వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేథ్స్‌లో భళా: మళ్లీ గిన్నిస్‌కెక్కిన కరీంనగర్ బాలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar girl makes it to Guinness book of World Records
కరీంనగర్ పట్టణంలోని భగవతి ఉన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న శివ యజ్ఞిక ఫ్రాంజోనియా అనే చిన్నారి గిన్నిస్ రికార్డులకెక్కింది. శివ యాజ్ఞిక 222 యొక్క 'పై' విలువ దశాంశ స్థానాలను సెకండ్లలో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తద్వారా గిన్నిస్ బుక్‌లో చోటు కోసం ప్రయత్నించి సఫలమైంది.

శుక్రవారం నాడు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడో తరగతి చదువుతున్న ఈ ఏడేళ్ల చిన్నారి తన మేథస్సును ప్రదర్శించారు. గణితవేత్తలు తదితరులు ఈ కార్యక్రమం వీక్షించి ఆమెకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో గిన్నిస్ రికార్డ్ ప్రతినిధి వేణు ఆమెకు జ్ఞాపికను అందించారు.

శివ యజ్ఞిక 222 'పై' విలువను మొదటి ప్రయత్నంలో 40.48 సెకండ్లలో, రెండో ప్రయత్నంలో 38.25 సెకంట్లలో, మూడో ప్రయత్నంలో 36.36 సెకండ్లలో ఎలాంటి తప్పులు లేకుండా దశాంశ విలువలను చెప్పింది. గతంలో ఈ రికార్డ్ 142 యొక్క 'పై' విలువ పైన ఉంది.

శివ యజ్ఞిక ఆరేళ్ల ఎనిమిది నెలల వయస్సులో ఉన్నప్పుడు 15 దేశాల జాతీయ గీతాలను ఆలపించింది. ఇప్పుడు ఆమె వయస్సు ఏడు సంవత్సరాల ఏడు నెలలు.

English summary
A third standard student of Bhagavathi High School in Karimnagar town entered the Guinness Book of World Records by memorising the Pi value of 222 digits after the decimal within a minute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X