వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏడాదే ప్రళయం.. భూమిపై మనుష్య జాతి అంతం!? నోస్ట్రడామస్‌ జోస్యం నిజమవుతుందా?

భూ ప్రళయం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యకారుడు నోస్ట్రడామస్ జోస్యం ప్రకారం కూడా 2018లో.. అంటే వచ్చే ఏడాదే మన భూమి అంతరించిపోవడానికి ముహూర్తం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nostradamus Predictions: What Will Happen In 2018 | Oneindia Telugu

వాషింగ్టన్: భూ ప్రళయం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మనుషులు అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు విఫలమై భూమివైపు తిరగి దూసుకొస్తున్నాయని, వాటి వల్ల భూమికి పెనుప్రమాదం పొంచి ఉందని చెబుతుంటారు.

అంతరిక్షం నుంచి దూసుకొస్తోన్న చైనా స్పేస్ స్టేషన్! దేవుడా.. ఎక్కడ పడుతుందో? ఏం జరుగుతుందో?అంతరిక్షం నుంచి దూసుకొస్తోన్న చైనా స్పేస్ స్టేషన్! దేవుడా.. ఎక్కడ పడుతుందో? ఏం జరుగుతుందో?

ప్రపంచం నెత్తిన మరో 'స్కైలాబ్‌'!? ఇది మనం ప్రయోగించిందే, 40 రోజులే గడువు, తీవ్ర ఉత్కంఠ!ప్రపంచం నెత్తిన మరో 'స్కైలాబ్‌'!? ఇది మనం ప్రయోగించిందే, 40 రోజులే గడువు, తీవ్ర ఉత్కంఠ!

అలాగే భూమి అంతం గురించి కూడా. డేనియల్‌ మాన్సన్‌ అనే శాస్త్రవేత్త భూమి వైపు ఏదో గ్రహం దూసుకొస్తోందని, దాంతో భూమి అంతరించిపోతుందని ఇప్పటికే ప్రకటించేశారు. అంతేకాదు, ఈ పరిణామం వచ్చే ఏడాదిలోనే జరగబోతోందని కూడా చెప్పేశారు.

 ఊహాగానాలేనా? నిజముందా?

ఊహాగానాలేనా? నిజముందా?

భూమి అంతం గురించి పలువురు పలు రకాలుగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? లేక నిజమవుతాయా? గతంలో చెప్పిన జోస్యాలు ఎంత వరకు నిజమయ్యాయి? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆనాడే చెప్పారట. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంను మనం ఎలా విశ్వసిస్తామో.. ఈ భవిష్యకారుడు నోస్ట్రడామస్ చెప్పిన దానిని కూడా ప్రపంచ వ్యాప్తంగా విశ్వసిస్తుంటారు.

 నోస్ట్రడామస్ ఆ కాలంలోనే చెప్పారా?

నోస్ట్రడామస్ ఆ కాలంలోనే చెప్పారా?

భవిష్యకారులలో.. నోస్ట్రడామస్‌ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు వేరు. ఈయన ఎన్నో విషయాల గురించి జోస్యం చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయని చెబుతున్నారు. భూమి అంతం గురించి కూడా నోస్ట్రడామస్ ఆ కాలంలోనే తెలిపారు. ‘2018లో మహా విపత్తులు సంభవిస్తాయి... పెను వినాశనం తప్పదు.. భూగోళంపై మనుష్య జాతి పెద్ద సంఖ్యలో అంతమవుతుంది..'' ఇదీ ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ చెప్పిన జోస్యం.

 ఆకాశం నుంచి అగ్ని గోళాలు...

ఆకాశం నుంచి అగ్ని గోళాలు...

