హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ శాంతిని కోరుకునే వాతావరణం రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశాల మధ్య సత్సంబంధాలు బలపడాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నగరంలోని రాంకోఠిలోని షాలిమార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆలిండియా పీస్‌ అండ్‌ సాలిడారిటీ ఆర్గనైజేషన్‌ (ఎఐపిఎస్‌ఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఇండో-వియత్నాం పీపుల్స్ ఫ్రెండ్ షిప్ కల్చరల్ ఫెస్టివల్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ ఇండియా-వియత్నాం దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింతగా వర్థిల్లాలని పేర్కొన్నారు. అన్ని దేశాలు వారి వారి సంస్కృతి సంప్రదాయాలను ఇచ్చిపుచ్చుకుంటూ అభివృద్ధిని సాధించాలని ఆయన అన్నారు.

అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన వియత్నాం అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న వియత్నాం, క్యూబా, చైనా తదితర దేశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

వియత్నాం ఎంపీ వూ జువాన్‌ హంగ్‌ మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదులతో 40 సంవత్సరాల పాటు వీరోచిత పోరాటం చేసి ఓడించిన ఘనత వియత్నాం దేశ ప్రజలదని అన్నారు. వియత్నాం వీరుడు హోచిమిన్‌, నాటి భారత ప్రధాని నెహ్రూ కాలం నుంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఇరు దేశాల మధ్య 43 ఏళ్ల నుంచి పారిశ్రామిక సంబంధాలు బలపడ్డాయన్నారు. స్వాతంత్య్ర పోరాటం, ఆర్థిక నిర్మాణం, సాంస్కృతిక సంబంధాల్లో భారత్‌ - వియత్నాం మధ్యన సారూప్యత వుందన్నారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

వియత్నాం దేశాన్ని ఆక్రమించుకునేందుకు 25 లక్షల మంది అమెరికా సైనికులను అక్కడి నేలపై దించితే 25 సంవత్సరాల పాటు కమతాలలో తలదాచుకుంటూ సైనికులను తరిమికొట్టిన వియ త్నాం దేశ కామ్రేడ్లను హ మైన్ హు కొనియాడారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఆ పోరాటంలో 20 లక్షల మంది తినడానికి బియ్యం లేక చనిపోయిన సంఘటనలు ఉండేవని, అలాంటి వియత్నం దేశం నేడు బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు. ప్రపంచం మొత్తంగా 800 కోట్ల మంది ప్రజలు ఉంటే 300 కోట్లమంది కమ్యూనిస్టు పరిపాలనలోనే ఉన్నారని సమావేశంలో ఆయన గుర్తుచేశారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. వెంకట్‌ మాట్లాడుతూ అమెరికాను ఎదిరించిన పోరాటంలో 40 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అమెరికాతో కలిసి భారత్‌ సైనిక విన్యాసాలు చేయడం ఆందోళన కలిగిస్తోం దన్నారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ వందన సమర్పణ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌, వియత్నాం ఎంపీ హ మిన్‌ హు, ఎఐపిఎస్‌ఓ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ డి.సుధాకర్‌, ఎఐపిఎస్‌ఓ ప్రధాన కార్యదర్శి పల్లబ్‌సేన్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

వేదికపై ఇరు దేశాల జాతీయ పతాకాల ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వియత్నాం కళాకారుల సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. ఈ నెల 30 వర కు ఈ సౌహార్థ సభలు కొనసాగుతాయి. మంగళ వారం ఉదయం 32 మంది సభ్యులతో కూడిన వియత్నాం బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో పర్యటించింది.

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఘనంగా ఇండో-వియత్నాం కల్చరల్ ఫెస్ట్

ఈ నెల 27 తేదీ నుండి 30వ తేదీ వరకు వియత్నం దేశం నుంచి ప్రముఖులు భారతదేశంలోని హైదరాబాద్, బెంగుళూరు నగరాలను సందర్శించి శాంతి సమావేశాలను నిర్వహించనున్నట్లు సమావేశంలో పాల్గొన్న సిపిఐ నేత సుధాకర్‌రెడ్డి తెలిపారు.

English summary
indo-vietnam cultural festivals at shalimar function hall in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X