హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాంపల్లి మెట్రో స్టేషన్‌.. చాలా ప్రత్యేకం! ఒకేవైపునకు.. మెట్లు, లిప్టులు, ఎస్కలేటర్లు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రాజె క్టు ఓ ఇంజనీరింగ్‌ అద్భుతమే! ఒంటి స్తంభంపై రెండు రైళ్లు రాకపోకలు సాగించేలా మెట్రో కారిడార్‌.. నడి రోడ్డు మీదే రెక్కలు విచ్చుకున్న పక్షుల్లా.. మెట్రో స్టేషన్లు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు హైదరాబాద్‌ మెట్రో రైలు సొంతం.

నగరంలో రద్దీ మార్గాల్లో ప్రతి కిలోమీటరుకు ఒక మెట్రో స్టేషన్‌ను నిర్మించారు. మొదటి దశలో 30 కి.మీ మార్గంలో 24 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో- అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 16 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణంలో ఉంది.

 ఒకే వైపునకు మెట్లు, లిప్టులు, ఎస్కలేటర్లు...

ఒకే వైపునకు మెట్లు, లిప్టులు, ఎస్కలేటర్లు...

ఈ మార్గంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద నిర్మిస్తున్న మెట్రో స్టేషన్‌ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 64 మెట్రో స్టేషన్లలో.. నాంపల్లి మెట్రో స్టేషన్ చాలా చాలా ప్రత్యేకం. ప్రస్తుతం నాంపల్లి మెట్రో స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మెట్రో స్టేషన్‌ వద్ద స్థలం అందుబాటులో లేకపోవడంతో మెట్లు, లిప్టులు, ఎస్కలేటర్లను ఒకేవైపు నిర్మిస్తున్నారు.

తక్కువ మొత్తంలో భూసేకరణ, అందుకే...

తక్కువ మొత్తంలో భూసేకరణ, అందుకే...

నాంపల్లి (హైదరాబాద్‌) రైల్వే స్టేషన్‌కు తూర్పు ముఖంగా ఉన్న రహదారిపై స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. స్టేషన్‌కు ఒక వైపు హోటళ్లు, లాడ్జీలు, ఇతర భవనాలు ఉండడంతో ఎక్కువ మొత్తంలో భూసేకరణ చేయడం సాధ్యం కాలేదు. మెట్రో స్టేషన్‌ వద్ద ఆస్తుల స్వాధీనం కోసం నాలుగేళ్లుగా వేచి చూసినా అనుకున్న విధంగా స్థలం అందుబాటులోకి రాలేదు. దీంతో మెట్రో స్టేషన్‌ డిజైన్‌ను పూర్తిగా మార్చి.. ఉన్న స్థలానికి అనుగుణంగా నిర్మాణాన్ని చేపట్టారు.

 డిజైన్ మార్చిన అధికారులు...

డిజైన్ మార్చిన అధికారులు...

తక్కువ మొత్తంలో భూసేకరణ జరగడంతో నాంపల్లి మెట్రో స్టేషన్‌ డిజైన్‌ను మెట్రోరైల్ అధికారులు మార్చేశారు. ఈ స్టేషన్‌కు ఒకవైపే మూడు చోట్ల మెట్ల మార్గాలు, లిప్టులు, ఎస్కలేటర్లను నిర్మిస్తున్నారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్.. నగరంలోని మిగతా స్టేషన్లకంటే చాలా భిన్నంగా ఉండడంతో నగరవాసులు దీని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

 స్కైవాక్‌లు నిర్మించే ప్రతిపాదన...

స్కైవాక్‌లు నిర్మించే ప్రతిపాదన...

మెట్రో స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన మేర స్థలం అందుబాటులో లేకపోవడంతో డిజైన్‌ను మార్చి నిర్మాణం చేపడుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. దీనివల్లే స్టేషన్‌ నిర్మాణం చాలా ఆలస్యమైందన్నారు. ఇదిలా ఉంటే నాంపల్లి మెట్రో స్టేషన్‌ - రైల్వే స్టేషన్లను అనుసంధానించేందుకు స్కైవాక్‌లను నిర్మించే ప్రతిపాదన ఉందని మెట్రో అధికారులు వెల్లడించారు.

English summary
Nampally Metro Station is a special in Hyderabad Metro Rail Project. Due to less place, Officials of the HMR changed the design of this station and constructing the Steps, Lifts, Escalators in oneside only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X