హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు సన్మానం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవలే ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్ వాసి రోహిత్ ఖండేల్‌వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ ఇండియాగా నిలిచిన రోహిత్ ఖండేల్‌వాల్‌ను నగరంలోని ఆరోరా డిగ్రీ కాలేజీ శుక్రవారం సన్మానించింది.

మిస్టర్ ఇండియాగా నిలిచి తెలంగాణ కీర్తి పతాకాన్ని జాతీయ స్ధాయిలో రెపరెపలాడించాడు. మోడలింగ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఓ సాధారణ యువకుడిగా ముంబైలో అడుగుపెట్టానని ఈ సందర్భంగా మీడియాతో చెప్పాడు.

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యానంటే, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని అన్నారు. 'మాది మార్వాడీ కుటుంబం. పుట్టంది, పెరిగింది చదివింది అంతా హైదరాబాద్‌లోనే' అని తెలిపారు.

 'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

నాన్న వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి అందరిలా కాకుండా విభన్న రంగంలో నన్ను నేను నిరూపించు కోవాలనుకునే వాణ్ణి. ఉద్యోగాన్ని వదిలి ముంబై వెళ్లానని తెలిపారు. అక్కడికి వెళ్లే ముందు స్పెస్ జెట్ ఎయిర్ లైన్స్, డెల్ ఇంటర్నేషనల్‌లో పని చేశానని చెప్పారు.

 'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

ముంబై కొత్తకావడంతో మొదట్లో చాలా కష్టపడ్డానని చెప్పారు. అంతేకాదు చిన్న చిన్న ప్రకటనలు చేసేవాణ్ణి అని అన్నారు. అనతికాలంలోనే మింత్రా, బిగ్ బజార్ లాంటి బ్రాండ్లకు మోడల్‌గా పినిచేసే అదృష్టం లభించిందని అన్నారు.

 'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

ఆ తర్వాత కరీనాకపూర్‌తో కలిసి చేసిన మలబార్ జ్యూవెలరీ ప్రకటన నా జీవితాన్నే మార్చేసందని చెప్పుకొచ్చారు. నా టాలెంట్‌ను ఫ్యాషన్ లోకానికి పరిచయం చేసిందని అన్నారు. బిందాస్ ఛానల్‌లో 'యే హై ఆషికీ' ఎపిసోడ్‌లో నటించానని తెలిపారు.

 'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

బీ ఛానెల్‌లో త్వరలో ప్రసారం కాబోయే 'మిలియన్ డాలర్ గర్ల్' సీరియల్‌లో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది యవకులు హాజరయ్యారు.

 'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

'మిస్టర్ ఇండియా' రోహిత్‌కు అరోరా సన్మానం

పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో రోహిత్ విజేతగా నిలవగా, బెంగుళూరుకు చెందిన రాహుల్ రాజశేఖరన్ తొలి రన్నరప్‌గా, ముంబైకి చెందిన ప్రతీక్ గుజ్రాల్ రెండో రన్నరప్‌గా నిలిచాడు.

English summary
The last one week has been a riveting journey for Mr India 2015 Rohit Khandelwal. Rohit stood out against 10,000 odd applicants to stake claim to the title. Honouring his success, Aurora Degree College in Chikkadpally, from where Rohit graduated from, felicitated him on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X