వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలాం కొట్టాల్సిందే!: సమోసా వ్యాపారి కొడుకు ఎంసెట్‌లో టాపర్..

ఇటీవల తెలంగాణ ఎంసెట్ పరీక్షల్లో టాప్-5 ర్యాంకు దక్కించుకున్న ఇతను.. అటు ఏపీ ఎంసెట్ పరీక్షలో నంబర్.1 ర్యాంకు సాధించాడు. ఇక జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియాలో 6వ ర్యాంకు, సౌత్ ఇండియ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పేదరికం తన నేపథ్యమే తప్ప.. తన ప్రతిభకు అది కొలమానం కాదని నిరూపించాడో విద్యార్థి. సమోసాలు అమ్ముకునే తండ్రి కడుపున పుట్టి రాష్ట్రం గర్వించదగ్గ రీతిలో ర్యాంకుల పంట పండించాడు. ఇటు స్టేట్ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లోను, అటు జాతీయ స్థాయి పరీక్షల్లోను అందరి కన్నా మిన్నగా రాణించి శెభాష్ అనిపించుకుంటున్నాడు.

అతనే కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన మోహన్ అభ్యాస్ అనే విద్యార్థి. ఇటీవల తెలంగాణ ఎంసెట్ పరీక్షల్లో టాప్-5 ర్యాంకు దక్కించుకున్న ఇతను.. అటు ఏపీ ఎంసెట్ పరీక్షలో నంబర్.1 ర్యాంకు సాధించాడు. ఇక జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియాలో 6వ ర్యాంకు, సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ర్యాంకును దక్కించకున్నాడు.

Samosa maker’s son from Kukatpally takes top rank in Eamcet

మోహన్ అభ్యాస్ తల్లిదండ్రులు సమోసా వ్యాపారం మీదనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంటి వద్ద భార్యతో కలిసి తయారుచేసిన సమోసాను.. మోహన్ తండ్రి సుబ్బారావు వీధుల్లో తిరిగి అమ్ముకొస్తాడు. కూకట్ పల్లిలోని పలు స్నాక్స్ దుకాణాలకు కూడా ఆయన సమోసా విక్రయిస్తుంటారు. మోహన్ అభ్యాస్ కూడా సమోసా తయారీలో తల్లిదండ్రులకు తరుచుగా సహాయం చేస్తుంటాడు.

మోహన్ తండ్రి సుబ్బారావు బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి నుంచి 13ఏళ్ల క్రితం కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ కు వచ్చారు. అప్పటినుంచి సమోసా వ్యాపారం మీదనే వీరి కుటుంబం ఆధారపడింది. జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటడమే మోహన్ అభ్యాస్ తన తర్వాతి టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందులో సత్తా చాటడం ద్వారా చెన్నై ఐఐటీలో బీ.ఈ(ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్) చేయాలని ఆశపడుతున్నాడు.

కాగా, మే 21వ తేదీ నాడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జరగనుంది. ఓవైపు బీఈ చేస్తూనే మరోవైపు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బీఎస్సీ ఫిజిక్స్ చదవాలని మోహన్ భావిస్తున్నాడు. 'ఫిజిక్స్ లో రీసెర్చీ స్థాయి దాకా వెళ్లడంతో పాటు అంతిమంగా సైంటిస్ట్ కావాలన్నదే నా ఆశయం' అని మోహన్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

English summary
Poor financial background has not come in the way of studies of V. Mohan Abhyas from Kukatpally Housing Board. The top ranks he scored in state and national entrance test are a pointer to his brilliance and study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X