వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియో పతకం: 5రికార్డులు సృష్టించిన సాక్షి మాలిక్

|
Google Oneindia TeluguNews

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్-2016లో పతకం కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత్‌కు కాంస్యం పతకం అందించి 125కోట్లమంది ప్రజలకు ఆనందాన్ని తెచ్చింది సాక్షి మాలిక్. గురువారం దేశమంతా రాఖీ పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటుండగా సాక్షి తెచ్చిన పతకం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ గెలుపుతోపాటు సాక్షిపలు రికార్డులను నమోదు చేసింది.

సాక్షిపై సెహ్వాగ్ ట్వీట్ అద్భుతం: క్రికెటర్ల ప్రశంసలు, భారీ నజరానాలు

బుధవారం 3గంటలకుముందు ఈ 23ఏళ్ల సాక్షి.. 58కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. హర్యానాకు చెందిన సాక్షి.. రెపిచేజ్‌ తుది పోరులో 8-5 తేడాతో ఐసులు టినిబెకోవా ( కిర్గిజిస్థాన్‌)పై విజయం సాధించింది.

Rio Olympics: 5 records set by India's bronze medallist Sakshi Malik

సాక్షి సాధించిన ఐదు రికార్డులు

1. రియో ఒలింపిక్స్-2016లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి సాక్షి

2. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్ తరపున తొలి పతకం సాధించిన క్రీడాకారిణి. ఆమె కంటే ముందు ముగ్గురు క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. వీరిలో కేడీ జాద్(1952 హెల్సింకిలో కాంస్యం), సుశీల్ కుమార్(2008 బీజింగ్‌లో కాంస్యం, 2012లండన్‌లో రజతం), యోగేశ్వర్ దత్(2012లండన్‌లో కాంస్యం) ఉన్నారు.

3. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన 4వ మహిళా క్రీడాకారిణిగా సాక్షి రికార్డు సృష్టించారు. మిగితా ముగ్గురురిలో కరణం మల్లేశ్వరి(2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించింది), మేరీ కోమ్ (2012లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో కాంస్యం), సైనా నెహ్వాల్(2012లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం) ఉన్నారు.

4. సాక్షి.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే పతకం సాధించడం విశేషం.

5. 23ఏళ్ల అతి తక్కువ వయస్సులో ఒలింపిక్స్ గెలిచిన భారత రెజ్లర్‌గా సాక్షి రికార్డు సృష్టించారు.

English summary
Wrestler Sakshi Malik not only ended India's wait for a medal at Rio Olympics 2016 but also set records in Brazil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X