హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిక్కీ సదస్సు: అందంగా జ్వాలా గుత్తా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్ని రంగాల్లో మహిళలు రాణించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'క్రీడల దేశంగా భారత్' అన్న అంశంపై బుధవారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సమన్వయకర్తగా హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు విజయ్ మోహన్ రాజ్ వ్వవహరించారు. క్రీడారంగంలో మహిళలు రాణించాలంటే తల్లిదండ్రులతో పాటు సామాజిక వైఖరిలో కూడా మార్పు రావాల్సి ఉందని అన్నారు.

ఈ సమావేశంలో శాప్స్ ఎండీ రేఖారాణి, స్టార్ షట్లర్లు జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప, జాతీయ పుట్‌బాల్ కెప్టెన్ సునీల ఛెత్రి, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ సామియా అలామ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

 ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి


ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్వాలా గుత్తా మాట్లాడుతూ క్రీడల పట్ల సరైన దృక్పథం ఉండాలన్నారు. చిన్నారులకు మంచి వేదిక ఉండాలన్నారు. సరైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలన్నారు.

 ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి


అంతర్జాతీయ స్డేడియాల్ని మధ్య తరగతి వారికి అందుబాటులోకి ఉంచాలని కోరారు. గచ్చిబౌలి స్టేడియం, యూసుఫ్ గూడ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాలను మరింత చేరువ చేయాలని జ్వాలా అభిప్రాయపడింది.

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి


ఈ సందర్భంగా సునీల్ ఛెత్రి మాట్లాడుతూ నాన్న ఆర్మీలో అధికారి, సికింద్రాబాద్ లోనే పుట్టా, నేను హైదరాబాదీనే అని అన్నారు.

 ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి


12వ తరగతిలో ఉన్నప్పుడు ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్‌లో సీటు కోసం పుట్ బాల్ టోర్నీలో అడానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఊహించిన విధంగా మోహన్ బగాన్ క్లబ్ నుంచి పిలుపు వచ్చిందని అన్నారు.

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

భారత పుట్‌బాల్ జట్టు ప్రపంచ కప్‌కు ఎందుకు అర్హత సాదించడం లేదు? పెద్ద టోర్నీల్లో ఎందుకు ఓడిపోతుంది? ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తుంటాయి.
ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి

ఫిక్కీ సదస్సులో జ్వాలా, అశ్విని, ఛెత్రి


దేశంలోని 130 కోట్ల మందిలో ఎంతో మంది చిన్నారులకు నాణ్యమైన క్రీడా శిక్షణ లభిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత మందికి సరైన ఆహారం అందుతుంది. సరైన శిక్షణ సరైన మౌళిక వసతులు లేకుండా పతకాలు ఎలా వస్తాయని అనుకుంటారని అన్నారు.

English summary
Top sports personalities, including badminton star Jwala Gutta and Indian football team captain Sunil Chhetri, today suggested a slew of measures, which if implemented, can help India emerge as a major sporting nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X