• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రైవేటీకరణ సరే: బోర్డుల పటిష్ఠం.. ఆపై జోక్యం తగ్గితే భేషుగ్గా బ్యాంకుల విధులు

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ.13 వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణే సరైన చర్య అని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా మొదలు పలువురు ఆర్థికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ 2003లో వెలుగు చూసిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ బాగోతం గుర్తుకు తెచ్చుకుంటే సమస్య ఒకటైతే.. పరిష్కారం మరొకటి చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.

ప్రైవేటీకరణ సంగతి పక్కనబెడితే వాటి నిర్వహణతోపాటు కార్పొరేట్ ప్రపంచానికి రుణాల మంజూరులో రాజకీయ జోక్యం నివారణతోపాటు స్వేచ్ఛ నివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం గానీ, ఒక దానిలో మరొకదాన్ని విలీనం చేయాలన్న ప్రతిపాదనపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్ బ్యాంకుల్లోనూ నిర్వహణ లోపాలు

ప్రైవేట్ బ్యాంకుల్లోనూ నిర్వహణ లోపాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీనమో, ప్రైవేటీకరణో.. బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గం కాబోదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిర్వహణ లోపాలు కేవలం పీఎస్బీలకు మాత్రమే పరిమితం కాదని ప్రైవేట్ బ్యాంకులు కూడా నిర్వహణాలోపంతో దెబ్బ తిన్నవేనని గుర్తు చేస్తున్నారు. బ్యాంకుల బోర్డులకు మరింత సాధికారతనివ్వాలని, రాజకీయ జోక్యం లేకుండా సమర్థంగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

ప్రజల సొమ్ముకు ప్రభుత్వ రంగ బ్యాంకులే భద్రం

ప్రజల సొమ్ముకు ప్రభుత్వ రంగ బ్యాంకులే భద్రం

దేశీయంగా ఇంకా చాలా వరకు జనాభాకు బ్యాంకింగ్‌ సర్వీసులు అందుబాటులో లేవని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్‌ గుర్తు చేశారు. వారికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకే కాకుండా సామాజిక కోణంలో చూసినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మనదేశ పౌరుల్లో పొదుపు కూడా ఎక్కువేనని గుర్తు చేశారు. సొమ్ము దాచుకునే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులే భద్రత కల్పించగలవని స్పష్టం చేశారు.

బ్యాంకులపై రాజకీయ జోక్యం ఉండొద్దన్న బాలక్రుష్ణన్

బ్యాంకులపై రాజకీయ జోక్యం ఉండొద్దన్న బాలక్రుష్ణన్

బ్యాంకుల సీఈవోల ఎంపిక, వారి జీతభత్యాలు, పనితీరు మదింపు, స్వతంత్ర బోర్డు సభ్యుల ఎంపిక తదితర అంశాల్లో బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోకు (బీబీబీ) మరిన్ని అధికారాలు ఉండాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్‌ అన్నారు. ‘బ్యాంకుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. కఠినతరమైన నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగంతో పాటు సంస్థాగతంగా సరైన వ్యవస్థ ఉంటే పీఎస్‌బీలు రాణించేందుకు అవకాశముంది'' అని బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వమే బ్యాంకుల పనితీరును అడ్డుకుంటున్నదన్న మోహన్ దాస్ పాయ్

ప్రభుత్వమే బ్యాంకుల పనితీరును అడ్డుకుంటున్నదన్న మోహన్ దాస్ పాయ్

మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగ్గా పనిచేసేందుకు మరింత స్వేచ్ఛ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇన్ఫీ మరో మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యాజమాన్యమే వాటిని సరిగ్గా పని చేయనివ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపార నిర్వహణలో బ్యాంకర్లకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని చేయనివ్వడం లేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు.

బ్యాంకుల విలీనం ఊసే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ

బ్యాంకుల విలీనం ఊసే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ

పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాబోయే ఏడాది కాలంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఏ బ్యాంకును ప్రైవేటీకరించడంగానీ, ఇతర బ్యాంకులో విలీనం చేయడమో ఉండదని పేర్కొంది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమైన అనంతరం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం ఈ విషయం చెప్పారు. వచ్చే సంవత్సర కాలంలో ఏ పీఎస్‌బీని విలీనం చేయడమో లేదా ప్రైవేటీకరించడమో జరగదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని వెంకటాచలం తెలిపారు.

పీఎన్బీ స్కాంపై చురుగ్గా విచారణ సాగుతోందన్న జైట్లీ

పీఎన్బీ స్కాంపై చురుగ్గా విచారణ సాగుతోందన్న జైట్లీ

బ్యాంకుల పనితీరును మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అయినప్పటికీ.. ప్రస్తుతానికి కనీసం ఏడాది వ్యవధిలో వాటిని ప్రైవేటీకరించే యోచనేదీ లేదని ఆయన చెప్పారు' అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ స్కామ్, కుట్రదారు నీరవ్‌ మోదీని వెనక్కి తెప్పించే విషయంలో తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు జైట్లీతో భేటీ అయినట్లు ఆయన వివరించారు. పీఎన్‌బీ స్కాంపై విచారణ చురుగ్గా కొనసాగుతోందని మంత్రి భరోసానిచ్చినట్లు వెంకటాచలం చెప్పారు.

నిర్దేశిత లక్ష్యాల సాధనలో గణనీయ పురోగతి సాధించామన్న వినోద్ రాయ్

నిర్దేశిత లక్ష్యాల సాధనలో గణనీయ పురోగతి సాధించామన్న వినోద్ రాయ్

బ్యాంకింగ్‌ నియామకాల విషయంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. బ్యాంకుల పాలక వర్గం నియామక ప్రక్రియల్లో కేంద్రం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. ప్రభుత్వానికి బీబీబీకి మధ్య ఎటువంటి సమన్వయ లోపం లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించిందని ఆయన స్పష్టం చేశారు. పలు అంశాలపై బీబీబీ, ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయ్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన రెండేళ్లలో ఆర్‌బీఐ, ప్రభుత్వ సహకారంతో బీబీబీ తమకు అప్పగించిన పని విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని రాయ్‌ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

బీబీబీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించే చాన్స్

బీబీబీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించే చాన్స్

బ్యాంకుల నిర్వహణపై వాటికి స్వతంత్ర యాజమాన్య హక్కులు కల్పించాలని బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగురపర్చే లక్ష్యంతో 2016 ఏప్రిల్‌ 1న ఏర్పాటైన బీబీబీ కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. బీబీబీని ప్రభుత్వం పునర్వ్యస్థీరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. పలు బీబీబీ సిఫారసులపై ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులకు నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో, వ్యూహాల రూపకల్పనలో స్వతంత్రత ఉండాలని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు చైర్మన్ అభిప్రాయ పడ్డారు. వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దక్షత కల వారిని నియమించుకోవాలని, వేగంగా మార్పులకు లోనవుతున్న ఈ ప్రపంచంలో ప్రభుత్వ బ్యాంకులు సాంకేతికతను విరివిగా వాడుకోవడంతోపాటు అందుకు చురుకైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad: Privatisation of public sector banks is not the answer to address the current problems in the sector, according to some industry figures, who say PSBs need empowered Boards with freedom to operate efficiently in an environment free from political interference.Former Chief Financial Officer of Infosys Ltd, V Balakrishnan noted that the Global Trust Bank was a private bank when it failed, amid a debate on the functioning of PSBs and whether there is a case for privatising them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more