మనుషులే మనుషుల్ని చంపుకుంటారని, దేశాలు పరస్పర హననానికి పాల్పడతాయని, ఆకాశం నుంచి అగ్ని గోళాలు రాలిపడతాయని, సామాన్యులు మాడి మసి అయిపోతారని కూడా భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ పేర్కొన్నాడు. తూర్పుదేశాలలో ఓ మహాభూకంపం సంభవిస్తుందని, వరదలు, సునామీలాంటి విపత్తులూ వస్తాయని పశ్చిమదేశాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకొని మనుషులు జీవించలేని పరిస్థితులు ఉంటాయని, మొత్తం మీద ప్రపంచం మీద ప్రకృతి కన్నెర్ర చేస్తుందని, సర్వవిధ్వంసం సృష్టిస్తుందని ఆయన ఆ కాలంలోనే అంచనా వేశాడు.

 ఆ ప్రభావం ఎనిమిదేళ్ల వరకు...

ఆ ప్రభావం ఎనిమిదేళ్ల వరకు...

గ్లోబల్‌ వార్మింగ్‌ తాలూకు దుష్పరిణామాలను ప్రపంచం భరించక తప్పదని నోస్ట్రడామస్ ఆనాడే సెలవిచ్చాడు. ‘భవిష్యత్తులో తలదాచుకునేందుకు అడవులుండవు.. సేద తీరడానికి మంచు పర్వతాలుండవు. సూర్యుడి తాపం నుంచి ప్రజలను రక్షించే పొరలేవీ ఉండవు. భూ అంతర్భాగంలో ఉన్న అగ్ని ఉపరితలం మీదకు ఎగదన్నుకొస్తుంది... దిక్కులేని వారై ఎక్కడికీ పోలేక చివరికి ప్రజలు ఆహుతైపోతారు. ఈ ప్రభావం ఎనిమిదేళ్ళపాటు అంటే దాదాపు 2025 చివరిదాకా ఉంటుంది.. అప్పుడు ప్రపంచం మళ్లీ కొత్త కాంతులీనుతుంది..' అని నోస్ట్రడామస్‌ అంచనా వేశాడు.

 నిబిరు గ్రహం కూడా నిజమేనా?

నిబిరు గ్రహం కూడా నిజమేనా?

మరోవైపు 2018 మే నెలలో భూమిని నిబిరు అనే మరో గ్రహమండల వ్యవస్థ ఢీకొంటుందని, దీని వల్ల కూడా భూగోళం అంతమయ్యే అవకాశాలున్నాయని డేనియల్‌ మాన్సన్‌ అనే శాస్త్రవేత్త జోస్యం చెబుతున్నాడు. ఈ నిబిరు అనే గ్రహానికే ప్లానెట్‌ ఎక్స్‌ అనే పేరు కూడా ఉంది. ఈ ప్లానెట్‌ ఎక్స్‌ భూమిని ఢీ కొట్టినపుడు అత్యంత శక్తిమంతమైన గురుత్వాకర్షణ తరంగాలు వెలువడతాయని, అవి భూగోళాన్ని అస్తవ్యస్తం చేస్తాయని, ఫలితంగా సునామీలు, భూకంపాలు సంభవిస్తాయని, అగ్నిపర్వతాలు బద్దలవుతాయని, ప్రకృతి ప్రళయ భీకరంగా గర్జిస్తుందని మాన్సన్‌ అంచనా.

 స్టీఫెన్‌ హాకింగ్‌ ఏమంటున్నారంటే...

స్టీఫెన్‌ హాకింగ్‌ ఏమంటున్నారంటే...

సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ కూడా భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. ఆయన లెక్క ప్రకారం.. ఈ భూమ్మీద మానవజాతి మరో 600 సంవత్సరాలు మాత్రమే మనుగడ సాగించగలుగుతుంది. పెరుగుతున్న జనాభా వల్ల విద్యుత్‌ వినియోగం అమేయంగా పెరిగి చివరికి భూగోళం నిప్పుల కొలిమిలా మారిపోతుందనేది స్టీఫెన్‌ హాకింగ్‌ అంచనా.

English summary
Till this day, I believe and many of you would agree with me that there’s someone (maybe a divine power), who has been silently handling everything in the present and is exercising a great control on the future; someone who lets us all believe that we are the masters of our lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X