వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత రహస్యంగా.. అగ్ని 5: చైనాను వణికిస్తున్న హైదరాబాద్!

ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని 5ను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. ఇది చైనాను వణికించే అస్త్రం! ఈ అస్త్రం రూపుదిద్దుకున్నది హైదరాబాదులోని కంచన్‌బాగ్ డీఆర్డీవోలో.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని 5ను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. ఇది చైనాను వణికించే అస్త్రం! ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ అస్త్రం రూపుదిద్దుకున్నది హైదరాబాదులోని కంచన్‌బాగ్ డీఆర్డీవోలో.

ఈ క్షిపణి అనధికారికంగా ఎనిమిది వేల నుంచి పదివేల కిలోమీటర్లలోని లక్ష్యాలను చేధించగలదంని తెలుస్తోంది. ఈ పరీక్షతో భారత్ అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాల సరసన చేరింది.

అంతా హైదరాబాదులోనే..

అంతా హైదరాబాదులోనే..

ఈ క్షిపణి డిజైన్ నుంచి అభివృద్ధి వరకు అంతా హైదరాబాదులోనే జరిగింది. 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డారు. అగ్ని సిరీస్ క్షిపణుల తయారీలో మరో వందమంది శాస్త్రవేత్తలు సహాయసహకారాలు అందించారు.

మిసైల్ కోసం పని చేశాయి

మిసైల్ కోసం పని చేశాయి

అగ్ని 5లో ఉపయోగించిన చాలా వరకు పరికరాలు హైదరాబాదులోనే తయారయ్యాయి. ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబోరేటరీ (ఏఎస్ఎల్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (డీఆర్డీఎల్)లు ఈ మిసైల్ కోసం పని చేశాయి.

రోడ్డు మార్గాన రహస్యంగా ఒడిశాకు

రోడ్డు మార్గాన రహస్యంగా ఒడిశాకు

అగ్ని 5 పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక హైదరాబాద్ నుంచి దానిని ఒడిశాకు భారీ ట్రక్కుల సాయంతో రోడ్డు మార్గంలో తరలించారు. క్షిపణిని పన్నెండుకు పైగా భాగాలుగా నవిడగొట్టి వీలర్ ఐలాండుకు పంపించారు. అనంతరం అసెంబుల్ చేశారు. ఈ క్షిపణి విజయవంతం కావడంతో చైనా వణుకుతోంది!

ఎందరో పని చేశారు

ఎందరో పని చేశారు

200 మంది శాస్త్రవేత్తలు, అగ్ని సిరీస్‌లోనే పని చేసిన మరో 100 మంది శాస్త్రవేత్తల సహాకారంతో పాటు.. కొంతమంది యువ శాస్త్రవేత్తలు, విద్యారంగంలోని వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

English summary
One place that China should feel wary+ of is Kanchanbagh in the city, which is the address for development of India's missile might.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X