హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పిలుపు: గుంత తవ్విన రకుల్, రాశి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రముఖ సినీ తారలు అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, రాశీకన్నా తదితరులు హైదరాబాదులో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఒక్క రోజునే 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది.

నగరంలో 4,173 ప్రాంతాల్లో 35 లక్షల మొక్కలను నాటేందుకు నగర పాలక సంస్థ మొక్కలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా హీరో అల్లు అర్జున్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు మొక్కలు నాటారు. అల్లు అర్జున్ సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అల్లు అరవింద్, అల్లు అర్జున్, అర్జున్ భార్య స్నేహ రెడ్డి, తనయుడు అయాన్‌లు తమ తమ రాశి, జన్మ నక్షత్రం ప్రకారం మొక్కలు నాటారు. వారి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. నటుడు దగ్గుబాటి రానా నానక్ రాం గూడలో చెట్లు నాటారు. అందరూ మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

రామోజీ ఫిలిం సిటీలో రామోజీ రావు మొక్క నాటారు. ఫిలిం సిటీలోని బర్డ్స్ పార్క్ వద్ద నాటారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు టీసీఎస్ క్యాంపస్లో, పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీహెచ్ఈఎల్‌లో మంత్రి హరీష్ రావులు మొక్కలు నాటారు.

తలసాని మాట్లాడుతూ.. హరిత హారం రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవన్నారు. తమకు ప్రచారం కంటే పని ముఖ్యమని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నరసింహన్ కూడా మొక్క నాటారు. నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కదంబ, వేమ మొక్కలు నాటారు.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు పంపిణి చేశారు.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు పంపిణి చేశారు. పక్కన మేయర్ బొంతు రామ్మోహన్.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు నాటారు.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న రాశి ఖన్నా.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం కేబీఆర్ పార్కు వద్ద రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నాలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న రాశి ఖన్నా.

మొక్కల పంపిణీ

మొక్కల పంపిణీ

హరిత హారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. గుంత తవ్వి మొక్క నాటుతున్న రకుల్, చూస్తున్న రాశీకన్నా.

English summary
Rakul Preet Singh & Raashi Khanna Plant Trees at KBR Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X