బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐనా కోహ్లీయే బెస్ట్: మంచిపేరు లేనివాడే గెలిపించాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరేంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ 9లో అతనే టాప్ స్కోరర్. అయితే, వెయ్యి పరుగులు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అతను వెయ్యి పరుగులు చేస్తాడేమోనని అభిమానులు ఎదురు చూశారు.

ఆదివారంతో ఐపీఎల్ 9 ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచులో కోహ్లీ 79 పరుగులు చేస్తే వెయ్యి పరుగులు మైలురాయి చేరుకునేవాడు. కానీ ఈ మ్యాచులో 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తద్వారా 973 పరుగుల వద్ద ఆగిపోయాడు. టాప్ స్కోరర్ మాత్రం అతనే.

ఐపీఎల్ 9లో స్టార్లు వీరే..

ఛాంపియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్, ప్రైజ్ మనీ రూ.15 కోట్లు
రన్నరప్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్రైజ్ మనీ రూ.10 కోట్లు
ఆరేంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) - 973 (16 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) - 23 వికెట్లు (17 ఇన్నింగ్స్), భువనేశ్వర్ కుమార్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఎమర్జింగ్ ప్లేయర్ - 17 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్) - బెన్ కటింగ్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
అత్యధిక సిక్సులు (ఫైనల్) - 8, క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ - కోహ్లీ (356.5 పాయింట్లు)
ఫెయిర్ ప్లే అవార్డు - సన్ రైజర్స్ హైదరాబాద్
అత్యధిక సిక్సులు - 38, విరాట్ కోహ్లీ
ఓ ఇన్నింగ్సులో మోస్ట్ సిక్సెస్ - 12, డివిల్లీయర్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
అత్యధిక ఫోర్లు - 88, డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఓ ఇన్నింగ్సులో అత్యధిక ఫోర్లు - 15, డికాక్ (ఢిల్లీ డేర్ డెవిల్స్)
అత్యధిక సెంచరీలు - 4, కోహ్లీ
అత్యధిక అర్ధ సెంచరీలు - 9, వార్నర్
వేగవంతమైన అర్ధ సెంచరీలు - క్రిస్ మోరిస్ 17 బంతుల్లో, పొలార్డ్ 17 బంతుల్లో
వేగవంతమైన సెంచరీ - డివిల్లీయర్స్ 43 బంతుల్లో
బెస్ట్ క్యాచ్ - సురేష్ రైనా (గుజరాత్ లయన్స్)
ఫ్రీచార్జ్ బోల్ట్ సీజన్ అవార్డు - డివిల్లీయర్స్ (19 క్యాచులు)
విటారా బ్రీజ్జా గ్లామ్ షాట్ - డేవిడ్ వార్నర్

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 9లో అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. అతను 973 పరుగులు చేశాడు. వెయ్యి పరుగులు చేస్తాడని అందరూ ఎదురు చూశారు. కానీ ఫలించలేదు.

క్రిస్ గేల్

క్రిస్ గేల్

ఐపీఎల్ 9లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో క్రిస్ గేల్ రెచ్చిపోయాడు. కానీ బెంగళూరు మాత్రం గెలవలేకపోయింది. ఫైనల్లో అత్యధిక సిక్సులు గేల్ కొట్టాడు.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుండి జట్టును గెలిపించాడు. ఆది నుంచి అతనే ఆ జట్టును ఆదుకుంటున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా వందకు వంద మార్కులు పడ్డాయి. ఆసిస్ జట్టులో అతనికి అంత మంచి పేరు లేదు. వివాదాస్పదుడుగా ఉన్నాడు. అందుకే కెప్టెన్సీ చేపట్టే అవకాశం కోల్పోయాడు. కానీ ఐపీఎల్లో మాత్రం బాగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా చక్కటి వ్యూహాలు ప్రదర్శించాడు.

గెలిచిన ఆనందం

గెలిచిన ఆనందం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన గెలిచిన అనంతరం రైజర్స్ ఆటగాళ్ల ఆనందం.

సన్ రైజర్స్

సన్ రైజర్స్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన గెలిచిన అనంతరం రైజర్స్ ఆటగాళ్ల ఆనందం. ఫెయిర్ ప్లే అవార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుచుకుంది.

బెన్ కటింగ్

బెన్ కటింగ్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన బెన్ కటింగ్ బౌలింగులు, బ్యాటింగులో సత్తా చాటాడు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ముస్తాఫిజుర్ రెహ్మాన్

ముస్తాఫిజుర్ రెహ్మాన్

ఐపీఎల్ 9లో బంగ్లాకు చెందిన సన్ రైజర్స్ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్

ఐపీఎల్ 9లో సన్ రైజర్స్ జట్టు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకున్నాడు. పర్పుల్ క్యాప్ ఇతని సొంతమైంది. పైనల్లో వికెట్లు తీయకపోయినప్పటికీ.. బ్యాటింగ్ బలం బాగా ఉన్న బెంగళూరు జట్టుకు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు.

English summary
Royal Challengers Bangalore (RCB) captain Virat Kohli won the Orange Cap honours with a record tally of 973 runs as the curtains came down on the Indian Premier League 2016 (IPL 9) here tonight (May 29) at the M Chinnaswamy Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X