వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్ టెర్రర్‌కు చెక్ పెట్టే 'నో యాక్సిడెంట్': ఈ మెషీన్ మీ ప్రయాణానికి భరోసా..

ఎదురుగా వచ్చే వాహనం 100మీ. దూరంలో ఉన్నప్పుడే ఈ పరికరం సైరన్ మోతతో డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ డ్రైవర్ అప్రమత్తం కాకపోతే.. ఎదుటి వాహనం 20మీ. దూరం ఉండగా దానికదే బ్రేకులు వేస్తుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో ఏటా కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్న సంగతి తెలిసిందే. కోట్ల రూపాయల విలువ చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనాలు సైతం రోడ్డు ప్రమాదాల్లో ఏమాత్రం రక్షణగా నిలవలేకపోతున్నాయి. చాలావరకు రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల అలసత్వం, ఓవర్ స్పీడ్‌తోనే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా సుద్దేపల్లికి చెందిన జయరాజ్ నాన్ యాక్సిడెంట్ అనే పరికరాన్ని రూపొందించారు. వాహనం నడుపుతున్న డ్రైవర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రమాదాలను నివారించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. తాజాగా హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జయరాజ్ దీని వివరాలు వెల్లడించారు.

మూలమలుపుల వద్ద అప్రమత్తం చేసేలా!:

మూలమలుపుల వద్ద అప్రమత్తం చేసేలా!:

చాలాసార్లు మూల మలుపుల వద్దే ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితిని గమనించవచ్చు. మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడానికి వీలు ఉండదు కాబట్టి.. రెండు వాహనాలు ఢీకొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని అంచనా వేసి జయరాజ్ నాన్ యాక్సిడెంట్ పరికరాన్ని రూపొందించారు.

నాన్ యాక్సిడెంట్ పరికరం పనీతరు:

నాన్ యాక్సిడెంట్ పరికరం పనీతరు:

ఎదురుగా వచ్చే వాహనం 100మీ. దూరంలో ఉన్నప్పుడే ఈ పరికరం సైరన్ మోతతో డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ డ్రైవర్ అప్రమత్తం కాకపోతే.. ఎదుటి వాహనం 20మీ. దూరం ఉండగా దానికదే బ్రేకులు వేస్తుంది. దీంతో స్పీడ్ నియంత్రించబడటంతో పాటు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

ఎలా వచ్చింది ఆలోచన:

ఎలా వచ్చింది ఆలోచన:

దుబాయ్‌లో మెషీన్ డిజైనర్‌గా పనిచేస్తున్న జయరాజ్.. ఇటీవల ఓ మూలమలుపు వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో చాలామంది చిన్నారులు దుర్మరణం పాలవడాన్ని తట్టకోలేకపోయాడు. ఆ యాక్సిడెంట్ దృశ్యాలను చూసి చలించిపోయిన జయరాజ్.. రోడ్డు ప్రమాద నివారణ కోసం ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపనలోంచి పుట్టిందే నాన్ యాక్సిడెంట్ పరికరం.

ధర ఎంత?:

ధర ఎంత?:

ద్విచక్ర వాహనాల్లో ఈ పరికరాన్ని అమర్చడానికి రూ.13వేలు ఖర్చవుతుందని జయరాజ్ తెలిపారు. అలాగే కారులో అమర్చడానికి రూ.25వేలు, బస్సులు లారీలకైతే రూ.1లక్ష ఖర్చవుతుందని తెలియజేశారు. ఆటోమేటిక్ రేడియో కంట్రోల్ ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని, దీన్ని వినియోగించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని జయరాజ్ చెప్పారు.

English summary
Jayaraj, A machine designer was made a non accident machine to prevent road accidents. He introduced this machine on Thursday afternoon in Hyderabad, Basheer Bagh press club
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X