వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీల కోసం ప్రత్యేక యాప్ ఇదే: ఎక్కడ జాబ్స్ ఉన్నా వెంటనే తెలిసిపోతుంది!

ఓ వైపు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తామంటూ హెచ్చరికలు, మరో వైపు అమెరికా కష్టాలు, ఐటీ ఇండస్ట్రీ కొంత తిరోగమనమవుతున్న తరుణంలో టెక్కీల కోసం ఉపయోగపడే ఓ కొత్త యాప్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓ వైపు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తామంటూ హెచ్చరికలు, మరో వైపు అమెరికా కష్టాలు, ఐటీ ఇండస్ట్రీ కొంత తిరోగమనమవుతున్న తరుణంలో టెక్కీల కోసం ఉపయోగపడే ఓ కొత్త యాప్ రూపుదిద్దుకుంది. తమకు ఉద్యోగాలు ఎలా? అనుకుంటున్న టెక్కీల కోసం ఐడీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆ యాపే 'స్టార్టప్ జాబ్స్'(Startup Jobs).

ఎక్కడ ఖాళీలున్నా..

ఎక్కడ ఖాళీలున్నా..

ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ ద్వారా వెంటనే టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కు అలర్ట్‌లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ వంటి స్టార్టప్స్‌లో ఎంపిక చేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. అభ్యర్థులు ఈ యాప్‌లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో కంపెనీలు అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి, ఇంటర్వ్యూలకు పిలుస్తాయి.

టెక్కీలూ! నేర్చుకోకపోతే అంతే: 6లక్షల ఐటీ జాబ్స్‌కు ఎసరు!టెక్కీలూ! నేర్చుకోకపోతే అంతే: 6లక్షల ఐటీ జాబ్స్‌కు ఎసరు!

వెంటనే స్టేటస్..

వెంటనే స్టేటస్..

కంపెనీలు తమ ప్రొఫైల్స్‌ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-ఫోయిస్ సిస్టమ్స్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

పెద్ద సంస్థలకే సేవలు

పెద్ద సంస్థలకే సేవలు

లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిషన్ సింగ్ ఈ స్టార్టప్‌ను స్థాపించారు. హచ్చీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ లాంటి సంస్థలు కస్టమర్లుగా ఉండటం గమనార్హం.

మంచి ప్రత్యామ్నాయం

మంచి ప్రత్యామ్నాయం

ప్రస్తుత మార్కెట్లో ఉద్యోగాలను వెతుక్కోవడంలో ఈ యాప్ టెక్కీలకు మంచి ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. అంతేగాక, ఈ సేవలు ఉచితంగానే అందించబడతాయని తెలిపారు.

English summary
Nasscom 10,000 Startups, an initiative by the software industry body, has launched a mobile app 'Startup Jobs' that alerts tech professionals about vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X