• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెక్సికో ప్రకృతి ప్రకోపం: ఫలకాల రాపిడే కారణమా?

By Swetha Basvababu
|

మెక్సికో సిటీ: దెబ్బ మీద దెబ్బ.. మెక్సికోను శక్తిమంతమైన భూకంపం కుదిపేసి, భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 12 రోజుల తేడాతో వచ్చిన రెండో వచ్చిన భూకంపం ప్రభావం ఇది. అంతకుముందు సెప్టెంబర్‌ 7న రిక్టర్‌ సూచీపై 8.1 తీవ్రతతో భూకంపం విరుచుకుపడింది.

శతాబ్ద కాలంలో మెక్సికోలో అదే అత్యంత శక్తిమంతమైన భూకంపం. 1985లో 10వేల మందిని పొట్టనబెట్టుకున్న భూకంపం వచ్చిన రోజునే తాజా ప్రకంపన చోటుచేసుకుంది. ఒక నెలలోనే రెండు బలమైన భూకంపాలు.. పరస్పరం దగ్గరగా చోటుచేసుకోవడం అసాధారణం.

బలమైన భూకంపాల వల్ల కొన్నిసార్లు సమీప ప్రాంతాల్లోని భూఫలకాల్లోని ఒత్తిడిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా మరో భూకంపం వస్తుందని వివరించారు. భౌగోళికంగా మెక్సికో నెలకొన్న ప్రదేశం వల్లే ఈ విపత్తు చోటుచేసుకుంటోందని విశ్లేషిస్తున్నారు. ఇందకు కారణాలపై ఒక పరిశీలన

కొకోస్ ఫలకంతో ఖండ ఫలకం రాపిడితో ఈ భూకంపం

కొకోస్ ఫలకంతో ఖండ ఫలకం రాపిడితో ఈ భూకంపం

భౌగోళికంగా మెక్సికో ఉన్న ప్రదేశం రీత్యా ఆ దేశానికి శక్తిమంతమైన భూకంపాల బెడద ఎక్కువ. ‘సబ్‌డక్షన్‌ జోన్‌' అనే ప్రదేశంలో ఇది ఉంది. భూమి బయటి పొర పలు ఫలకాలుగా విడిపోయి ఉంటుంది. ఒక ఫలకం.. క్రమేణా మరోదాని కిందకు జారిపోతూ ఉంటే ఆ ప్రాంతాన్ని ‘సబ్‌డక్షన్‌ జోన్‌' అని అంటుంటారు. మెక్సికో వద్ద కోకోస్‌ అనే సముద్ర ఫలకం, ఉత్తర అమెరికాకు సంబంధించిన ఖండ ఫలకం ఉన్నాయి.

కోకోస్‌ ఫలకం క్రమంగా ఖండ ఫలకం కిందకు జారిపోతోంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా ఒత్తిడి పేరుకుపోతోంది. ఒక దశలో ఆ ఒత్తిడి ఎక్కువై, భూకంపం రూపంలో అకస్మాత్తుగా విడుదలవుతుంది. ఇటీవల వచ్చిన రెండు భూకంపాలకు కారణమైన సబ్‌డక్షన్‌ ప్రాంతం.. మధ్య అమెరికా పశ్చిమ తీరం వెంబడి మెక్సికో నుంచి పనామా వరకూ విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక శక్తిమంతమైన భూకంపాలకు ఈ ‘సబ్‌డక్షన్‌' ప్రాంతాలే కారణం. రిక్టర్‌ సూచీపై 9 కన్నా ఎక్కువగా వచ్చే భూకంపాలు ఈ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటాయి. 2011లో జపాన్‌ తీరానికి చేరువలో, 2004లో ఇండొనేసియా వద్ద వచ్చిన 9.1 స్థాయి భూకంపాలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పటివరకూ నమోదైన భూకంపాల్లో.. 1960లో చిలీని కుదిపేసిన 9.5 ప్రకంపనే అత్యంత శక్తిమంతమైంది.

అరెగాన్ నుంచి పసిఫిక్ తీరం మీదుగా ఇలా

అరెగాన్ నుంచి పసిఫిక్ తీరం మీదుగా ఇలా

అమెరికాలో రెండు సబ్‌డక్షన్‌ ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి.. అలాస్కాతో ముడిపడి ఉన్న ఒక ప్రదేశంలో ఉంది. అది 1964లో 9.2 తీవ్రతతో భూకంపాన్ని కలిగించింది. ఆ స్థాయి ప్రకంపన వందేళ్ల వరకూ తలెత్తకపోవచ్చు. రెండోది.. కేస్కేడియా సబ్‌డక్షన్‌ ప్రదేశం. ఇది అరెగాన్‌, వాషింగ్టన్‌ల పశ్చిమ సరిహద్దుల గుండా పసిఫిక్‌ తీరం వెంబడి సాగుతుంది. అక్కడున్న ‘జువాన్‌ డీ ఫుకా' ఫలకం.. క్రమంగా ఉత్తర అమెరికా ఫలకం కిందకు జారిపోతోంది. 1700లో కేస్కేడియా సబ్‌డక్షన్‌ ప్రాంతంలో 9.0 తీవ్రతతో పెను భూకంపం వచ్చింది.

