వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూదరి ప్లస్ కోటీశ్వరుడు: లాస్ వేగాస్ మారణ హోమం ఓ మిస్టరీ

లాస్ వేగాస్ మాండ్రియల్ రిసార్ట్స్ వద్ద మారణ హోమానికి ఒడిగట్టిన స్టీఫెన్ ప్యాడాక్ ఒక రిటైర్డ్ అక్కౌంటెంట్‌గా కోట్లు సంపాదించి..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లాస్‌వేగాస్: అతడో కోటీశ్వరుడు.. జూదమంటే ఇష్టం. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడమంటే సరదా. క్రూయిజ్ షిప్పుల్లో విహారయాత్రలంటే తెగ మోజు. ఇదీ లాస్‌వెగాస్‌లో నరమేధం సృష్టించిన స్టీఫెన్ ప్యాడాక్ వ్యక్తిగత జీవితం. అకౌంటెంట్‌గా చట్టబద్ధంగానే కోట్లు సంపాదించిన స్టీఫెన్ ప్యాడాక్‌కు రకరకాల తుపాకులు సేకరించడం హాబీ. అమెరికాలో ఇది మామూలే.

పైగా స్టీఫెన్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గానీ, నేర చరిత్ర ఉన్నట్లు గానీ రికార్డులు లేవు. అతడు ఏదో ఒకరోజు తుపాకులతో జనం మీదపడి నెత్తుటేర్లు పారిస్తాడని ఎవరూ కనీసం ఊహించలేదు. గతంలో సామూహిక హత్యాకాండకు పాల్పడ్డ వారంతా యువకులే. కానీ స్టీఫెన్ వయసు 64 ఏండ్లు. రెండుసార్లు విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం గర్ల్‌ఫ్రెండ్‌తో నెవాడా రిటైర్మెంట్ కమ్యూనిటీలో విశ్రాంత జీవితం గడుపుతున్నాడు.

ఎటువంటి పూర్వ నేర చరిత్రలేని ఓ రిటైర్డ్ అకౌంటెంట్ దారుణ మారణకాండకు ఎందుకు పాల్పడ్డాడన్నది మిస్టరీగా మారింది. అమెరికాలో తాజాగా నరమేధం సృష్టించిన స్టీఫెన్‌ ప్యాడాక్‌ను.. ఆ దుశ్చర్యకు పాల్పడేలా పురిగొల్పిన విషయాలేవో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు కూడా.. ప్యాడాక్‌కు నేరచరిత్ర గానీ, ఆర్థిక సమస్యలు గానీ లేవని చెబుతున్నారు. సంగీత కచేరీ ఆస్వాదిస్తున్న వేలమంది ప్రేక్షకులపై ఒక్కసారిగా విరుచుకుపడటం వెనుక అతని ఉద్దేశ్యం లేదా లక్ష్యం ఏమిటో అంతుచిక్కడం లేదని అమెరికా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

 మానసిక ఉన్మాది అని అభివర్ణించిన లాస్ వేగాస్ అధికారి

మానసిక ఉన్మాది అని అభివర్ణించిన లాస్ వేగాస్ అధికారి

లాస్ వెగాస్‌లో ఆదివారం రాత్రి సామూహిక హత్యాకాండకు పాల్పడిన స్టీఫెన్ ప్యాడాక్ తమ సైనికుడేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటనపై అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. ప్యాడాక్‌కు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఎఫ్‌బీఐ పేర్కొంది. లాస్ వెగాస్ పోలీస్ అధికారి జోసఫ్ లొంబార్డో మాత్రం అతడిని మానసిక ఉన్మాది అని అభివర్ణించారు.

 స్టీఫెన్ ప్రియురాలు డాన్లే ఇలా

స్టీఫెన్ ప్రియురాలు డాన్లే ఇలా

స్టీఫెన్ ప్యాడాక్ హోటల్ గదిలో ఆటోమేటిక్ తుపాకులతో సహా 29 ఆయుధాలు లభించాయని చెప్పారు. మెస్కైట్‌లోని అతని ఇంట్లో కూడా 19 ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వేల రౌండ్ల తూటాలు లభించాయని తెలిపారు. ఇదిలా ఉండగా, హంతకుని స్నేహితురాలిగా భావిస్తున్న మారిలౌ డాన్లే ఆస్ట్రేలియా పౌరురాలని వెల్లడైంది. ఫిలిప్పీన్స్‌లో పుట్టిన డాన్లే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారని, 20 ఏండ్ల క్రితం ఆమె అమెరికాకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు. స్టీఫెన్ లాస్‌వెగాస్‌లో రక్తపుటేరులు పారించినప్పుడు ఆమె అమెరికాలో లేరని చెప్పారు. ఆమె ఇప్పుడు జపాన్ లేదా ఫిలిప్పీన్స్‌లో ఉండవచ్చని భావిస్తున్నారు. 62 ఏండ్ల డాన్లేకు మనుమలు, మనుమరాండ్లు ఉన్నారని ఆమె సోదరి లీజా వర్నర్ చెప్పారు.

