వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసూర్ ఉత్సవాలు: టికి తొలి బహుమతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మైసూర్: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నిర్వహించిన జంబూసవారీలో తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. కర్ణాటకేతర విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం శకటం ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.

తెలంగాణ శకటం తోపాటు జానపద కళాకారులు శ్రీధర్ బృందంచే పేరిణి శివతాండవం మరియు కచ్చు
అంజయ్య బృందంచే ఒగ్గు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా, ద్వితీయ బహుమతి పుదుచ్చేరికి లభించింది.

కర్ణాటక రాష్ట్రం నుంచి పాల్గొన్న శకటాల్లో మైసూరు విభాగంలో మైసూరు, హాసన్, బెంగళూరు విభాగంలో తమకూరు, శివమొగ్గ, గుల్బర్గ విభాగంలో బళ్లారి, కొప్పళ, బెళగావి విభాగంలో గదగ్, బాగల్‌కోట జిల్లాల శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి.

దాదాపు 5 కిలోమీటర్లు భారీ బందోబస్తుతో శకటాల ఊరేగింపు జరిగింది. వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన
శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ తరపున ప్రజా సంబంధాల అధికారి భాస్మోజు విద్యనందాచారి, పర్యాటక శాఖ తరపున శశిధర్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నిర్వహించిన జంబూసవారీలో తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించింది.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

కర్ణాటకేతర విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం శకటం ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

దాదాపు 5 కిలోమీటర్లు భారీ బందోబస్తుతో శకటాల ఊరేగింపు జరిగింది.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ తరపున ప్రజా సంబంధాల అధికారి భాస్మోజు విద్యనందాచారి, పర్యాటక శాఖ తరపున శశిధర్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ శకటం

తెలంగాణ శకటం

తెలంగాణ శకటానికి ప్రథమ బహుమతి లభించగా, ద్వితీయ బహుమతి పుదుచ్చేరికి లభించింది.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ శకటం తోపాటు జానపద కళాకారులు శ్రీధర్ బృందంచే పేరిణి శివతాండవం మరియు కచ్చు
అంజయ్య బృందంచే ఒగ్గు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

English summary

 The rich heritage and culture of Karnataka was on display at the jamboo savari on the final day of Dussehra festivities on Saturday. The tableaux from newly formed Telangana state and Puducherry also made to the jamboo savari with their depiction of Alampura Jogulamba Shakti Peetam and Indo-French architure respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X