నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాందేవ్ బాబాను కలిసిన ఎంపీ కవిత.. ఎందుకు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నిజామాబాద్‌లో ప‌తంజ‌లి స్పైస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల‌ని నిజామాబాద్ ఎంపి

శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల కవిత పతంజ‌లి గ్రూప్ ట్ర‌స్టీ, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను
కోరారు. శుక్ర‌వారం సాయంత్రం డిల్లీలో ఆమె బాబా రామ్‌దేవ్‌ను క‌లిశారు. ఈ స‌ద‌ర్భంగా ఆమెమాట్లాడుతూ ద‌క్షిణభార‌తంలో సుగంధ ద్ర‌వ్యాల‌ను ఈ ప్లాంట్ ద్వారా సేక‌రించ‌వ‌చ్చ‌న్నారు.

ప‌సుపు రైతుల‌నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయ‌డం వ‌ల్ల వారికి మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించ‌డ‌మే కాక ఆయుర్వేద, సహజ ఉత్పత్తులకు అవసరమైన నాణ్యమైన పసుపు
దొరుకుతుందని తద్వారా ప‌సుపు సాగును ప్రోత్స‌హించిన‌ట్ల‌వుతుంద‌న్నారు. గుజ‌రాత్‌లో పతంజ‌లి గ్రూప్ దానిమ్మ ప‌ళ్ల‌ను నేరుగా రైతుల‌నుంచి కొనుగోలు చేస్తూ వారికి
బాస‌ట‌గా నిలుస్తున్న‌ద‌న్నారు.

అలాగే నాగ్ పూర్‌లో ఏర్పాటు చేసిన ఆరెంజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా అక్క‌డి రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌న్నారు. దేశీయ‌ పసుపు సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 40 శాతం కాగా,
దేశం లోని మొత్తం ఉత్పత్తిలో 63 శాతంగా ఉంది. నా నియోజకవర్గం అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంద‌ని తెలిపారు. ప్ర‌ధానంగా ప‌సుపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, అసోం ప‌శ్చిమ బెంగాల్, మేఘాల‌య రాష్ట్రాల‌లో ఎక్కువ‌గా సాగవుతున్న‌ద‌ని క‌విత
వివ‌రించారు.

MP Kavita met Ramdev Baba for spice unit

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలను క‌ల్పించింద‌ని, స‌కాలంలో
విత్తనాలు, ఎరువులు అంద‌జేస్తున్న‌ద‌ని తెలిపారు. అలాగే రైతుల ప్రయోజనం కోసం ఇతర
ఇన్‌పుట్స్‌ను అందించ‌డంలో ప్ర‌భుత్వం ఎల్ల‌వేళలా సిద్ధంగా ఉంద‌న్నారు. ప్రపంచ
వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ప‌తంజ‌లి గ్రూప్‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న మీకు ప‌సుపు ప్రాముఖ్య‌తతో పాటు ప‌సుపు రైతుల క‌ష్టాలు కూడా తెలుసున‌న్నారు.

నిజామాబాద్‌లో స్పైస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల నేరుగా ప‌సుపును రైతుల‌ను
కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని, అలాగే ద‌క్షిణ‌ భారతదేశం నుండి ఇతర సుగంధ ద్రవ్యాలను కొనుగోలు
చేయ‌వ‌చ్చ‌ని సూచించారు. వీటిని దేశీయంగా వినియోగించుకోవ‌చ్చ‌ని అవ‌స‌రమ‌యితే ఎగుమ‌తి కూడా చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ప్లాంట్ల ఏర్పాటుకు అవస‌ర‌మైన అనుమ‌తులు త్వ‌రితంగా
అందేలా చూస్తాన‌న్నారు. ప‌సుపు రైతుల‌ను నేరుగా క‌లిసేందుకు నిజామాబాద్‌కు రావాల‌ని
క‌విత రాందేవ్ బాబాను ఆహ్వానించారు. ప‌సుపు బోర్డు ఏర్పాటుకు స‌హ‌క‌రించండి నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటుకు మ‌ద్ధ‌తుగా కేంద్రానికి లేఖ రాయాల‌ని బాబా రాందేవ్‌ను ఎంపి క‌విత కోరారు.

ఇప్ప‌టికే తాను మ‌హారాష్ట్ర, కేర‌ళ ముఖ్య‌మంత్రులు దేవేంద్ర ప‌డ్న‌వీస్‌, ఊమెన్ చాందీల‌ను క‌లిసి మ‌ద్ధ‌తు కోరార‌ని, వారు సానుకూలంగా స్పందించి మ‌ద్ధ‌తు లేఖ‌ల‌ను రాశార‌ని క‌విత తెలిపారు. గ‌త కేంద్ర వాణిజ్య శాఖ‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిశాన‌న్నారు. గ‌త
రెండేళ్ల‌లో రెండు సార్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిశాన‌ని ప‌సుపు రైతుల‌ను ఆదుకుంటామ‌ని మోడీ హామీనిచ్చిన విష‌యాన్ని ఆమె రాందేవ్ బాబాకు చెప్పారు.

స‌మావేశంలో కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గం టిఆర్ఎస్ ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ పాల్గొన్నారు.

English summary
MP Kavita met Ramdev Baba and asked him to establish of spice unit in nizambad under patanjali .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X