తాగే ఆడవాళ్ల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని యాంటీ టొబాకో యాక్టివిస్ట్ లు అంటున్నారు.

English summary
one thing that might come in way is that India houses the second largest number of female smokers after United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X