వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్‌బి స్కామ్: ఎవరీ నీరవ్ మోడీ, ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB Fraud : Nirav Modi Flees India, Who Is He ?

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. దాదాపు ర.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.

బిఎస్ఈ పైలింగ్‌లో బ్యాంక్ ఆ కుంభకోణం గురించి చెప్పింది. అయితే ఈ భారీ కుంభకోణానికి, ప్రముఖ నగర వ్యాపారి, కోటీశ్వరుడు నీరవ్ మోడీకి సంబంధం ఉన్నట్లు బ్యాంక్ ఆరోపించింది.

ఒక్కసారిగా అతను వెలుగులోకి...

ఒక్కసారిగా అతను వెలుగులోకి...

గత పది రోజుల వరకు నీరవ్ మోడీపై ఎవరి దృష్టీ పడలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబిఐకి ఫిర్యాదు చేయడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. నీరవ్ మోడీ శక్తివంతమైన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలు దారు. బ్యాంకును దాదాపు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణతో నీరవ్ మోడీపై ఫిబ్రవరి 5వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది.

ఆ తర్వాతి వారంలోనే...

ఆ తర్వాతి వారంలోనే...

బ్యాంకులోని ముంబై శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని తర్వాతి వారంలోనే ఫిర్యాదు చేసింది. దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆ ఫిర్యాదులో చెప్పారు. ఆ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నీరవ్ మోడీ భారతదేశంలో అత్యంత చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

పైర్ స్టార్ డైమండ్ వ్యవస్థాపకుడు

పైర్ స్టార్ డైమండ్ వ్యవస్థాపకుడు

నీరవ్ మోడీ 2.3 బిలియన్ డాలర్లతో ఫైర్ స్టార్ డైమండ్ అనే సంస్థను స్థాపించాడు. వజ్రాల వ్యాపారుల కుటుంభంలోనే ఆయన పుట్టాడు. వజ్రాల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. ఆసియాలోని చైనా నుంచి ఉత్తర అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాల్లో తన వ్యాపారాలను విస్తరించాడు.

ఫోర్బ్స్ జాబితాలో ఇలా...

ఫోర్బ్స్ జాబితాలో ఇలా...

ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో నీరవ్ మోడీ తొలిసారి 2013లో చోటు దక్కించుకున్నాడు. 2016 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో ఆయనకు 1,067 ర్యాంక్ దక్కింది. భారత్‌ బిలియనీర్లలో ఆయనకు 46వ స్థానం దక్కింది. నిరుడు భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో 82వ ర్యాంక్ పొందాడు. 2017లో ఆయన భారత్‌లో 57వ స్థానం దక్కించుకున్నారు.

విస్తరించుకుంటూ వెళ్లాడు...

విస్తరించుకుంటూ వెళ్లాడు...

నీరవ్ మోడీ 2016లో న్యూయార్క్‌లో కూడా ఓ స్టోర్‌ను తెరిచాడు. తన వ్యాపారాలను, స్టోర్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లాడు. ఆయన జువెల్లరీ డిజైన్లకు ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్. ఫ్యాషన్ ఐకాన్‌గా నీరవ్ మోడీ జువెల్లరీస్‌ను చెబుతుంటారు. లగ్జరీ డైమండ్ జువెల్లరీ డిజైనర్‌గా ఆయన ప్రసిద్ధి.

వజ్రాలను ఆభరణాలుగానే కాకుండా

వజ్రాలను ఆభరణాలుగానే కాకుండా

వజ్రాలను కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడులుగా కూడా ప్రమోట్ చేస్తూ వచ్చాడు నీరవ్ మోడీ. పిఎన్‌‌బి నమోదు చేసిన చీటింగ్ కేసులో భాగంగా ఐటి అధికారులు ఢిల్లీ,సూరత్, జైపూర్ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలపై దాడులు చేశారు.

English summary
Nirav Modi, the billionaire in the middle of this controversy, is a luxury diamond jewellery designer who was ranked 57 in the Forbes list of India's billionaires in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X