వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీ స్కామ్: దిమ్మ తిరిగే గోకుల్‌నాథ్ శెట్టి పాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: నీరవ్ మోడీ కోట్లాది రూపాయల బ్యాంక్ డబ్బులను కొల్లగొట్టడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. తన పదవీ విరమణ తేదీ సమీపిస్తున్న కొద్దీ అతను నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ లావాదేవీలను అతి వేగంగా నడుపుతూ వచ్చాడు.

Recommended Video

Punjab National Bank Scam : ED Raids Nirav Modi Properties

2017లో కేవలం 63 రోజుల వ్యవధిలో అతను 143 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయు)లను జారీ చేసినట్లు తేలింది. సరాసరి రోజజుకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎల్ఓయులను జారీ చేశాడు.

జారీ చేసిన ఎల్‌ఓయూలు ఇవీ...

జారీ చేసిన ఎల్‌ఓయూలు ఇవీ...

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ సంస్థలకు 2011 ుంచి 2017 వరకు జారీ చేసిన ఎల్ఓయూలు 150 అయితే కేవలం చివరి 63 రోజుల్లో 143 ఎల్ఓయూలు ఇచ్చాడు. దీన్ని బట్టి ఎంత వేగంగా స్విప్ట్ సిస్టమ్ ద్వారా ఎల్ఓయూలను విదేశాల్లోని భారతీయ బ్యాంకులకు చేరవేశారో అర్థం చేసుకోవచ్చు. 2017 మార్చి 21న ఒక్క రోజులోనే గీతాంజలి, గిల్ ఇండియా, నక్షత్ర బ్రాండ్ డైమండ్స్‌కు అనుకూలంగా బ్యాంక్ ఆప్ ఇండియా ఎంట్‌వెర్ప్ బ్రాంచ్ (బెల్జియం)కి 10 ఎల్ఓయూలను గోకుల్‌నాథ్ శెట్టి జారీ చేశాడు.

తద్వారా మూడు సంస్థలు...

తద్వారా మూడు సంస్థలు...

వాటి ఆధారంగా మూడు సంస్థల దాదాపు 3 లక్షల డాలర్ల సొమ్మును ఆ బ్యాంక్ నుంచి తీసుకోగలిగాయి. ఆ మర్నాడే దాదాపు 14 ఎల్ఓయూలు అదే బ్యాంక్, అదే బ్రాంచ్‌కి పంపించాడు. వాటి విలువ 2.90 క్షల డాలర్లు ఉంటుంది. మార్చి 1 నుంచి 10వ తేదీ మధ్య ఎస్బిఐ మార్షియస్ బ్యాంచ్‌ు 33 ఎల్ఓయులు , ఫ్రాంక్‌ఫర్డ్ బ్రాంచ్‌కు 21 ఎల్ఓయూలు చోక్సీ సంంస్థల పేరిట వెల్లాయి.

వాటి విలువ ఇలా..

వాటి విలువ ఇలా..

మొదట జారీ చేసిన 150 ఎల్‌ఓయుల విలువ రూ.6500 కోట్లు కాగా, తర్వాత జారీ చేసిన 143 ఎల్ఓయూల విలువ రూ.3000 కోట్లు. పదవీ విరమణ లోగా సాధ్యమైనంత ఎక్కువ నీరవ్ మోడీకి సహకరించాలనే తాపత్రయంతో గోకుల్‌నాథ్ శెట్టి త్వరత్వరగా ఎల్ఓయూలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

పదవీ విరమణ తర్వాత ఇలా...

పదవీ విరమణ తర్వాత ఇలా...

తాను పదవీ విరమణ చేసిన తర్వాత వాడుకునేందుకు వీలుగా లాగిన్, కోడ్ అందుబాటులో ఉండవు. మామూలుగా ఈ ఎల్ఓయుల గడువు 90 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ గోకుల్ నాథ్ శెట్టి నిబంధనలను తుంగలో తొక్క పలు ఎల్ఓయుల కాలపరిమితిని 365 రోజులుగా పేర్కొన్నాడు. ఒక్కో ఎల్ఓయు ఇచ్చినప్పుడు వంద శాతం మార్జిన్ మనీని సంస్థలు బ్యాంకుకు చెల్లించాలి. నీరవ్ పాత కస్టమరే కాబట్టి ఆ అవసరం లేకుండా గోకుల్‌నాథ్ శెట్టి వ్యవహారాన్ని నడిపించాడు.

English summary
Ex deputy managaer Gokulanath Shetty has played key role in Nirav Modi's Punjab National bank (PNB) scam).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X