వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య విద్యపై ఆశలు: పిల్లలపై మానసిక ఒత్తిళ్లు..అశాస్త్రీయ బోధన

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అన్నది నానుడి. కానీ వైద్య విద్యలో సీటు వస్తుందో రాదోనని విద్యార్థినీ విద్యార్థులు తమకు 'ఎ' కేటగిరీ సీటు దక్కకుంటే భవిష్యత్ లేదన భావన వారిలో పెరిగిపోతున్నది. కలతతో ఉన్న విద్యార్థులపట్ల కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు అవలంబించే అశాస్త్రీయ విధానాలతో తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారి ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న వారే ఆత్మహత్యకు పాల్పడుతుండటం గమనార్హం.

ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇంటర్ చదువుతున్న, పూర్తై శిక్షణ పొందుతున్న నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఇద్దరు బాలురు బాలురు, ఇద్దరు బాలికలు. బాలురిద్దరు ఇంటర్‌ ఎంపీసీ చదువుతుండగా, బాలికలిద్దరూ నీట్‌ దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారు కావడం గమనార్హం. ఇంటి నుంచి అదృశ్యమైన సాయి ప్రజ్వల కూడా నీట్‌ లాంగ్‌టర్మ్‌ విద్యార్థినే కావడం గమనార్హం. ఎంబీబీఎస్‌ సీటు రాదనే భయంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు నీట్‌ విద్యార్థుల ఆత్మహత్య లేఖలను బట్టి తెలుస్తోంది.

 ఇలా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు

ఇలా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు

వాస్తవంగా కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి ఒకలా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు కూడా పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పిల్లల ఇష్టానికి వదిలేస్తే సమస్యలు తలెత్తవు. వైద్య విద్య ఎంత ఉత్క్రుష్టమైనదో అంతకంటే ఎక్కువ విలువైన జీవితం. ఆ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకుని తమ ఆశలు, ఆకాంక్షలకు తావు లేకుండా ఒత్తిళ్లకు అతీతంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇష్టంగా ముందుకెళ్లిన విద్యార్థులు మాత్రమే విజయం సాధించగలరని పరిణామాలు చెప్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకు చేరిన విద్యార్థుల మానసిక పరిస్థితి విభిన్నంగా ఉంటోంది. దీనికి తోడు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై (ఇప్పుడిప్పుడే మనోవికాసం పెరుగుతున్న వేళ) బలవంతపు ఆజమాయిషీ చేయడం కూడా ఇబ్బందులకు కారణమవుతున్నది. ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరించగలిగితే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

 సీ కేటగిరీ సీట్ల ఫీజు తడిసి మోపెడు

సీ కేటగిరీ సీట్ల ఫీజు తడిసి మోపెడు

గత ఏడాది నుంచి ఎంబీబీఎస్‌ బీ, సి కేటగిరీ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. కన్వీనర్‌ కోటా (ఎ కేటగిరీ) సీటు దక్కకుంటే బీ కేటగిరీ లేదా సీ కేటగిరీకి వెళ్లాల్సిందే. బి కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.11 లక్షలు, ఇక సి కేటగిరీ దానికి రెట్టింపు ఉంది. దాంతో అసలే తక్కువ సీట్లు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కన్వీనర్‌ సీటు రాకుంటే భారీ ఫీజులు చెల్లించి వైద్య విద్యను అభ్యసించలేమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలల యాజమాన్యాలు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మనోస్థైర్యం కోల్పోకుండా చర్యలు తీసుకోవడానికి బదులు ర్యాంకుల కోసం మరింత ఒత్తిడి పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నీట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తుండటం.. అందులో మైనస్‌ మార్కులు ఉండటం కూడా విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

 ఓసీ విద్యార్థులకు 450 మార్కులు దాటితేనే..

ఓసీ విద్యార్థులకు 450 మార్కులు దాటితేనే..

ర్యాంకుల కోసం ఒత్తిళ్లు తెస్తున్న కళాశాలల యాజమాన్యాలు
కళాశాలలు పెట్టే పరీక్షల్లో 720 మార్కులకు 450కి తగ్గితే ఇక సీటు రావడం (ఓసీలకు) కష్టమేనని విద్యార్థులు అంచనాకు వస్తున్నారు. మార్కుల స్థాయి పెరగకుంటే ఇక లాభం లేదని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ర్యాంకుల కోసం కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు ఊపిరి సలపకుండా బోధించడం, చదివించడం చేస్తున్నారు. నిద్ర సరిపోక.. సమయం లేక పలువురు విద్యార్థులు ప్రతిరోజూ స్నానాలు కూడా చేయని పరిస్థితి నెలకొంది. స్టడీ అవర్‌లోనూ యాజమాన్యాలు చెప్పిందే చదవాలి. తాను ఒక సబ్జెక్టులో వెనకబడి ఉన్నానని.. దాన్ని చదువుకుంటానన్నా వీల్లేదు. ఎంబీబీఎస్‌ సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ ఉన్నందున ఒత్తిడి తీవ్రంగా ఉంటుందనే విషయం యాజమాన్యాలకు తెలిసినా ఏ మాత్రం ఆటలు, వినోదానికి సమయం కేటాయించడం లేదు. ‘జైల్లో ఖైదీలనైనా కాస్సేపు గాలి మార్పు కోసం ప్రాంగణంలోకి వదులుతారు గానీ.. కళాశాలలల్లో విద్యార్థులను మాత్రం వదలడం లేదు' అని గతంలో కార్పొరేట్‌ కళాశాలలో పనిచేసిన అధ్యాపకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

