వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద మహిళ బ్యాంకు ఖాతాలో రూ. 95వేల కోట్లు!

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: ఓ పేద మహిళకు చెందిన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ. 95వేల కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ విషయం ఆమె ఫోన్‌కు సందేశం ద్వారా వచ్చింది. ఎంతో ఆశ్చర్యానికి గురైన ఆమె తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేసింది. అందులో కూడా రూ. 95వేల కోట్ల రూపాయలు ఉన్నట్లుగా చూపింది. మరోసారి అవాక్కైన ఆ మహిళ, బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కి చెందిన ఊర్మిళా యాదవ్ అనే మహిళ కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్ ధన్ యోజన' పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచింది.

అందులో రూ. 2వేలు జమ చేసింది. కాగా, కొన్ని రోజుల క్రితం ఆమె మొబైల్ ఫోన్‌కు రెండు మెసేజ్‌లు వచ్చాయి. అందులో మొదటిది రూ. 9,99,999 మీ అకౌంట్‌లో జమయ్యాయి అని, రెండోది అందులోంచి 9.7 లక్షలు డెబిట్ కావడంతో రెండు వేలు ఉన్నాయని మెసేజ్‌లు వచ్చాయి.

ఆశ్చర్యపోయిన ఆమె బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది. దీంతో ఆమె ఖాతా తనిఖీ చేయగా ఆమె ఖాతాలో రూ. 9,571,16,98,647.14 మొత్తం ఉన్నట్టు తేలింది. బ్యాంకు అధికారులు కూడా సరిగ్గా పలకలేకపోయిన ఆ మొత్తం చూసి ఊర్మిళకు గుండెపోటు వచ్చినంత పని అయింది. అయితే ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ వివరణ ఇచ్చారు.

Kanpur Woman Finds Rs 95,000 Crore In Her Bank Account

ఊర్మిళ ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం లేదని, దాంతో ఆమె ఖాతాలో 95 వేల కోట్లు జమ చేసి తర్వాత దానిని తీసేశామని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆమె ఖాతాలోని ఆమెకు చెందిన రూ. 2వేలు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

English summary
A few days ago, a woman from Kanpur, who works as a domestic help, became one of the richest women when an amount of Rs 95,71,16,98,647 was credited to her State Bank of India (SBI) account, reports Hindustan Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X