ట్విస్ట్: రిలయన్స్ ఫోన్‌తో టెలికం పరిశ్రమకు ఆదాయం, ఎలాగంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ త్వరలో ప్రవేశపెట్టనున్న ఫీచర్ ఫోన్‌తో పరిశ్రమలో ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతోందని ఫిచ్ తెలిపింది.ఈ ఫోన్ టెలికం పరిశ్రమను లాభాల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పరిశ్రమకు కొంతలోనైనా ఇబ్బందులు తప్పే అవకాశాలుంటాయని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

జియో ఎఫెక్ట్: వోడాపోన్ బంపర్‌ఆఫర్

సంచలనాలతోనే రిలయన్స్‌జియో మార్కెట్లోకి ప్రవేశించింది. ఉచితంగా డేటా, వాయిస్‌కాల్స్‌తో రిలయన్స్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ ఆఫర్లతో జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది.

శుభవార్త: 3 కోట్ల విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇవ్వనున్న జియో

అయితే మరోవైపు జియో తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చాల్సిన పరిస్థితులు కూడ నెలకొన్నాయి. జియో పద్దతులను అనుసరించాల్సిన పరిస్థితులు కూడ లేకపోలేదు.

తాజాగా ఫీచర్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టుగా ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్‌లో అనేక ఆఫ్షన్లు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

టెలికం పరిశ్రమ ఆదాయం పెరుగుదల ఇలా

టెలికం పరిశ్రమ ఆదాయం పెరుగుదల ఇలా

జియో ఫీచర్ ఫోన్ కారణంగా టెలికం పరిశ్రమ ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఫిచ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.జియో ఫోన్ల వల్ల ఇంటర్నెట్ వాడకం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. దీని కారణంగా టెలికం కంపెనీల ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడనుందని ఆ నివేదిక తెలుపుతోంది.

Reliance Jio's Big Announcement on July 21, Here's What You Want
మార్కెట్ వాటా 10 శాతానికి

మార్కెట్ వాటా 10 శాతానికి

రిలయన్స్ ఫీచర్ ఫోన్ కారణంగా ఈ కంపెనీకి మరో 10 కోట్ల మంది వినియోగదారులు జతచేరనున్నారు. అయితే ఆదాయం విషయంలో 2018 నాటికి మార్కెట్ వాటా 10 శాతానికి చేరుతోందని ఈ నివేదిక వెల్లడించింది. కనీసం పదికోట్లమంది వినియోగదారులు చేరితే వార్షిక పరిశ్రమ ఆదాయానికి ఈ హ్యాండ్‌సెట్ల వల్ల అదనంగా 3-4 శాతం అంటే 950 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది.

4జీ ఫోన్ వాడే సంఖ్యలో పెరుగుదల

4జీ ఫోన్ వాడే సంఖ్యలో పెరుగుదల

జియో ఫీచర్‌ఫోన్ కారణంగా దేశంలో 4జీ ఫోన్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2 జీ ఫోన్ల స్థానంలో చాలా వేగంగా 4జీ హ్యండ్‌సెట్లు కన్పించే అవకాశం లేకపోలేదు. అధిక డేటా రేట్లు, గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ ఇంటర్నెట్ వ్యాప్తి తక్కువగా ఉంది.

జియో మరిన్ని ఆఫర్లు ప్రకటించే అవకాశంః

జియో మరిన్ని ఆఫర్లు ప్రకటించే అవకాశంః

వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడం వల్ల జియో మరిన్ని కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆ నివేదిక అభిప్రాయపడుతోంది. దీని కారణంగా ఇతర కంపెనీలు కూడ జియో తరహలోనే టారిఫ్‌ప్లాన్లను ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది.రిలయన్స్ ప్రకటించిన రూ.153 టారిఫ్ అనేది గ్రామీణ వినియోగదారుల నుండి వచ్చే సగటు ఆదాయం కంటే 50శాతం ఎక్కువ. ఇది పరిశ్రమ ఆదాయానికి మద్దతుగా ఉండే అవకాశం లేకపోలేదు.

టెలికం పరిశ్రమ ఆదాయం రూ.40వేల కోట్లు

టెలికం పరిశ్రమ ఆదాయం రూ.40వేల కోట్లు

2017 మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయం అంతక్రితంతో పోలిస్తే 15.6 శాతం తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారంగా 6.1 శాతం బిలియన్ డాలర్ల (రూ.40,000 కోట్లు) ఆదాయానికి టెలికం పరిశ్రమ చేరుకొంది. జియో ఇచ్చిన ఆఫర్ల కారణంగా టెలికం పరిశ్రమ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఇదివరకు కొన్ని నివేదికలు ప్రకటించాయి.అయితే రిలయన్స్ ప్రకటించిన ఫీచర్ కారణంగా టెలికం పరిశ్రమ ఆదాయం పెరిగే అవకాశాలున్నట్టుగా తాజాగా ఫిచ్ నివేదిక వెల్లడించం శుభపరిణామం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The cheap 4G handset offer from Reliance Jio is "likely" to help the company add 100 million more subscribers and take its revenue market share to 10 per cent by 2018 and help reverse the falling industry revenue trend, says a report.
Please Wait while comments are loading...