కళాశాలల్లో సమస్యల వల్లే బలవన్మరణాలని ఇలా

కళాశాలల్లో సమస్యల వల్లే బలవన్మరణాలని ఇలా

ఆగస్టు రెండో తేదీన ఆత్మహత్యకు పాల్పడిన ఓ విద్యార్థి తన తండ్రి లేఖ రాస్తూ ‘నాన్న.. నాకు అన్నయ్య మాదిరిగా మార్కులు రావడం లేదు. మెడిసిన్ సీటు రాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించండి' అని సూసైడ్ నోట్ పెట్టారు. ఈ నెల 12న మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో నీట్ శిక్షణ పొందుతున్న సంయుక్త అనే విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తానని భయంగా ఉన్నదని, ఇప్పుడు బాగా చదవలేకపోతున్నానని, ఈ తరుణంలో చావే తనకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవ్మరణానికి పాల్పడ్డారు. ఇక ఈ నెల 15వ తేదీన అద్రుశ్యమైన సాయి ప్రజ్వల ‘అందరినీ మిస్ అవుతున్నా. ఈ కళాశాల వేస్ట్. అక్కడి సమస్యలతోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు' అని బండ్లగూడ నారాయణ కాలేజీలో పరిస్థితులను వివరించారు.

ఇంటర్ గురుకుల విధాన నిబంధనలే లేవు

ఇంటర్ గురుకుల విధాన నిబంధనలే లేవు

ఇంటర్‌బోర్డు కేవలం కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇస్తోంది. అసలు రెసిడెన్షియల్‌ కళాశాలల విధానమే బోర్డు నిబంధనల్లో లేకపోవడం గమనార్హం. దానివల్ల కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ దాదాపు శూన్యం. బోర్డు అధికారులు తనిఖీ చేయబోతే అవి విద్యార్థులు నిర్వహించుకుంటున్న వసతిగృహాలు (స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు) అని యాజమాన్యాలు బుకాయిస్తున్నాయి. అందుకే కార్పొరేట్‌ కళాశాలలు కూడా ఎక్కడా దొరకకుండా కేవలం కళాశాల అని మాత్రమే బోర్డులపై రాస్తున్నాయి. ఇప్పటికైనా రెసిడెన్షియల్‌ కళాశాలలకు నిబంధనలు రూపొందించి ఆ మేరకు అనుమతులు ఇస్తే చర్యలు తీసుకోవడానికి, తనిఖీలకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక సంస్థలు, ఆర్‌అండ్‌బీ, ప్రజారోగ్యం, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలతో బృందాలను నియమించి తరచూ తనిఖీలు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఆచార్య నీరజారెడ్డి కమిషన్‌ సూచించినట్లుగా ఉదయం ఏడు గంటల లోపు, రాత్రి తొమ్మిది గంటల తర్వాత విద్యాబోధన గానీ, స్టడీ అవర్లు గానీ ఉండకూడదు. కానీ, ఈ అంశాన్ని ఇంటర్‌బోర్డు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలకు వెయ్యి చదరపు మీటర్ల ఆట స్థలం తప్పనిసరనే నిబంధన ఉంది. విపరీతమైన ఒత్తిడితో చదువును కొనసాగించే కార్పొరేట్‌ కళాశాలలు మాత్రం ఈ నిబంధనలను పాటించకపోవడం గమనార్హం.

 ప్రభుత్వ కాలేజీల్లో 1000 సీట్లతో పోటీ తీవ్రతరం

ప్రభుత్వ కాలేజీల్లో 1000 సీట్లతో పోటీ తీవ్రతరం

తెలంగాణ నుంచి నీట్‌ రాస్తున్న వారు50 వేల మంది ఉంటే వారిలో నీట్‌ దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారు సుమారు 20,000 మంది విద్యార్థులు ఉంటారు. మూడోసారీ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు దాదాపు 3,000 మంది ఉంటారు. ఇక ఎంబీబీఎస్‌‌లో ఏ కేటగిరీ కింద 2075 సీట్లకు ఏడాది ఫీజు రూ.60 వేలు చెల్లించాలి. బీ కేటగిరీలో 718 సీట్లలో చేరే వారు ఏటా రూ.11 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా సి కేటగిరీ 207 సీట్లు ఉన్నాయి. సీ కేటగిరీలో చేరే విద్యార్థులు బీ కేటగిరీ కంటే రెండు రెట్లు అధికంగా రూ.22 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది.

English summary
Last Two years 'MBBS' aspirant students faces tremondus pressure from all sides. NEET exam pattern has minus marks while it leads to some tension in students. Additionally private corporate colleges style of coaching also problematic to students. There is problem with Parents aspirations for thier kids. They would have to freely preparing to NEET is essential otherwise it leads and creates so many problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X