హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోరైలు డిపోలో కమిషనర్, వివరించారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైలులో ప్రయాణికుల భద్రత కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మెట్రో రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డిలు గురువారం ఉప్పల్ మెట్రో రైలు డిపోలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంజనీర్లు భద్రతా ప్రమాణాలపై రెక్కి కూడా నిర్వహించారు. మెట్రో రైలులో ప్రవేశపెడుతున్న ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లపై కమిషనర్ సివి ఆనంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైలులో, స్టేషన్లలో సిసిటివి ఏర్పాటు విషయాన్ని కూడా కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

డిపో, ఆపరేషన్ కంట్రోల్ సెంట్రల్ మధ్య ఈ భద్రతా వ్యవస్థ అనుసంధానంగా పని చేయనున్నట్లు ఇంజనీర్లు వివరించారు. రైలులో అమలు చేయనున్న సెన్సార్ విభాగం, ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు స్కానర్లు, డిటెక్షన్ వ్యవస్థలు వంటివి వారు పరిశీలించారు.

 మెట్రో భద్రత ప్రమాణాలు

మెట్రో భద్రత ప్రమాణాలు

ఇపుడు ఉప్పల్ డిపోలోని మెకానిజాన్ని కాపాడేందుకు పెరిమీటర్ వాల్స్‌తో రక్షణ చర్యలు చేపట్టినట్లు మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి కమిషనర్ సివి ఆనంద్‌కు వివరించారు. మెట్రో రైలుతో పాటు స్టేషన్ గేటు నుంచే సిసిటివిలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మెట్రో భద్రత ప్రమాణాలు

మెట్రో భద్రత ప్రమాణాలు

రద్ధీని నియంత్రించే వ్యవస్థను కూడా స్టేషన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు, అలాగే ఎంట్రీలోనే ట్రాఫిక్ నివారణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

 మెట్రో భద్రత ప్రమాణాలు

మెట్రో భద్రత ప్రమాణాలు

కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మెట్రో రైలు మరింత పకడ్బందీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ప్రత్యేక ఇన్‌పుట్ త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు.

 మెట్రో భద్రత ప్రమాణాలు

మెట్రో భద్రత ప్రమాణాలు

నగర ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైలులో ప్రయాణికుల భద్రత కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

English summary
Photos of Commissioner CV Anand inspects security in Metro rail in Uppal Depot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X