రాష్ట్రపతిగా వీడ్కోలు: ప్రణబ్ పయనమెటు, కుమార్తె స్పష్టత

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇక నుండి ఏం చేయనున్నారనే చర్చ ప్రారంభమైంది. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగిసింది. ఆయన స్థానంలో కోవింద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన తర్వాత రాష్ట్రపతి పదవిలో కొనసాగిన ప్రణబ్ ఏం చేస్తారనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇక నుండి ఏం చేయనున్నారనే చర్చ ప్రారంభమైంది. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగిసింది. ఆయన స్థానంలో కోవింద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన తర్వాత రాష్ట్రపతి పదవిలో కొనసాగిన ప్రణబ్ ఏం చేస్తారనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 Pranab as Congress political adviser? No, says daughter

కాంగ్రెస్ పార్టీతో ప్రణబ్ సుదీర్ఘంగా కొనసాగారు. యూపీఏ ప్రభుత్వహయంలో ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.అయితే రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం రెండురోజుల క్రితమే ముగిసింది.

కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాద్‌కోవింద్ ఎన్నికయ్యారు. మంగళవారం నాడు కోవింద్ బాద్యతలను స్వీకరించారు. అయితే ప్రణబ్ ఏం చేస్తారనే చర్చ మాత్రం ప్రస్తుతం అందరిలో తొలుస్తోంది.

ప్రణబ్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సలహలిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.అయితే ఈ విషయమై తనకు స్పష్టత లేదని కూడ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ప్రత్యక్షరాజకీయాలకు తన తండ్రి దూరంగా ఉంటారని ప్రణబ్ కూతురు శర్మిష్ట ముగింపు పలికారు. తన తండ్రి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆమె ప్రకటించారు.

రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన రాజకీయాలకు అతీతంగా వెళ్ళారు. గొప్ప రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న తన తండ్రి గొప్పి నిధిలాంటి వాడు. అయితే ఏ పార్టీలో కానీ, ఏ నేత అయినా ఆయన అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా సహయం చేస్తారని ఆమె చెప్పారు.

President Pranab Mukherjee condemned violators of women: Watch video | Oneindia News

అయితే ఇది ఏ ఒక్కపార్టీకే కాదు అన్ని పార్టీలకు ఇది వర్తిస్తోందన్నారు. గతంలో కూడ పలువురికి ఆయన సలహ ఇచ్చారని, అందుకే ఆయనను అన్నిపార్టీల నేతలు గౌరవిస్తారని ఆమె చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mukherjee's daughter Sharmistha ruled out his return to active politics."Once he assumed the presidentship, he went beyond party politics," she told media, Sharmistha said "her father was like a treasure, with tremendous political and administrative experience". But she added, "If any leader from any political party wants to avail his experience, I am sure he will help. But that is available to all across party lines."
Please Wait while comments are loading...