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు

గతంలో అకౌంటెంట్‌గా పనిచేసిన ప్యాడాక్‌ కోటీశ్వరుడని.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతుండేవాడని అతడి సోదరుడు ఎరిక్‌ ప్యాడాక్‌ వివరించారు. అతడికి జూదం ఆడే అలవాటు ఉందని పేర్కొన్నారు. ‘‘ప్యాడాక్‌ దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. జూదంలో ఎప్పుడు గెలిచినా నాకు చెప్పేవాడు. ఓడిపోయినప్పుడూ వాటి గురించి ప్రస్తావిస్తుండేవాడు'' అని ఎరిక్‌ అన్నారు. ప్యాడాక్‌తో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్యాడాక్‌ ప్రియురాలు కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. లాస్‌ వెగాస్‌లో వీడియో పోకర్‌ జూద క్రీడలో ప్యాడాక్‌ పందాలు కాసేవాడని సమాచారం. వెగాస్‌కి 126 కి.మీ. దూరంలోని మెస్కిట్‌లో ఉన్న ప్యాడాక్‌ నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. ఇక్కడికి 800 కి.మీ. దూరంలోని రెనోలో కూడా ప్యాడాక్‌కు గల మరో ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

దాడికి ఇలా స్టీఫెన్ ప్యాడాక్ ప్లాన్

దాడికి ఇలా స్టీఫెన్ ప్యాడాక్ ప్లాన్

మారణకాండను సృష్టించేందుకు ప్యాడాక్‌ తెచ్చుకున్న ఆయుధాల్లో రెండింటికి.. ఆటోమేటిక్‌ రైఫిళ్ల తరహాలో పని చేసేలా మార్పులు చేసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్యాడాక్‌ వద్ద రెండు బంప్‌స్టాక్‌ పరికరాలు లభించాయన్నారు. ఆటోమేటిక్‌ రైఫిల్‌లో ట్రిగ్గర్‌ నొక్కి ఉంటే.. మ్యాగజైన్‌ ఖాళీ అయ్యే వరకూ తూటాలు వెలువడుతాయి. ఇటు సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌లో ఒక్కో తూటాను పేల్చాల్సిన ప్రతిసారీ ట్రిగ్గర్‌ను లాగాల్సి ఉంటుంది. అదే దీనికి బంప్‌స్టాక్‌ పరికరాన్ని అమర్చితే.. తూటా వెలువడిన ప్రతిచర్యకు తుపాకీనే ముందుకూ వెనక్కి కదిలి వెంటనే మరోసారి ట్రిగ్గర్‌ నొక్కినట్లవుతుంది. ట్రిగ్గర్‌పై వేలు ఉంచితే.. ఆటోమేటిక్‌ రైఫిల్‌ తరహాలోనే వేగంగా తూటాలు వెలువడుతుంటాయి. నిమిషానికి 400 నుంచి 800 రౌండ్ల కాల్పులు జరిపేందుకు వీలు కలుగుతుంది.

 స్టీఫెన్ ఏడేళ్ల వయస్సులో బెంజమిన్ అరెస్ట్

స్టీఫెన్ ఏడేళ్ల వయస్సులో బెంజమిన్ అరెస్ట్

ప్యాడాక్‌కు నేర చరిత్ర లేకున్నా.. అతడి కుటుంబ నేపథ్యం గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్యాడాక్‌ తండ్రి బెంజమిన్‌ హోస్కిన్స్‌ ప్యాడాక్‌ పలు బ్యాంకుల్లో దోపిడీలకు పాల్పడ్డ గజదొంగ. 1960లో ఎఫ్‌బీఐ ఏజెంటును కారుతో గుద్దేందుకూ ప్రయత్నించాడు. బెంజమిన్‌ అరెస్టయిన సమయంలో ప్యాడాక్‌ వయసు ఏడేళ్లు. ఇటు 1968లో టెక్సాస్‌లోని జైలు నుంచి పరారైన బెంజమిన్‌ను.. ఎఫ్‌బీఐ ‘మోస్ట్‌ వాంటెడ్‌'జాబితాలో చేర్చింది. పదేళ్ల తర్వాత అతడు మళ్లీ అధికారులకు చిక్కాడు. కానీ చిన్నతనంలో బెంజమిన్ గురించి స్టీఫెన్ ప్యాడాక్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

English summary
Police have named Stephen Paddock, a 64-year-old from Mesquite, Nevada, as the suspect who opened fire from a high-rise hotel on a country music concert in Las Vegas and killed at least 59 people in the worst mass shooting in recent US history. Las Vegas sheriff Joe Lombardo said Swat officers found Paddock dead, apparently having killed himself, on the 32nd floor of the Mandalay Bay Resort and Casino. Officers found him with at least 10 rifles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X