వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీటెక్ బాబులకు షాక్: ఇది విన్నారా?.. ఇవి లేకపోతే జాబ్ కష్టమే..

మంచి అకడమిక్ రిపోర్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు అప్పట్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒకప్పుడు బీటెక్ అంటే.. దానికున్న క్రేజే వేరు. ఎప్పుడైతే పుట్టగొడుగుల్లా కోళ్ల ఫారాలు సైతం ఇంజనీరింగ్ కాలేజీల్లా అవతరించాయో.. బీటెక్ కు చావుదెబ్బ తప్పలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది బీటెక్ విద్యార్థులు 'పట్టా' పుచ్చుకోవడానికే పరిమితమయ్యారు తప్పితే.. కనీస వేతనంతో కూడిన జాబ్స్ కూడా వారిని పలకరించడం లేదు.

<strong> రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..</strong> రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..

ఇప్పటికే ఉన్న నిరుద్యోగ యువతకు తోడు.. ఏటా మరో 75వేల మంది బీటెక్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. దీంతో బీటెక్ చుట్టూ నిరుద్యోగమే తాండవిస్తోంది. ఉద్యోగం వస్తుందో లేదో తెలియని స్థితుల్లో.. ఓవైపు ఐటీ కంపెనీలు సైతం రిక్రూట్ మెంట్లను తగ్గిస్తున్న తరుణంలో.. బీటెక్ అంటే భయపడాల్సిన పరిస్థితి.

ఓన్లీ 'బీటెక్'తో కష్టమే!:

ఓన్లీ 'బీటెక్'తో కష్టమే!:

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క బీటెక్ తోనే ఉద్యోగం సంపాదించేయాలనుకోవడం కష్టమంటున్నారు పరిశీలకులు. బీటెక్‌తో పాటు అదనపు స్కిల్స్, స్పెషలైజేషన్ కోర్సులు చేసి ఉన్న విద్యార్థులకు కంపెనీలు కొంతవరకు తలుపులు తెరిచే అవకాశముందంటున్నారు.
స్కిల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే.. బీటెక్ బాబులకు కెరీర్ పెద్ద గండమే అంటున్నారు.

ఒకప్పుడు ట్రెయినింగ్ ఇచ్చి మరీ!:

ఒకప్పుడు ట్రెయినింగ్ ఇచ్చి మరీ!:

1990ల కాలంలో బీటెక్ బూమ్ ప్రారంభమైన తొలినాళ్లలో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకుని.. కంపెనీలే వారికి ట్రెయినింగ్ ఇచ్చేవి. మూడు నుంచి ఆరు నెలల కాలం వరకు వారికి తర్ఫీదు ఇచ్చిన అనంతరం ఆయా పొజిషన్లలో రిక్రూట్ చేసుకునేవి. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు.

రిక్రూట్ మెంట్ల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పులనే దేశీ ఐటీ కంపెనీలు అనుసరిస్తున్నాయి. తద్వారా ఉద్యోగుల మీద వెచ్చించే మొత్తాన్ని కంపెనీలు మిగుల్చుకోగలుగుతున్నాయి.

అకడిమిక్ రిపోర్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోవు:

అకడిమిక్ రిపోర్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోవు:

మంచి అకడమిక్ రిపోర్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు అప్పట్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బీటెక్ డిగ్రీతో పాటు ఏదేని డిమాండ్ ఉన్న టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్నవారికే ప్రస్తుతం ప్రాధాన్యం దక్కుతోందని ఐటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

సీఎస్ఈ, ఐటీ కోర్సులు చదివే విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల పట్ల సరైన అవగాహన ఉండటం లేదన్నారు. ఐటీ మార్కెట్ కు తగిన విధంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లేదన్నారు.

ఎంట్రీ లెవల్ జాబ్స్ కోత:

ఎంట్రీ లెవల్ జాబ్స్ కోత:

ప్రస్తుతం చాలావరకు ఐటీ కంపెనీలు రిక్రూట్ మెంట్లను తగ్గించేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు భారీగా కోత పెడుతుండటంతో.. బీటెక్ ఫ్రెషర్స్ పై ఈ ప్రభావం పడుతోంది. కంపెనీలో చేరకముందే విద్యార్థులకు ప్రాజెక్టులపై అవగాహన ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయి. దీనికి తోడు ఆటోమేషన్ వల్ల కూడా రిక్రూట్ మెంట్లు తగ్గిపోతున్నాయి.

English summary
In today's world a B.Tech degree is not enough. You may get a job immediately for a lower level but soon would find that you have to compete with others who have more qualifications that you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X