వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూట తిండికి గతిలేని ముంబై చైల్డ్ యాక్టర్ దీనగాధ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ఎంతో మంది పేదరికం నుంచి ఎదిగి కోటీశ్వరులుగా మారి నలుగురికీ ఆదర్శంగా నిలిచిన ఎంతో మంది స్టోరీలు ఈ ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. అదే విధంగా ఒకనాడు బాగా బతికి, ఆపై వీధిన పడ్డ కుటుంబాలను కూడా మనం చూశాం. ఈ కోవకే అలనాటి ముంబై చైల్డ్ యాక్టర్ చేరుకున్నాడు.

Once, He Was Rich. Now,

వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం (జులై 17)న హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీలో అతని పేరును వెల్లడించకుండా, ఓ స్టోరీను పోస్టు చేశారు. ఈ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. "అప్పట్లో నేను ధనవంతుడినే. ఓ పెద్ద ఇంట్లో ఉండేవాళ్లం. ప్రముఖులు, కోటీశ్వరుల ఉంటే ఇల్లులాగా బాగా ఫేమస్.

రోజుకు 10 వెరైటీ భోజనాలు తినగలిగే స్తోమత ఉండేది. కానీ నేడు ఒక్క పూట భోజనానికీ గతి లేకుండా పోయింది. నేను చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసే సమయంలో ఎన్నో చిత్రాల్లో ప్రముఖ నటీనటులతో నటించాను. నా తల్లిదండ్రుల మరణంతో కష్టాలు మొదలయ్యాయి. అవకాశాలు తగ్గాయి.

జేబులో డబ్బులు లేకుంటే, ఎంత టాలెంట్ ఉన్నా దానికి గుర్తింపు లభించదు. ఎంత ఫేమస్ అయినా కొన్నిసార్లు ముఖాన్ని కూడా మర్చిపోతారు" అని ఎన్నో చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన ఆయన తన దీనగాధను పంచుకున్నారు. ముంబై బీచ్ రోడ్లపై సమోసా, చపాతీని భోజనంగా తింటూ గడుపుతున్న ఆయన భవిష్యత్తుపై తనకింకా ఆశలు చావలేదని చెబుతున్నారు.

రేపటి మంచి రోజు కోసం తన వద్ద అనేక ప్లాన్స్ ఉన్నాయని, ఏనాటికైనా తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటానని నమ్మకంగా చెబుతున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ ఫోస్టును ఇప్పటి వరకు పదివేల మందికి పైగా లైక్ చేశారు. డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టేవారికి ఇతని జీవితమే ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం.

English summary
We've all been inspired by stories of people rising from humble backgrounds, and making it big in the world. But this story of a Mumbai man who had it all, then lost it all and still strives to make it in this world is equally inspiring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X