హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విన్యాసాలు అదుర్స్: తొలిసారి మహిళా ఫైటర్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా 'భారత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది' అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్ అనే ముగ్గురు మహిళలు యుద్ధ విమాన పైలట్లుగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు.

పాసింగ్‌ఔట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణమంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలను అందజేశారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా ఏర్పాటు

అన్ని దళాలతో కలిపి నాలుగు నక్షత్ర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫాను ఏర్పాటు చేసే యోచన ఉన్నట్టు కేంద్రమంత్రి పారికర్ చెప్పారు. అన్ని కమాండ్లకు ఉమ్మడిగా సిడిఎస్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే చీఫ్ ఆఫ్ స్ట్ఫా కమిటీ వ్యవస్ధ ఉందని ఆయన చెప్పారు. సిడిఎస్ ఏర్పాటుపై నియమించిన కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందన్నారు.

అండమాన్‌లో వివిధ దశల్లో 17 కమాండ్లు పనిచేస్తున్నాయని, కానీ అక్కడ ఒక కమాండ్ ఉండాలనే ప్రతిపాదన ఉన్నట్టు చెప్పారు. రాత్రికి రాత్రి అన్ని దళాల కమాండ్ ఒకే పరిధి కిందకు తీసుకురావడం సాధ్యం కాదన్నారు. దీనికోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఒకే కమాండ్ ఉండటం వల్ల పోరాడే సామర్థ్యం పెరుగుతుందన్నారు. దీనివల్ల సమన్వయ లేమిని నిరోధింవచ్చన్నారు. 2001లోనే కేంద్ర మంత్రివర్గం సిడిఎస్ ఏర్పాటును సిఫార్సు చేసిందని గుర్తు చేశారు.

తొలిసారి మహిళా పైలట్లు

తొలిసారి మహిళా పైలట్లు

వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకున్నారు.

తొలిసారి మహిళా పైలట్లు

తొలిసారి మహిళా పైలట్లు

ఈ సందర్భంగా ‘భారత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది' అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్ అనే ముగ్గురు మహిళలు యుద్ధ విమాన పైలట్లుగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

పాసింగ్‌ఔట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణమంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలను అందజేశారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

అనంతరం రక్షణమంత్రి మాట్లాడుతూ.. వాయుసేన చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అన్నారు. వైమానికరంగంలో భవిష్యత్తులో మహిళలు అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉందన్నారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

యుద్ధ విమాన పైలట్లుగా వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ మంత్రి పారికర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇంకా కొన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా అధిగమిస్తాం.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

రానున్న కాలంలో రక్షణ విభాగాల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది. అది మనం మౌలిక వసతులు ఏమేరకు కల్పిస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లను విధుల్లోకి తీసుకోవాలని మేం ఉత్సుకతతో ఉన్నాంఅని చెప్పారు. పాసింగ్‌ఔట్ పరేడ్ పూర్తి చేసుకున్న 130 పైలట్లకు రాష్ట్రపతి తరఫున మంత్రి పారికర్ ప్రెసిడెంట్ కమిషన్స్‌ను అందజేశారు.

విన్యాసాలు అదుర్స్

విన్యాసాలు అదుర్స్

పరేడ్‌లో రక్షణశాఖ మంత్రితోపాటు ఎయిర్‌చీఫ్ మార్షల్ అరుప్‌రాహా, ఎయిర్‌స్టాఫ్ చీఫ్ మార్షల్ ఎస్‌ఆర్‌కే నాయర్, ఎయిర్ మార్షల్ జీపీసింగ్ పాల్గొన్నారు. పరేడ్‌లో భాగంగా వాయుసేన విమానాలు, హెలికాప్టర్లతో ఒళ్లుగగుర్పొడిచేలా చేసిన విన్యాసాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరేడ్ ప్రారంభంలో నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తొలిసారి మహిళా ఫైటర్లు

తొలిసారి మహిళా ఫైటర్లు

వాయుసేన ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తొలిసారిగా యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన యువతులు అన్నారు. పరేడ్ అనంతరం ఫైటర్ పైలట్లు అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్ మీడియాతో మాట్లాడారు.

తొలిసారి మహిళా ఫైటర్లు

తొలిసారి మహిళా ఫైటర్లు

వాయుసేనలో తొలిసారిగా యుద్ధ విమాన పైలట్లుగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని అవని చతుర్వేది అన్నారు.

తొలిసారి మహిళా ఫైటర్లు

తొలిసారి మహిళా ఫైటర్లు

యుద్ధ పైలట్లుగా ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న ప్రశ్నకు ఇది పూర్తిగా చాయిస్ బేస్డ్. ముందుగా మమ్మల్ని అడిగారు. తర్వాత పూర్తి పరీక్షల తర్వాత ముగ్గురిని ఎంపికచేశారు అని మరో పైలట్ మోహనాసింగ్ చెప్పారు. ఎవరూ ఎలాంటి లింగ వివక్ష చూపలేదని మరో ఫైటర్ పైలట్ భావనాకాంత్ వివరించారు.

English summary
India's first women fighter pilots - Bhawana Kanth, Avani Chatuvedi and Mohana Singh - were commissioned in the Indian Air Force today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X