హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ త్రిశక్తిమయమోక్ష మహాగణపతి ఘట్టం నేత్రపర్వంగా సోమవారం రాత్రి ముగిసింది. ఆదివారం మధ్యాహ్నాం ప్రారంభించాల్సిన పనులు సోమవారం తెల్లవారుజామున ప్రారంభం కావడంతో నిమజ్జనం ఆలస్యమైంది.

ఉదయం 3.30 గంటలకు నిమజ్జనం ఘట్టం ప్రారంభమైంది. గంటలకు గజేంద్ర మోక్ష ప్రతిమను తీయడానికి చిన్న క్రేన్‌ను రప్పించారు. 4.30గంటలకు డీసీఎం వాహనంలో కూర్చోబెట్టారు. 6 గంటలకు మహాగణనాథుడి నిమజ్జనానికి సిద్ధం చేసేందుకు భారీ క్రేన్‌ను తీసుకొచ్చారు.

6.52గంటలకు క్రేన్ సహాయంతో లడ్డూపై ఉన్న ఎల్‌ఈడీ గొడుగును తొలగించారు. 7.30 గంటలకు మహా ప్రసాదాన్ని కిందికి దించారు. 7.40కి లడ్డూకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్యాక్ చేసి తిరిగి ఎల్‌ఈడీ గొడుగును అమర్చారు. 7.50 గంటలకు గణేశుని మండపానికి భారీ ట్రాలీని తీసుకొచ్చారు.

8.30 గంటలకు క్రేన్‌కు సంబంధించిన తీగలను గణేశుడికి అమర్చారు. 8.45గంటలకు 15 అడుగుల ఎత్తుకు క్రేన్ ద్వారా పైకి లేపారు. 9.15కు షోడాపచార పూజ చేసి గణేశున్ని ట్రాలీపై కూర్చోబెట్టారు. 10గంటలకు వెల్డింగ్ పనులు ప్రారంభించి 12 గంటలకు పూర్తి చేశారు. 12.50 గంటలకు వాహనానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు.

మధ్యాహ్నం 1 గంటకు శోభాయాత్ర ప్రారంభమైంది. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ అనుగుణంగా 2.45 గంటలకు రాజ్‌ధూత్ హోటల్, 3.05 గంటలకు టెలిఫోన్ భవన్, 3.52 గంటలకు ఇక్బాల్ మినార్, 4.09 గంటలకు తెలుగుతల్లి ప్లైఓవర్, 5.18 గంటలకు లుంబినీ పార్కు, సాయంత్రం 6.22 గంటలకు గణేశునికి పూజలు, మంగళహారతులిచ్చారు.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

భాగ్యనగరి వీధులు జనసంద్రమయ్యాయి. దారులన్నీ హుస్సేన్‌సాగర్‌కు దారితీశాయి. ఖైరతాబాద్‌ త్రిశక్తి మోక్ష గణపతి శోభాయాత్రలో జనం పులకించారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న పార్వతీ తనయుడు సెలవు తీసుకుని గంగమ్మ ఒడికి చేరాడు.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

దారి పొడవునా మేళ తాళాలతో, అంబరాన్నంటిన సంతోషాలతో భక్తజనం త్రిశక్తి మయ గణనాధుడికి వీడ్కోలు పలికారు. హుస్సేన్‌సాగర్‌ భక్తజన సంద్రమైంది. ఖైరతాబాద్‌ త్రిశక్తి మోక్ష గణపతి నిమజ్జన శోభాయాత్రతో హైదరాబాద్ మహానగరం మురిసిపోయింది. వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

గణపతి బప్పా మోరియా అనే నామస్మరణతో లక్షలాది గొంతులు పులకించాయి. సోమవారం ఉదయం నుంచి సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల జయజయ ధ్వానాలతో ట్యాంక్‌బండ్‌ హోరెత్తింది.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల నుంచి పూజలందుకున్న గణనాథుడు రాత్రి 10 గంటల సమయంలో గంగమ్మ ఒడికి చేరాడు.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌ సాయంతో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. భక్తజనం కేరింతల మధ్య లంబోదరుడి నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

లక్ష్మీ, సరస్వతి సమేతుడై.. ఆది శేషుని పడగ నీడలో భారీ సింహాసనంపై కొలువుదీరిన 59 అడుగుల మహాకాయుడి దర్శనానికి చివరి రోజైన ఆదివారం లక్షలాది భక్తులు తరలివచ్చారు. దీంతో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు దర్శనం కొనసాగింది.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

నవరాత్రోత్సవాల్లో దాదాపు 10లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిసింది. గతేడాది ప్రపంచ రికార్డుల్లో ఒకటైన హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఈ ఏడాది మహాదేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లిబాబు లడ్డూ ఆ రికార్డును సొంతం చేసుకుంది. 6వేల కిలోల బరువుతో ఉన్న ఈ లడ్డూ ప్రపంచంలో అతి పెద్దగా నమోదైంది.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

త్రిశక్తిమయుడి ఎడమవైపు ప్రతిష్ఠించిన భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయలేదు. అమ్మవారిని దసరా నవరాత్రోత్సవాలు జరిగిన అనంతరం శాస్ర్తోక్తంగా నిమజ్జనం చేయాలా లేక విగ్రహాన్ని ఏదైనా ప్రాంతానికి దేవాలయం కోసం తరలించాలా అనేది త్వరలోనే ప్రకటిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

దేవదేవున్ని మహాప్రసాదమైన లడ్డూను ఈ నెల 30న వితరణ చేస్తామని గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అందులో కొంత భాగానికి లడ్డూ దాత మల్లిబాబుకు అందచేసి మిగతా మొత్తాన్ని భక్తులకు పంచుతామన్నారు. పోలీసుల భద్రత నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేనప్పటికి, గతంలో జరిగిన ఉస్మాన్‌పుర అల్లర్లను దృష్టిలో ఉంచుకుని స్థానికులకు పూర్తి భరోసాగా పోలీసులు భద్రతను కల్పించారు.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాలను వెలికితీసే పనిలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం, హెచ్‌ఎండీఏ నిమగ్నమైంది. పెద్ద ఎత్తున ఏర్పడిన చెత్త, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ రెండు శాఖలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.

 ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ సోమవారం సాయంత్రం నాటికి 1,345 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించింది. 6,500 మంది సిబ్బంది రెండు షిఫ్టులుగా ట్యాం క్‌బండ్‌తోపాటు నగరంలోని 26 నిమజ్జన ప్రాంతా ల్లో, ప్రధాన రహదారుల్లో చెత్తను తొలగిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన తీరు సాగిందిలా

అలాగే, అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని, దాదాపు 180 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలతో ఈ వ్యర్థాలు, చెత్తను తొలగించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.

6.48 గంటలకు 4వ నెంబర్ క్రేన్ ప్రాంతానికి చేరుకుంది. 7 గంటలకు రాడ్ కటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 9.49గంటలకు ప్రముఖ శంఖు కళాకారుడు శంఖ్ వల్లభ్ శంఖాన్ని పూరించారు. పూజల అనంతరం రాత్రి 10.10 నిమిషాలకు మహాగణపతి హుస్సేన్ సాగర్‌లోకి చేరుకున్నాడు.

English summary
Khairatabad Ganesh Immersion 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X