హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా రెండు రోజులపాటు పలు అంశాల్ని చర్చించేందుకు హైదరాబాద్‌లోని మారియట్‌ హోటల్‌లో శనివారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువులు సీఎంలు, పలువురు న్యాయమూర్తులు మాట్లాడారు.

మనస్సాక్షికి జవాబుదారీగా ఉంటూ ప్రజలకు న్యాయాన్ని అందించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎఆర్ దవే ఇరురాష్ట్రాలకు చెందిన న్యాయాధికారులకు సూచించారు. దేవుని ప్రతినిధులుగా భావించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

ప్రతినిధి తీరు సక్రమంగా లేకపోతే యజమానిని నిందిస్తారని, న్యాయవ్యవస్థలో మీరు ప్రతినిధులన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రామదాసు, మీరాబాయి వంటి వారు భగవంతుడ్ని ప్రేమించిన స్థాయిలో న్యాయాధికారులు వృత్తిని ప్రేమించాలని తెలిపారు. సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ ఇరు రాష్ట్రాల సీఎంలపై ప్రశంసలు కురిపించారు.

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా రెండు రోజులపాటు పలు అంశాల్ని చర్చించేందుకు హైదరాబాద్‌లోని మారియట్‌ హోటల్‌లో శనివారం ఉభయరాష్ట్రాలకు చెందిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సును ప్రారంభించారు.

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

దవే మాట్లాడుతూ.. సత్వర న్యాయం అందించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌, మధ్యవర్తిత్వం తదితర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాజ్యాల్ని పరిష్కరిస్తే ఇరువైపు కక్షిదారులకు సత్వరం న్యాయం అందడంతోపాటు చిరునవ్వుతో వెళతారన్నారు.

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

న్యాయస్థానాల్లోని వ్యాజ్యాలు వేగంగా పరిష్కరించేందుకు ఇలాంటి సదస్సు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని జస్టిస్ దవే అన్నారు.

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్ సుభాష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు.

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

కెసిఆర్‌కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దిగువ కోర్టుల్లో పనిచేస్తున్న సుమారు 900 మందికి పైగా న్యాయాధికారులు హాజరయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమరావతిలో కొత్త హైకోర్టు భవనం, జడ్జిల నివాస సముదాయాలను ప్రపంచస్థాయిలో నిర్మిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. దిగువ కోర్టుల్లో మౌలికసదుపాయాల కల్పనకు సిద్ధంగా ఉన్నామని, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సహకారం అందిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇలాంటి సదస్సులు న్యాయాధికారుల సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడతాయని చంద్రబాబు అన్నారు. గతంలో ప్రపంచం చైనా వైపు చూసేదని, ప్రస్తుతం భారత్‌ వైపు చూస్తోందని చెప్పారు. ఇంటర్‌నెట్‌కు ఫైబర్‌ నెట్‌ ఏర్పాటు చేస్తున్నామని, 3 జిల్లాల్లో పూర్తయిందని, జులైకి అన్ని జిల్లాల్లో పూర్తవుతుందని వివరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అన్ని కోర్టులకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ఏడాదిన్నరలో ఏపీకి సంబంధించి ఆరు లక్షల కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.

చంద్రబాబుతో న్యాయమూర్తులు

చంద్రబాబుతో న్యాయమూర్తులు

కార్యక్రమంలో న్యాయమూర్తులతో మాట్లాడుతున్న చంద్రబాబు దృశ్యం. ఇదిలా ఉండగా కెసిఆర్ కూడా ప్రసంగించారు. సత్వరన్యాయం అందించే అంశాలపై చర్చించేందుకు న్యాయవ్యవస్థ మొత్తం ఒకచోట చేరడమే ప్రజలకు శుభవార్త కేసీఆర్‌ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉన్న కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని సమర్థంగా పనిచేస్తే దేశం పురోగతి సాధిస్తుందన్నారు.

కెసిఆర్, చంద్రబాబు

కెసిఆర్, చంద్రబాబు

చంద్రబాబు ఆంగ్లంలో, కెసిఆర్ తెలుగులో మాట్లాడారు. కేసీఆర్ తెలుగులో ప్రసంగించడంపై సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రసంగంపై అంతా ప్రశంసల జల్లు కురిపించడంతో అంతకుముందు ఇంగ్లిష్‌లో ప్రసంగించిన చంద్రబాబు కొంత ఇబ్బందిపడినట్టుగా కనిపించారని వార్తలు వస్తున్నాయి.

English summary
SC judge Justice NV Ramana says CMs of AP and TS have the vision to develop their states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X