హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ లడ్డూ సూపర్: తొక్కిసలాట(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైరతాబాద్ కైలాస విశ్వరూప గణేశుడికి నివేదించిన మహా ప్రసాదమైన లడ్డూను గురువారం 3వేల మందికి పంపిణీ చేశారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు వినాయకుడికి 5వేల కిలోల భారీ లడ్డూను తయారుచేసి వినాయక చవితి రోజున సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ భారీ లడ్డూలో సగభాగం భక్తులకు, మరో సగభాగం తయారీదారునికి పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. లడ్డూ ప్రసాదాన్ని పొందేందుకు 5వేల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 6గంటలకు మహా ప్రసాదానికి ఉత్సవ కమిటీ సభ్యులు సింగారి సుదర్శన్, మహేశ్ యాదవ్, సందీప్ రాజ్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం లడ్డూ ప్రసాదాన్ని ఉత్సవ కమిటీ పోలీస్ బలగాల పహారాలో గురువారం పంపిణీ చేశారు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగిసింది. పార్వతీ తనయుని ప్రసాదాన్ని తీసుకునేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరారు. బుధవారం రాత్రి నుంచే భక్తులు ఖైరతాబాద్ లైబ్రరీ సమీపంలో ప్రసాదం కోసం వచ్చి అక్కడే వేచి ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు గురువారం ఉదయమే బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ కైలాస విశ్వరూప గణేశుడికి నివేదించిన మహా ప్రసాదమైన లడ్డూను గురువారం 3వేల మందికి పంపిణీ చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు వినాయకుడికి 5వేల కిలోల భారీ లడ్డూను తయారుచేసి వినాయక చవితి రోజున సమర్పించిన విషయం తెలిసిందే.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ఈ భారీ లడ్డూలో సగభాగం భక్తులకు, మరో సగభాగం తయారీదారునికి పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

లడ్డూ ప్రసాదాన్ని పొందేందుకు 5వేల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 6గంటలకు మహా ప్రసాదానికి ఉత్సవ కమిటీ సభ్యులు సింగారి సుదర్శన్, మహేశ్ యాదవ్, సందీప్ రాజ్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

అనంతరం లడ్డూ ప్రసాదాన్ని ఉత్సవ కమిటీ పోలీస్ బలగాల పహారాలో గురువారం పంపిణీ చేశారు. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగిసింది.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

పార్వతీ తనయుని ప్రసాదాన్ని తీసుకునేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరారు. బుధవారం రాత్రి నుంచే భక్తులు ఖైరతాబాద్ లైబ్రరీ సమీపంలో ప్రసాదం కోసం వచ్చి అక్కడే వేచి ఉన్నారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు గురువారం ఉదయమే బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

రైల్వేగేట్ వైపునుంచి పురుషులను, మింట్‌కాంపౌండ్ వైపు నుంచి మహిళలను క్యూలైన్‌లలో అనుమతించారు. అయినా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న భక్తులతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ఒక్కొక్కరిగా ప్రసాదం పంపిణీ చేస్తుండగా, క్యూలైన్లలో లేని వారు తమకు కూడా ప్రసాదం ఇవ్వాలంటూ గొడవకు దిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ పూర్తికావడంతో ప్రసాదం కోసం క్యూలైన్లలో ఉన్న వారు, అక్కడికి వచ్చిన వారు నిరాశకు గురయ్యారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ప్రసాదం అందిన వారు మాత్రం లడ్డూ రుచి సూపర్ అంటూ స్వీకరించారు. ప్రసాదం దొరకని వీ వాంట్ లడ్డూ అని నినాదాలు చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ప్రసాదం పంపిణీలో భాగంగా కొందరు భక్తులు ప్లాస్టిక్ కవర్లు నిర్వాహకులకు అందజేయడంతో వాటిలో లడ్డూను నింపి కిక్కిరిసిన జనం మధ్యలో నుంచి విసిరే క్రమంలో అవి నేలపాలయ్యాయి.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

గణేశుని ప్రసాదం నేలపాలు కావడంతో పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

ప్రసాదం పంపిణీ పర్వం సజావుగా సాగినప్పటికీ కొద్దిసేపటికే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో పోలీసులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు వారిని ఆపలేకపోయాయి.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

రైల్వే గేటు నుంచే భారీ లైను ఏర్పడటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది.

ఖైరతాబాద్ లడ్డూ

ఖైరతాబాద్ లడ్డూ

క్యూలైన్లు దారి తప్పడంతో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు ముందుకు దూసుకెళ్లారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

English summary
Khairatabad Laddu prasadam distributed on Thursday at Khairatabad, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X