వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరెస్ట్ సాహస వీరులకు సన్మానం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన సాహసవీరులు మాలావత్ పూర్ణ, ఆనంద్‌లను ఆభినందిస్తూ శాసన సభలో తీర్మానం చేయాలని, అర్జున పురస్కారం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పలు సంఘాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

కష్టాలను అధిగమించి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన చిన్నారులు పూర్ణ, ఆనంద్‌లు అందరికీ ఆదర్శం అని ఈ సందర్భంగా ఆచార్య కోదండరామ్ అన్నారు. దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు పూర్ణ, ఆనంద్‌తో పాటుగా ఐపీఎస్ అధికారి, గురుకుల పాఠశాలల సెక్రటరీ ప్రవీణ్ కుమార్, కోచ్ శేఖర్ బాబులను బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సన్మానించారు.

కోదండరామ్ మాట్లాడుతూ... సమాన అవకాశాలు కల్పిస్తే ఎలాంటి విజయాలనైనా సాధిస్తామని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత వీరిదని అన్నారు.

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్

తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్

శాసనసభలో పూర్ణ, ఆనంద్‌లను అభినందిస్తూ తీర్మాణం ప్రవేశ పెట్టాలన్నారు. అందరికీ అవకాశం కల్పించేలా సమాజం ఉండాలన్నారు. యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు మరింత శ్రద్ధచూపాలన్నారు. జీవితంలో కష్టపడేవారు గెలుస్తారని నిరూపించిన విద్యార్థులు నేటి విద్యార్థిలోకానికి ఆదర్శమన్నారు.

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్

ఎవరెస్ట్ అధిరోహించిన ఈ విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం పై పెట్టిన అంబేద్కర్, శంకరన్ ఫొటోలు ప్రపంచదేశాల ప్రజలు మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాయన్నారు.

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్

సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎవరెస్టు విద్యార్థులను ప్రోత్సహించి అర్జున అవార్డులను అందించాలని డిమాండు చేశారు.

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్

పూర్ణ, ఆనంద్‌లను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి సునీతా, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, విరాహాత్ అలీ, దైవజ్ఞశర్మ, పలు కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.

English summary
Photos of everst Heros Malavath Purna, Anand Felicitated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X