వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 కోట్ల కోడి పందాలు: బాబు సంబరాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీలో భారీగా కోడి పందాలు సాగాయి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పందాలు జరిగాయి. విశాఖ నగరంలోని తొలిసారి బహిరంగంగా కోడి పందాలు జరిగాయి.

దాదాపు వందల కోట్ల మేర బెట్టింగులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే దాకా కోడి పందాలు సాగాయి. ప్రజాప్రతినిధులు కూడా కోడి పందాల్లో పాలుపంచుకున్నారు. కోనసీమలో పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు, మద్యం, కోడి పందాలతో రూ.125 కోట్ల పైనే చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఓ వైపు కోడిపందేల నిర్వహణను అడ్డుకోవాలని అత్యున్నత కోర్టు ఆదేశాలు, సెక్షన్‌ 30 అమలులో ఉన్నా, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ పోలీసుల హెచ్చరికలు... ఎప్పటి మాదిరిగానే సంక్రాంతి సంబరాలు కొనసాగుతాయని ప్రజాప్రతినిధుల హామీల మధ్య కోడి పందాలు జరిగాయి.

సంక్రాంతి రావడంతో గురువారం నుంచి శనివారం వరకు యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సందడి అధికంగా కనిపించింది. పోలీసులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కోడి పందాలు

కోడి పందాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో పందేనికి పందేనికి మధ్య వ్యవధి కేవలం పది నిమిషాలు కూడా లేకుండా పోటీలు సాగాయి. జిల్లాలో సుమారు 300 కోడి పందేల బరులకు పైగా నిర్వహించినట్లు అంచనా. ఈ మూడు రోజుల్లో జిల్లాలో రూ.350 కోట్లకు పైగా పందేలా మాటున చేతులు మారాయని అంటున్నారు. విలీన మండలమైన కుక్కునూరుకు తెలంగాణ నుంచి జనం తరలి వచ్చారు. కేవలం ఇక్కడే రూ.కోటి చేతులు మారినట్లు అంచనా.

కోడి పందాలు

కోడి పందాలు

తూర్పు గోదావరి జిల్లాలో మూడురోజుల పాటు జిల్లాలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పందేలు వీక్షించడానికి వీలుగా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మురమళ్లలో నిర్వహించిన పందేల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కోడి పందాలు

కోడి పందాలు

కృష్ణా జిల్లాలో మూడు రోజుల పాటు నిర్భయంగా సాగిన జూద క్రీడల్లో దాదాపు రూ.150 కోట్లకు పైగా డబ్బు చేతులు మారినట్లు అంచనా ఉంది. కైకలూరు, పెనమలూరు, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులే కోడిపందేలను ప్రారంభించారు. అంతేకాకుండా అధికార, ప్రతిపక్షాలకు చెందిన వారు ఏకయ్యారు.

కోడి పందాలతో పాటు జల్లికట్టు

కోడి పందాలతో పాటు జల్లికట్టు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, భీమవరం, బి కొంగరవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం జల్లికట్టు (పశువుల పందేలు) నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరిగాయి. యువత కోడెగిత్తలను ఒడిసి పట్టుకుని వాటి కొమ్ములకున్న కానుకలను చేజిక్కించుకున్నారు. కొన్ని కోడె గిత్తల పౌరుషం ముందు యువత చేతులెత్తేశారు. ఈ ఉత్సవాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సంక్రాంతి సంబరాలు జరుపుకుంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు, కుటుంబం.

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

స్వగ్రామం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంది.

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

స్వగ్రామం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంది. పూజలు చేస్తున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు.

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

నారావారిపల్లోలె చంద్రబాబు కుటుంబం

స్వగ్రామం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంది. చంద్రబాబును కలిసేందుకు బారులు.

English summary
Despite a Supreme Court ban, cockfight continued unabated for the second day across Andhra Pradesh on Friday as part of Pongal festivities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X