వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: టాప్ 3 ఐటీ కంపెనీల్లో భారీగా తగ్గిన ఉద్యోగులు

ఐటీ పరిశ్రమ తీవ్ర మందగమనంలో ఉంది. తొలిసారిగా దేశీయ ఐటీ కంపెనీల్లోని మూడు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఐటీ చరిత్రలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే తొలిసారి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఐటీ పరిశ్రమ తీవ్ర మందగమనంలో ఉంది. తొలిసారిగా దేశీయ ఐటీ కంపెనీల్లోని మూడు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఐటీ చరిత్రలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే తొలిసారి.

కొంత కాలంగా ఐటీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాలు ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఇండియాలోని ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి పరిణామాలు కూడ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి.

స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొంది. దీని ప్రభావం కూడ ప్రధానంగా కన్పిస్తోంది. దీంతో ఇండియా నుండి అమెరికాకు టెక్కీలు వెళ్ళే అవకాశాలు లేకుండాపోయాయి.

ఆ మూడు కంపెనీల్లో భారీగా ఉద్యోగులు తగ్గారు

ఆ మూడు కంపెనీల్లో భారీగా ఉద్యోగులు తగ్గారు

ఇండియాకు చెందిన ఐదు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలున్నాయి. అయితే ఇందులో మూడు ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారు. జూన్ 30వ, తేది ముగిసిన క్వార్టర్‌లో ఈ విషయం తేటతెల్లమైంది. దేశంలోని ఐదు టాప్ కంపెనీల్లో జూన్ క్వార్టర్ ముగిసేసరికి 9,84,913 మంది ఉద్యోగులున్నారు. వారి వర్క్‌ఫోర్స్ గత క్వార్టర్ మార్చితో పోలిస్తే 1,821 మంది తగ్గిపోయింది. 2017 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో దేశీయ ఐటీ పరిశ్రమ 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ వెల్లడించింది.

Recommended Video

Good News for Techies Find Out More - Oneindia Telugu
నాస్కామ్ అంచనాలు తప్పాయి

నాస్కామ్ అంచనాలు తప్పాయి

కనీసం 1,50, 000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నాస్కామ్ అంచనావేసింది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్ అంచనాలు తప్పేలా కన్పిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసుల సంస్థగా పేరున్న టీసీఎస్ వర్క్‌ఫోర్స్ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌తో 1,414 మంది తగ్గి 3,85,909 ఉంది. అదే విధంగా ఇన్పోసిస్ ఉద్యోగాలు నికరంగా 1,811 పడిపోయాయి. టెక్ మహీంద్రాలో కూడ 1,713 మంది వర్క్‌ఫోర్స్ తగ్గిపోయారు.

విప్రో, హెచ్‌సీఎల్ వర్క్‌ఫోర్స్ నికరంగా

విప్రో, హెచ్‌సీఎల్ వర్క్‌ఫోర్స్ నికరంగా

విప్రో, హెచ్‌సిఎల్ మాత్రమే నికర అడిక్షన్‌ను నమోదుచేశాయి. విప్రోలో ఇన్పోసర్వర్ కొనుగోలుతో కొత్తగా 200 మంది ఉద్యోగులు జాయిన్ అయ్యారు. అదనంగా మరో వెయ్యి మంది ఉద్యోగులను తమ క్లయింట్ వర్క్‌ఫోర్స్‌ను నుండి తీసుకొంది. మిగతా ఐటీ కంపెనీలు ఎల్‌అండ్ టీ ఇన్పోటెక్ , మైండ్ ట్రీ , కెపిఐటీ టెక్నాలజీస్, హెక్సావేర్ కంపెనీలు ఈ క్వార్టర్‌లోనే 2,026 మందిని కొత్తగా ఉద్యోగులుగా నియమించుకొంది.

వర్క్‌ఫోర్స్ తగ్గించుకోనేందుకు కారణాలివే

వర్క్‌ఫోర్స్ తగ్గించుకోనేందుకు కారణాలివే

బిజినెస్ మోడల్ మారడంతో పాటు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో కంపెనీలు తీవ్ర కఠిన నిర్ణయాలను తీసుకొంటున్నాయి. ట్రంప్ రక్షణాత్మక విధానాలు. ఆటోమేషన్ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత వర్క్‌పోర్స్ విషయంలో కోతలు పెడుతున్నాయి.ఈ ప్రభావంతో టాప్ 7 ఐటీ కంపెనీలు 56 వేల మంది ఇంజనీర్లను ఉద్యోగాల నుండి తొలగించాయి. గత ఏడాది నుండి ఈ సంఖ్య రెండింతలు పెరుగుతోందని అంచనావేస్తున్నాయి కంపెనీలు.

English summary
The $154 billion Indian information technology (IT) sector, once India’s largest creator of jobs, is now struggling to even add to its workforce. For the first time, three of the five largest IT companies saw their workforce shrink in the quarter ended 30 June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X