వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వోల్వో అదుపు తప్పి, మరో పల్టీ కొడితే..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న స్లీపర్ కోచ్ బస్సు మహబూబ్ నగర్ జిల్లా.. అడ్డాకుల దాటాక రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

పాలెం సంఘటన గుర్తులు చెదరక ముందే మరో ఆర్టీసీ బస్సు అడ్డాకుల మండల పరిధిలోని కాటవరం గ్రామ సమీపాన మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అదపుతప్పి బోల్తాపడింది.

ముందు భాగంలో ఉండే బావిలోకి దూసుకెళ్లినట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 22మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో మాత్రం ఆరుగురికి తీవ్రంగా గాయాలు కాగా మరో ఆరుమందికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని వనపర్తి డిఎస్పీ శ్రీనివాస రావు పరిశీలించారు.

 వోల్వో ప్రమాదం

వోల్వో ప్రమాదం

కెఎ 40 ఎఫ్ 533అనే నంబర్ గల కెఎస్ ఆర్టీసీ బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో కాటవరం సమీపాన రోడ్డు కిందకు బస్సు వెళ్లగానే డ్రైవర్ నిద్రలో మేల్కొని సడన్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించేలోపే బస్సు అదుపు తప్పి బోల్తాపడింది.

 వోల్వో ప్రమాదం

వోల్వో ప్రమాదం

దీంతో బెంగుళూరుకు చెందిన సుభాకర్ అనే ప్రయాణికుడికి కాలు విరగగా, బోర్టు, నీలం, ఫారుత్‌వాక్ అనే ప్రయాణికులతో పాటు డ్రైవర్ క్రాంతిరాజులకు తీవ్రగాయాలకు గురయ్యారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

 వోల్వో ప్రమాదం

వోల్వో ప్రమాదం

క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరళించారు. వనపర్తి డిఎస్పి శ్రీనివాస రావు, కొత్తకోట సిఐ రమేష్, అడ్డాకుల, పెద్దమందడి ఎస్సైలు దగ్గర ఉండి బోల్తాపడిన కెఎస్ ఆర్టీసి బస్సును జెసిబి ద్వారా తీయించి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు అడ్డాకుల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

వోల్వో ప్రమాదం

వోల్వో ప్రమాదం

ఆ బస్సు అలాగే మరో ఐదు అడుగులు ముందుకు వెళ్లినా... ఇంకో పల్టీ కొట్టినా పెను ప్రమాదం సంభవించేది. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగేది. ఎందుకంటే అక్కడ దాదాపు 25 అడుగుల లోతున్న పెద్ద బావి ఉంది.

వోల్వో ప్రమాదం

వోల్వో ప్రమాదం

బస్సులోని 21 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసినప్పటికీ, శుభకర్ అనే ప్రయాణికుడు ఓ ఇనుప పైప్ వద్ద ఇరుక్కుపోయాడు. స్థానికులు అతడిని బయటకు తీయలేకపోయారు. గ్యాస్ కట్టర్‌తో పైపును తొలగించాలనుకున్నా సాధ్యం కాలేదు. చివరకు ఎక్స్‌కవేటర్ సాయంతో పైపును దూరంగా లాగి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందుకు పోలీసులు, ఎల్ ఆండ్ టీ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.

English summary
Photos of Volvo accident in Mahaboobnagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X