వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వార్టర్స్‌లోకి భారత్: ధోనీకి గేల్ కంగ్రాట్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పెర్త్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 182 పరుగులకు అలౌటైంది.

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్‌ను కూడా వెస్టిండీస్ బౌలర్లలో త్వర త్వరగానే పెవిలియన్ పంపారు. అయితే ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.

కాగా, ఇది ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాకు నాలుగో వరుస విజయం కావడం గమనార్హం. మార్చి 10న టీమిండియా ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.

షమీ మెరుపులు

షమీ మెరుపులు

భారత పేసర్లు మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంలో సఫలమయ్యారు. వికెట్లు తీసిన ఆనందంలో షమీ, రైనా.

భారీ మద్దతు

భారీ మద్దతు

వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచుకు అత్యధిక సంఖ్యలో హాజరైన భారతీయులు టీమిండియాకు మద్దతు పలుకుతూ నినాదాలు చేశారు.

వికెట్ తీసిన ఆనందం

వికెట్ తీసిన ఆనందం

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు.

శామ్యూల్స్ రనౌట్

శామ్యూల్స్ రనౌట్

శామ్యూల్స్‌ను మోహిత్ శర్మ రనౌట్ చేయడంతో ఆనందంతో వ్యక్తం చేస్తున్న విరాట్ కోహ్లీ, యాదవ్.

శిఖర్ పెవిలియన్ బాట

శిఖర్ పెవిలియన్ బాట

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శుక్రవారం జరిగిన మ్యాచులో కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు.

రహానే షాట్

రహానే షాట్

బంతిని బౌండరీకి తరలిస్తున్న అజింక్యా రహానే. ఈ మ్యాచులో రహానే 14 పరుగులు చేశాడు.

రైనా నిరాశ

రైనా నిరాశ

22 పరుగులు చేసిన అనంతరం ఔటవడంతో నిరాశతో పెవిలియన్ చేరుకుంటున్న రైనా.

కెప్టెన్ కూల్

కెప్టెన్ కూల్

వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మ్యాచులో టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చిన కెప్టెన్ ధోనీ. 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అశ్విన్, ధోనీ

అశ్విన్, ధోనీ

51 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాను గెలిపించిన ధోనీ, అశ్విన్.

ధోనీకి గేల్ కంగ్రాట్స్

ధోనీకి గేల్ కంగ్రాట్స్

టీమిండియాను గెలిపించిన కెప్టెన్ ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతున్న విండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ గేల్.

English summary
It was a battle of short-pitched bowling at the WACA ground on Friday (March 6) and India emerged victorious against West Indies in their Pool B clash of ICC World Cup 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X