బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ఇండియా కథనంపై పిఎం మోడీ ట్వీట్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐదు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఐదుగురు పాఠశాల విద్యార్థినులు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘టెక్నోవేషన్ ఛాలెంజ్ 2015'లో పాల్గొని వరల్డ్ బీటర్లుగా గుర్తింపు సాధించడంపై వన్‌ఇండియా కథనం ప్రచురితం చేసింది. వన్ఇండియా ఈ విద్యార్థినుల గురించి సవివరణమైన కథనం ప్రచురితం చేసింది. కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కథనం చదివి, తన స్పందనను తెలియజేశారు.

640 దేశాలకు చెందిన 400మంది బృందాలు పాల్గొన్న ఈ కార్యక్రమం(టెక్నోవేషన్ ఛాలెంజ్ 2015)లో ఈ ఐదుగురు బాలికలు రూపొందించిన పొడి వ్యర్థాల కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్రదర్శించారు.

బెంగళూరులోని న్యూహరిజోన్ పబ్లిక్ స్కూల్(ఎన్‌హెచ్‌పిఎస్)కు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు వారి మొబైల్ యాప్‌ సెల్లిక్సో(sellixo)ను మరింత అభివృద్ధిపర్చేందుకు 10వేల డాలర్లను పొందారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకున్న విద్యార్థినులు ఈ యాప్‌ను రూపొందించారు. ఈ పాఠశాల విద్యార్థినుల బృందంలో సంజన, వసంత, అనుపమ ఎన్, మహిమ మెహెందాలే, స్వస్తి పి రావు, నవ్యశ్రీ బి ఉన్నారు.

PM Narendra Modi tweets OneIndia report; girls keen to meet him

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో జులై 2, రాత్రి 7.16నిమిషాలకు ఆ విద్యార్థినులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. వారు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ‘యంగ్ స్టార్క్‌కి శుభాకాంక్షలు. పరిశుభ్రమైన భారతదేశం కోసం వారు చేసిన కృషి అభినందనీయం' అని పిఎం ట్వీట్ చేశారు. కొద్ది గంటల్లోనే పిఎం ట్వీట్‌కి వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి.

ప్రధాని ట్వీట్ అనంతరం, బిజెపికి చెందిన ఐటి సెల్ కూడా ట్వీట్ చేసింది. ఈ రెండు ట్వీట్లు కూడా జూన్ 29న వన్ఇండియా ప్రచురితం చేసిన విద్యార్థినుల కథనంపైనే.

PM Narendra Modi tweets OneIndia report; girls keen to meet him

మిషన్ ఢిల్లీ తదుపరి ఏజెండా

న్యూ హరిజోన్ ఎడ్యుకేషనలన్ ఇనిస్టిట్యూషన్స్(ఎన్‌హెచ్ఈఐ) ఛైర్మన్ డాక్టర్ మోహన్ మంగ్నాని వన్ఇండియాతో శుక్రవారం మాట్లాడుతూ.. దేశంలోని చాలామంది విద్యార్థులకు తమ పాఠశాల విద్యార్థినులు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు సాధించిన ఘనతతో ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నో మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేసినప్పటికీ వన్ఇండియా కథనం ఎక్కువ ప్రచారం కల్పించిందని అన్నారు.

ప్రధాని మోడీ వన్ఇండియా కథనంపై ట్వీట్ చేశారో.. అప్పటి నుంచి తమ ఫోన్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. యూకెలోని ఓ ప్రొఫెసర్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థినులు వీలైతే.. ప్రధాని మోడీని కలవాలని ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

‘మోడీజీ ఆశీస్సులు తీసుకోవాలని విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వారు రూపొందించిన మొబైల్ యాప్‌ను ఆయనకు చూపించాలని కోరుకుంటున్నారు. ఈ యాప్ ప్రజలకు ఉపయోగపడేలలా, మోడీ నుంచి మరిన్ని ఆలోచనలు పొందాలని వారు ఆసక్తిగా ఉన్నారు. విద్యార్థుల కోసం మేం సిద్ధంగా ఉన్నాం' మోహన్ తెలిపారు.

PM Narendra Modi tweets OneIndia report; girls keen to meet him

కాగా, స్కూల్ యాజమాన్యం చివరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వినతి పత్రాన్ని పిఎంఓకు పంపింది. త్వరలో ఢిల్లీకి వెళ్లి మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాంను కూడా కలవాలని విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, వన్ఇండియా కథనంపై ప్రధాని మోడీ స్పందించి, ట్వీట్ చేయడం పట్ల బెంగళూరుకు చెందిన కమ్యూనికేషన్ ప్రొఫెసనల్ రేష్మా బాలకృష్ణన్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ది పవర్‌ఫుల్ పాజిటివ్ జర్నలిజం. వన్ఇండియా, రైటర్ ప్రతిష్ట పెరిగింది. చాలా గర్వంగా ఉంది' అని తన సందేశంలో చెప్పారు.

English summary
Barely four days after OneIndia's indepth report on five girl students from Bengaluru turning world-beaters at the Technovation Challenge 2015 held at San Francisco went viral, India's Prime Minister Narendra Modi too have now acknowledged their fete.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X