వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ జపాన్‌గా భారత సంతతి యువతి, కానీ..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

టోక్యో: భారత సంతతి యువత విదేశాల్లో తమకు నచ్చిన రంగాల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా, భారత మూలాలున్న జపాన్‌ అందాల భామ ప్రియాంక యోషికవా(22) 'మిస్‌ జపాన్‌' కిరీటాన్ని సొంతం చేసుకుంది. భారతీయుడైన తండ్రి, జపాన్‌ దేశస్థురాలైన తల్లి నుంచి అందచందాలన్నీ పుణికి పుచ్చుకుందీ సుందరి.

భారతీయురాలిని కాదు, కానీ థ్యాంక్స్: ప్రియాంక

భారత్ నుంచి తనకు పెద్ద సంఖ్యలో సందేశాలు వస్తున్నాయని, అందరూ తనకు అభినందనలు తెలియజేస్తున్నారని ప్రియాంక తెలిపింది. కానీ, తాను భారతీయురాలిని కాదు అని చెప్పినా సందేశాలు వస్తూనే ఉన్నాయని.. అయినా తనకు అభినందనలు తెలియజేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పింది.

అంతేగాక, తాను తరచూ ఇండియాకు వస్తానని, భవిష్యత్తులో కోల్‌కతాలోని అనాథలు, నిరాశ్రయులైన చిన్నారులకు సాయం చేసేందుకు ఏదైనా చేయాలని భావిస్తున్నట్లు 'ఎన్డీటీవీ 'తో మాట్లాడుతూ వెల్లడించింది.

తాను భారతీయురాలిని కాకపోయినా.. తనపై ప్రేమ చూపిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. కాగా, స్వాతంత్ర్య పోరాట కాలంలో తన తాత మహాత్మాగాంధీకి కోల్‌కతాలోని తమ నివాసానికి ఆహ్వానించి.. రెండు రోజులపాటు బస ఏర్పాటు చేశారని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా, హాఫ్ ఇండియా, హాఫ్ జపాన్ అయిన ప్రియాంకకు మిస్ జపాన్ టైటిల్ ఇవ్వడంపై పలువురు జపనీయులు మండిపడుతున్నారు.

{photo-feature}

English summary
A half-Indian woman has been crowned Miss Japan, the second year in a row a biracial person has won the beauty pageant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X