కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుష్కర సందడి: ఈత కొట్టిన టి మంత్రి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: గోదావరి పుష్కర వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పుష్కరాల మూడోరోజు కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగింది. మొదటి, రెండోరోజు మాదిరే మూడో రోజు కూడా ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. గురువారం ఉదయం వరకు అమావాస్య తిథి ఉండడంతో చాలా మంది భక్తులు పిండప్రదానం చేశారు.

కాగా, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం కాళేశ్వరం గోదావరిలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం ఆచరించారు. కాసేపు సరదాగా గోదావరి ఆయన ఈత కొట్టారు. ఆ తర్వాత కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుంభమేళా తరహాలో గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతున్నాయన్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు పూర్తి భిన్నంగా నేటి పుష్కరాలు ఉన్నాయన్నారు.

బ్రహ్మకుమారి ప్రతినిధులు కాలుష్య నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో శుక్రవారం నుంచే భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఐదు జిల్లాల్లో గురువారం ఒక్కరోజే ఆర్టీసీ 8,790 బస్సు సర్వీసులు నడిపింది. తొమ్మిది వేల ప్రైవేట్ వాహనాల్లో భక్తులు ఘాట్లకు వచ్చారని అధికారులు చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం కాళేశ్వరం గోదావరిలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆ తర్వాత కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుంభమేళా తరహాలో గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతున్నాయన్నారు.

ఈత కొడుతున్న ఇంద్రకరణ్

ఈత కొడుతున్న ఇంద్రకరణ్

భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈత కొడుతున్న ఇంద్రకరణ్

ఈత కొడుతున్న ఇంద్రకరణ్

గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు పూర్తి భిన్నంగా నేటి పుష్కరాలు ఉన్నాయన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుంభమేళా తరహాలో గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతున్నాయన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం కాళేశ్వరం గోదావరిలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆ తర్వాత కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

మంత్రికి కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని చిత్రపటాన్ని అందజేస్తున్న మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆలయ అధికారి మోహన్ శర్మ.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కాగా, గురువారం ఒక్కరోజే 8,45,050 మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కరీంనగర్ జిల్లాలో- 3,55,000, ఖమ్మం-2,00,000, ఆదిలాబాద్-1,50,000, నిజామాబాద్-1,00,050, వరంగల్-40,000 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, మంథని గౌతమీక్షేత్రం, కందకుర్తి సంగమస్థానాల్లో 2వేల మంది సత్యసాయి సేవాసంస్థల ప్రతినిధులు విరామం లేకుండా భక్తులకు మంచినీటి ప్యాకెట్లను అందిస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

బ్రహ్మకుమారి ప్రతినిధులు కాలుష్య నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో శుక్రవారం నుంచే భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

English summary
Telangana Minister Indrakaran Reddy have bath at Kaleshwaram, in Karimnagar district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X