హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు చోట్ల భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. శివాలయాల్లో తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కార్తీక దీపాల వెలుగులో ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి

.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీచ్‌ల్లో ప్రజలు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. కొన్ని ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయాలూ కిక్కిరిసాయి.

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు


భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు


మలక్‌పేటలోని శ్రీ హరిహర క్షేత్రం మైసమ్మ దేవాలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయానికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం దేశ వ్యాప్తంగా హిందువులు పుణ్య నదుల్లో స్నానమాచరించారు. శివపార్వతులను స్మరిస్తూ దీపారాధన చేశారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి ఆలయ దర్శనానికి వెళతారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించినవారికి సకల సంపదలు దరిచేరతాయని నమ్మకం.
కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు


ఇందులో భాగంగా మహన్యాసక పూర్వకరుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని విశ్వాసంగా భావిస్తారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేధారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుంది.

 కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా అలహాబాద్‌లోని త్రివేణిసంగమం, అయోధ్యలోని సరయు నది వద్ద భక్తుల సందడి కనిపించింది. భక్తులు పుణ్య స్నానాలు చేసి తరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కార్తీక పౌర్ణమి శోభ కనిపించింది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

 కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, శ్రీరాముని సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రద్దీ పెరిగిపోయింది. మల్లికార్జున స్వామి దర్శనానికి జనం పోటెత్తారు.

 కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు

కార్తీక శోభ: భక్తిశ్రద్ధలతో వేడుకలు


సింహాచల వరాహ నరసింహ స్వామి క్షేత్రం, నల్లగొండ జిల్లా యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు. గోదావరి, కృష్ణా నదులతోపాటు బాపట్ల సూర్యలంక, ఒంగోలు, విశాఖ కాకినాడ, బందరు సముద్ర తీరాల్లో భక్తులు కార్తీక స్నానాలు చేశారు.

English summary
Temples across the city witnessed long queues of devotees, on Wednesday in view of ‘Karthika Pournami’, the traditional festival celebrated on the full moon day of ‘Karthika Masam’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X