వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"తక్కువ నగదును ఉపయోగించేందుకు ఇండియన్స్ సిద్దం..!"

నోట్ల రద్దు తర్వాత.. నగదు రహిత దేశంగా మారేందుకు ఇండియా ఏవిధంగా అడుగులు వేస్తుందన్న విషయాన్ని వివరిస్తూ ప్రముఖ సలహాదారు స్మితా మిశ్రా వెలిబుచ్చిన అభిప్రాయం.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఓవారం క్రితం పేపర్ అబ్బాయి అన్వీష్ కుమార్ బిల్లు వసూలు చేసుకోవడం కోసం మా ఇంటికొచ్చాడు. నేను పర్స్ తీసి డబ్బులున్నాయో.. లేదో చెక్ చేయకముందే.. చిన్నగా నవ్వి.. తనదైన యాసలో.. 'మేడమ్ చెక్ దే దోనా!' అన్నాడు.

ఇదే తరహా అనుభవం తమకు సైతం ఎదురైనట్లు నా మిత్రులు నాతో చెప్పారు. టైలర్స్,పండ్ల వ్యాపారులు, డైరీ షాప్ వాళ్లు.. ఇలా చాలామంది పేటీఎం ద్వారా ఇప్పుడు లావాదేవీలు జరుపుతున్నట్టు వారు తెలిపారు. నోట్ల రద్దు కొరతను ఎదుర్కోవడానికి ఢిల్లీ/ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్) లోని కొన్ని కిరాణా షాపులు ఇప్పటికే కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నాయి.

దేశంలో రిటైల్ అవుట్ లెట్స్ కు మాత్రమే పరిమితమైన ఈ కార్డు లావాదేవీలు ప్రస్తుతం వీధి చివరన ఉండే కిరాణా షాపుల్లోను జరుగుతుండడం విశేషం. ఢిల్లీ/ఎన్సీఆర్ లను నగదు రహిత లావాదేవీలను ఉదాహరణగా చూపించి దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని ఎలా ఊహించగలరని కొంతమంది వాదించవచ్చు. కానీ బస్తర్ ఛాయ్ వాలా మొబైల్ వాలెట్ ద్వారా బిల్లు వసూలు చేస్తుండడం.. గుజరాత్ లోని ఓ గ్రామం నగదు రహితంగా మారిపోవడం.. బీహార్ లోని చిన్న చిన్న దుకాణ వ్యాపారులు కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ కు పూనుకోవడం.. వంటి విషయాలను సైతం గమనించాల్సి ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి:

ఇండియాలో ఆర్థిక నిపుణులుగా మంచి పేరున్న కొంతమంది వ్యక్తుల వాదనను ఓసారి పరిశీలిద్దాం. నగదు రహిత లావాదేవీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయులకు అవసరమైన మేర భరోసా లభించలేదు. కానీ ఏ ఒక్కరు చెప్పని.. గమనించాల్సిన విషయమేంటంటే.. దేశంలో ప్రతీది నగదు రహిత లావాదేవీ రూపంలోనే జరగదు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం.. నగదు రహిత లావాదేవీలను తగ్గించడానికే, భారతీయులు ఇందుకు సిద్దంగానే ఉన్నారు.

ఇక రెండో వాదన సాంకేతికతతో ముడిపడి ఉన్నటువంటిది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఎలా సాధ్యపడుతాయన్న ప్రశ్న వ్యక్తమవుతుంది.
ఇది నిజంగా ఆందోళన చెందించే విషయమే. స్మార్ట్ ఫోన్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. చదువురానివారు సైతం వినియోగించుకునేలా.. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారానే పేమెంట్స్ జరిపించే వెసులుబాటును కల్పించాలి. ఈ ప్రక్రియను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి.

ఇక ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కొంతమంది పేదల తరుపున మాట్లాడుతూ సత్యదూరంగా ఉన్న వాదనలు వినిపిస్తున్నారు. దేశంలో ఓ ఛాయ్ వాలా, ఓ న్యూస్ పేపర్ వాలా, పండ్ల వ్యాపారి... ఇలా ప్రతీ ఒక్కరు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కు అలవాటుపడుతున్నప్పుడు దేశంలోని ఇతర పేద ప్రజలు కూడా దీనికి అలవాటుపడడం అంత కష్ట సాధ్యం కాదేమో!

తొలి నుంచి కార్డుల ద్వారా లావాదేవీలకు అలవాటు పడ్డవారికి ఈ పరిస్థితి అంతగా ఇబ్బంది అనిపించకపోవడం.. పేద ప్రజలు ఇప్పుడే కొత్తగా దీని గురించి తెలుసుకోవాల్సి రావడం వల్ల కొంతమేర ఇబ్బంది ఉండవచ్చు. అయితే ఈ నగదు రహిత లావాదేవీలను వినియోగించుకోవడానికి మేధావులే కానవసరం లేదన్న విషయం గుర్తుంచుకోవాలి.

Indians are ready to try out a less cash economy

లావాదేవీల నమూనాను మార్చేస్తున్న ఇండియా:

నోట్ల రద్దు నిర్ణయంపై ఎవరి మాటెలా ఉన్నప్పటికీ.. కొన్ని గణాంకాలను పరిశీలించినప్పుడు మాత్రం ఆర్థిక వృద్దికి ఇది దోహదం చేస్తుందనే చెప్పాలి. ఓలా మనీ లావాదేవీలను పరిశీలిస్తే.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలోని 102సిటీల్లో 1500శాతం మేర వృద్దిని సాధించింది. 700శాతం వృద్దితో ఆ తర్వాతి స్థానంలో పేటీఎం ఉంది. 200శాతం వృద్దితో రేజర్ పే మూడో స్థానంలో ఉంది.

ఇంతకుముందుతో పోలిస్తే.. కార్దుల ద్వారా జరిగే రూ.500కన్నా తక్కువ లావాదేవీలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. ఇక 250 కన్నా తక్కువ లావాదేవీలు కార్డుల ద్వారా 177శాతం పెరిగాయి. మొత్తంగా రూ.250-500 లావాదేవీలు 133శాతం మేర పెరిగాయి. అదే సమయంలో రూ.500 కన్నా ఎక్కువ లావాదేవీలు కేవలం 75శాతం మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఇక రూ.700 కన్నా పైబడిన లావాదేవీలు అంతగా గమనించాల్సిన స్థాయిలో లేవు.

నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేందుకు దేశవ్యాప్తంగా చాలామంది చిరువ్యాపారులు స్వైపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు మూడు నుంచి నాలుగు వేల మంది వ్యాపారులు స్వైపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దుతో.. రాబోయే రోజుల్లో దేశంలో నగదు లావాదేవీలు 78శాతం మేర తగ్గనున్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ప్రస్తుతం అది 20శాతంగా కొనసాగుతోంది. ఏదేమైనా త్వరలోనే ఇండియా నగదు రహిత దేశంగా,తక్కువ నగదు మాత్రమే ఉపయోగించే దేశంగా ఇండియా మారబోతుంది.


-(స్మితా మిశ్రా, సలహాదారు, ప్రసార భారతి)

English summary
A week ago, my newspaper vendor Avneesh Kumar came to collect his bill. Even before I could check my wallet for the necessary cash, he smiled and said in his typical West UP accent 'Madam cheque de do na!'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X