హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండ్ల గణేష్ సహా లీడర్స్: యాతన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిభక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏకాదశి పర్వదినాన పవిత్ర పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, శ్రీశైలం, తిరుమల తదితర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం అంత్యంత వేడుకగా జరిగింది.

టిటిడి లెక్కల ప్రకారం ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ 46,213 మంది భక్తులు వైకుంఠ దర్శనం చేసుకున్నారని, అర్ధరాత్రికి ఈ సంఖ్య 25 నుండి 30 వేల వరకూ ఉండవచ్చని అంచనావేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో 4,641 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 7920 మంది విఐపిలు స్వామివారిని దర్శించుకున్నట్లు టిటిడి వర్గాలు చెపుతున్నాయి.

శనివారం సర్వదర్శనానికి 15 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పట్టింది. శనివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల మద్య శ్రీమలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై స్వర్ణరథంపై చతుర్వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.

వీరశివా రెడ్డి

వీరశివా రెడ్డి

వైకుంఠ ఏకాదశి రోజు కమలాపురం కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు వీరశివా రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

శివప్రసాద్

శివప్రసాద్

వైకుంఠ ఏకాదశి రోజు చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు శివ ప్రసాద్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

గండ్ర వెంకటరమణ రెడ్డి

గండ్ర వెంకటరమణ రెడ్డి

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

సునిత లక్ష్మా రెడ్డి

సునిత లక్ష్మా రెడ్డి

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మంత్రి సునితా లక్ష్మా రెడ్డి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

కొండ్రు మురళి

కొండ్రు మురళి

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మంత్రి కొండ్రు మురళీ మోహన్ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

మాణిక్య వర ప్రసాద్

మాణిక్య వర ప్రసాద్

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మంత్రి మాణిక్య వర ప్రసాద్ చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

గణేష్

గణేష్

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ బాబు చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

దానం నాగేందర్

దానం నాగేందర్

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

డికె అరుణ

డికె అరుణ

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి డికె అరుణ చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి శ్రీధర్ బాబు చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుమల 1

తిరుమల 1

ద్వాదశి రోజున కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడంతో భక్తులు శనివారం పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వచ్చారు.

తిరుమల 2

తిరుమల 2

వసతులు, దర్శనాల విషయంలో కొంత మంది భక్తులు టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు కార్యాలయం ఎదుట ఏకంగా ధర్నాకు దిగారు.

తిరుమల 3

తిరుమల 3

రెండు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వచ్చారు.

తిరుమల 4

తిరుమల 4

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నరకయాతన అనుభవించారు.

తిరుమల 5

తిరుమల 5

ఉదయం 6 గంటల నుంచి క్యూలోనే భక్తులు వేచి ఉన్నా వెంకన్న దర్శన భాగ్యం కలగకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. విఐపిలకు ప్రాధాన్యాత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల 6

తిరుమల 6

భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టిటిడి విఫలమైందని భక్తులు ఆరోపించారు. రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో కొంతమంది వృద్ధ మహిళలు సొమ్ముసిల్లి పడిపోయారు.

కల్యాణ వెంకటేశ్వర స్వామి

కల్యాణ వెంకటేశ్వర స్వామి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు నామాల గుండులో గల శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న ఓ యువతి.

వెంకటేశ్వర స్వామి

వెంకటేశ్వర స్వామి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు నామాల గుండులో గల శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న యువతులు.

పెద్దమ్మ గుడి

పెద్దమ్మ గుడి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో గల పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుంటున్న ఓ యువతి.

టిటిడి

టిటిడి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుతున్న ఓ చిన్నారి.

ఆలయం

ఆలయం

రాష్ట్రంలో శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిభక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏకాదశి పర్వదినాన పవిత్ర పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, శ్రీశైలం, తిరుమల తదితర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

English summary
VIP's visited Tirumala on the eve of Vaikunta Ekadasi which caused nuisance to general public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X