వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ నుండి కామన్వెల్త్ వరకు: ఎవరీ వినోద్‌రాయ్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో కేసులో నిందితులను నిర్ధోషులుగా కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్‌పై విరుచుకుపడింది. వినోద్‌రాయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే ఈ తరుణంలో వినోద్‌రాయ్ పేరు మరోసారి తెరమీదికి వచ్చింది.

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

2జీ కేసు: నాడు జయలలితకు ఎలా కలిసి వచ్చిందంటే?2జీ కేసు: నాడు జయలలితకు ఎలా కలిసి వచ్చిందంటే?

వినోద్‌రాయ్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నేతలు వినోద్‌రాయ్ తీరును ఎండగట్టారు. వినోద్‌రాయ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

రాజకీయాల్లో సంచలనం: ఏమిటీ 2జీ కేసు ?రాజకీయాల్లో సంచలనం: ఏమిటీ 2జీ కేసు ?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ కూడ వినోద్‌రాయ్ తీరును తప్పుబట్టారు.

 ఎవరీ వినోద్‌రాయ్

ఎవరీ వినోద్‌రాయ్

2జీ స్పెక్ర్టమ్ కుంభకోణం విషయంలో వినోద్ రాయ్ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తోంది. యూపిఏ ప్రభుత్వ హయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేసిన వినోద్‌రాయ్ 2జీ లైసెన్సుల జారీలో చోటు చేసుకొన్న అవకతవకలను బయటపెట్టారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వినోద్‌రాయ్ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. హర్వర్డ్ యూనివర్శిటీలో ప్రజా పాలనలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు.వినోద్ రాయ్ స్వస్థలం ఘాజీపూర్.69 ఏళ్ళ వినోద్‌రాయ్ పలు సంచనాలకు కేంద్రబిందువుగా నిలిచారు.

 ఐఎఎస్ అధికారిగా

ఐఎఎస్ అధికారిగా

1972 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా కలెక్టర్‌ హోదాలో ఆయన త్రిశూరు జిల్లాలో పలు కార్యక్రమాలను చేపట్టారు. త్రిశూరు జిల్లాలో వినోద్‌రాయ్ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల మన్ననలను పొందాయి.

 5 ఏళ్ళ పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌

5 ఏళ్ళ పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌

సుదీర్ఘ కాలం పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌‌గా వినోద్ రాయ్ పనిచేశారు. 2008 జనవరి 7వ, తేది నుండి 2013 మే 22వ,తేదివరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌‌గా వినోద్ రాయ్ పనిచేశారు..పలు అంశాలపై వినోద్‌రాయ్ అవకతవలను గుర్తించారు.

 కామన్వెల్త్ క్రీడలలో కూడ

కామన్వెల్త్ క్రీడలలో కూడ

కామన్వెల్త్‌ క్రీడల కొనుగోళ్ల కుంభకోణంపైనా కీలకాంశాలను గుర్తించారు వినోద్ రాయ్. 2జీ కుంభకోణంలో కాగ్ నివేదిక దేశ వ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేసింది. 2జిపై ఆయన వెలువరించిన నివేదికతోనే మొత్తం తుట్టె కదిలింది.

English summary
With the Special Central Bureau of Investigating Court declaring all the accused in the 2G case as not guilty, Congress leaders quickly declared that they wanted former Comptroller and Auditor General Vinod Rai to apologise.other bureaucrats and business executives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X