భూకంపాలు ఎంత తరచుగా వస్తాయన్నదానిపై ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఆ తరహా భూకంపం చోటుచేసుకునే సమయం ఇప్పటికే వచ్చేసింది. అది ఏ రోజైనా విరుచుకుపడొచ్చు. ఆ స్థాయి ప్రకంపన, దాని కారణంగా తలెత్తే సునామీ వల్ల అరెగాన్‌, వాషింగ్టన్‌లో భారీ వినాశనం చోటుచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యర్థజలాలను భూమిలోకి పంప్‌ చేయడం ఒక్లహామాలో వల్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత గరిష్ఠంగా 5.8గా నమోదైంది. భవిష్యత్‌లో ఇవి ఎంత బలంగా తయారవుతాయన్నది అస్పష్టంగా ఉంది. పశ్చిమ కాలిఫోర్నియా వెంబడి ఉత్తరం నుంచి దక్షిణం వరకూ సాగే శాన్‌ ఆండ్రియాస్‌ ఫాల్ట్‌ వల్ల 8.2 తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. దట్టమైన జనావాసాలు కలిగిన ఈ రాష్ట్రంలో ఇది పెను నష్టాన్ని కలిగిస్తుంది.

పరిస్థితులను బట్టి ప్రాణ, ఆస్తినష్టం

పరిస్థితులను బట్టి ప్రాణ, ఆస్తినష్టం

ఈ నెలలో వచ్చిన రెండు భూకంపాలూ.. కుంగుతున్న కోకోస్‌ ఫలకంలో వచ్చాయి. అవి కోకోస్‌, ఉత్తర అమెరికా ఫలకాల నడుమ ఉన్న ప్రదేశంలో వచ్చి ఉంటే పెను భూకంపమయ్యేది. భూఫలకాల సరిహద్దుల్లో వచ్చిన ప్రకంపనల్లో భారీ ‘ఫాల్ట్‌'ల ప్రమేయం ఉంటుంది. అందువల్ల ఎక్కువ దూరం వరకూ మేర అధిక శక్తి వెలువడుతుంది. అయితే అవి ఎక్కువగా భూ ఉపరితలానికి చాలా లోతులో ఏర్పడతాయి. ఒకే ఫలకంలో చోటుచేసుకునే భూకంపాలు బలహీనంగా ఉంటాయి. అయితే ఉపరితలానికి చాలా దగ్గరగా ఉంటాయి.

అందువల్ల.. సరిగ్గా వాటిపైన ఉండే ప్రదేశంలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. మెక్సికోలో తాజాగా వచ్చిన భూకంపంతో పోలిస్తే.. సెప్టెంబర్‌ 7న వచ్చిన ప్రకంపన శక్తిమంతమైంది. నిజానికి దానివల్లే ఎక్కువ నష్టం జరగాల్సింది. కానీ ఆ భూకంప కేంద్రం.. దట్టమైన జనావాసాలకు దూరంగా ఉండటంతో నష్టం తక్కువగా ఉంది. తాజా భూకంపం మాత్రం మెక్సికో సిటీకి చేరువలో వచ్చింది. అది కూడా అవక్షేప బేసిన్‌పై తలెత్తింది. అలాంటి చోట వచ్చే భూకంపం వల్ల కంపనం ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటివి చాలా వచ్చాయి...

ఇలాంటివి చాలా వచ్చాయి...

సాధారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట 8 కన్నా తీవ్రమైన భూకంపం ఒకటి వస్తుంది. 7 కన్నా ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు దాదాపు డజను మేర వస్తాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇది చాలావరకూ ప్రశాంత సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అమెరికా భూగర్భశాఖ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ 4.5 కన్నా తీవ్రమైన భూకంపాలు 4200 వరకూ చోటుచేసుకున్నాయి. 2016, 2015లో ఇదే వ్యవధిలో ఈ స్థాయి భూకంపాలు 5100 వరకూ వచ్చాయి. 2014లో 6000 వరకూ చోటుచేసుకున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We are often reminded about the force and devastation from earthquakes that occur around the Pacific Ring of Fire. The titanic collision of two tectonic plates, which firmly lock together and accrue strain over tens to hundreds of years, eventually releases this pent-up energy as a large earthquake. We have seen such quakes striking Indonesia, Chile and Japan over the past 15 years. Mexico, too, lies on the Ring of Fire and is no stranger to such quakes: the 1985 8.0 magnitude earthquake that devastated Mexico City was a fairly typical “thrust” earthquake that ruptured the shallow portion of the tectonic plate boundary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more