వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేడారం: సారలమ్మ రాక అపూర్వ ఘట్టం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మేడారం: కోట్లాది భక్తులు ఎదురుచూసే అపురూప క్షణాలు సాక్షాత్కరించాయి. మేడారంలో బుధవారం సారలమ్మ రాక అపూర్వ ఘట్టంగా నిలిచింది. దారి పొడవునా లక్షలాదిమంది అమ్మ కోసం ఎదురుచూస్తూ.. దండాలు పెడుతూ.. ధూపదీపాలు సమర్పిస్తూ.. స్వాగతం పలికారు. అలా అమ్మ బుధవారం రాత్రి మేడారం ఆలయంలోని గద్దెకు చేరుకుంది.

సారలమ్మ వెంట గోవిందరాజులు, పగిడిద్దరాజులు కూడా జంపన్నవాగు దాటుకుంటూ తమ గద్దెలపై కొలువుదీరారు. అమ్మ రాకకోసం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎంపీ సీతారాంనాయక్, ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, జెసి ప్రశాంత్ జీవన్‌పాటిల్, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్యలు సారలమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారం గద్దెలపైకి తోడ్కొనివెళ్లారు.

నేడు గద్దెపైకి సమ్మక్క రాక

అశేష భక్తజనావళి ఎదురుచూసే అపురూప క్షణాలు మరికొన్ని గంటల్లో సమీపించనున్నాయి. సారలమ్మ రాకను చూసి తరించిన భక్తజనం, సమ్మక్క తల్లి రాకకోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. నిండు పౌర్ణమి సాయంసంధ్య వేళలో ఆకాశం సైతం మేడారం వైపు చూస్తుండగా సమ్మక్క తల్లి గద్దెను ప్రతిష్ఠించే అపురూప ఘట్టానికి నేడు తెరపడనుంది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కోట్లాది భక్తులు ఎదురుచూసే అపురూప క్షణాలు సాక్షాత్కరించాయి.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

మేడారంలో బుధవారం సారలమ్మ రాక అపూర్వ ఘట్టంగా నిలిచింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

దారి పొడవునా లక్షలాదిమంది అమ్మ కోసం ఎదురుచూస్తూ.. దండాలు పెడుతూ.. ధూపదీపాలు సమర్పిస్తూ.. స్వాగతం పలికారు. అలా అమ్మ బుధవారం రాత్రి మేడారం ఆలయంలోని గద్దెకు చేరుకుంది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

సారలమ్మ వెంట గోవిందరాజులు, పగిడిద్దరాజులు కూడా జంపన్నవాగు దాటుకుంటూ తమ గద్దెలపై కొలువుదీరారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

అమ్మ రాకకోసం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎంపీ సీతారాంనాయక్, ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, జెసి ప్రశాంత్ జీవన్‌పాటిల్, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్యలు సారలమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారం గద్దెలపైకి తోడ్కొనివెళ్లారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

ప్రధాన పూజారి కాక సారయ్య తల్లి సారలమ్మను తీసుకొని రాగా, పూజారి సోలం వెంకటేశ్వర్లు అంజన్న జెండాను చేతబూని మేడారం బయలుదేరారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లి నుంచి మేడారం వరకూ అడుగడుగునా భక్తజనాలు తల్లికి నీరాజనాలు పలికారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకగా సారలమ్మ తల్లిని తీసుకొని ప్రత్యేక పూజారులు కన్నెపల్లి ఆలయం నుంచి సాయంత్రం 6:45 గంటలకు మేడారం బయల్దేరారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

సమ్మక్క తల్లీ దండాలో.. సారక్క తల్లే దండాలో... అంటూ లక్షలాది భక్తజనం చేసిన నామస్మరణతో బుధవారం కన్నెపల్లి నుండి మేడారం వరకు జాతర ప్రాంగణమంతా మార్మోగింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లిలో కొలువున్న సారలమ్మ బుధవారం మేడారం గద్దెకు చేరడంతో నాలుగు రోజులపాటు జరగనున్న మహాఘట్టానికి తెరలేచింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర


సారలమ్మ దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భక్తజనం సారలమ్మ గద్దెపైకి చేరగానే భక్తిభావంతో ఊగిపోయారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లి ఆలయం నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి జంపన్నవాగులో నుండి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు కూడా మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 9.59 గంటలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి చేర్చారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

హనుమాన్ జెండా నీడన సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు ఇతర పూజారులు సారలమ్మను గద్దెపైకి చేర్చారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

సారలమ్మ గద్దెపైకి చేరనున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం కన్నెపల్లి నుండి బైలెల్లిన సారలమ్మ భారీ పోలీసు బందోబస్తు నడుమ మేడారం గద్దెపైకి చేరింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లి ఆలయంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అనేకమంది భక్తులు సారలమ్మ గుడికి తరలివచ్చారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

తమ ఊరి ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు కనె్నపల్లి గ్రామస్తులందరూ సారలమ్మ గుడికి చేరుకున్నారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

మేడారంలోని గద్దెపై కొలువుతీరడానికి కనె్నపల్లి నుండి బయలుదేరిన సారలమ్మకు దారి పొడవునా జాతరకు విచ్చేసిన భక్తులు దండాలు పెడుతూ భక్త్భివంతో ఉప్పొంగిపోయారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లి నుండి మేడారం బైలెల్లిన సారలమ్మ దారిలో తన తమ్ముడు జంపన్న వద్ద కొంత సమయం ఆగింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

సంపెంగ (జంపన్న) వాగులో కొలువైన తమ్ముడు జంపన్న క్షేమ సమాచారాలు తెలుసుకుని అక్కడ నుండి మేడారం చేరుకొని తల్లి ఒడికి చేరింది. సారలమ్మ తన తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా జంపన్నవాగులో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

కన్నెపల్లి నుండి మేడారం గద్దెలపైకి చేరడానికి సారలమ్మ వెళ్తుండగా వేలాది భక్తులు రోడ్డుపైకి రావడంతో కనె్నపల్లి, మేడారం పరిసరాలు కిటకిటలాడాయి.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

పోలీసుల భారీ బందోబస్తు సాయంత్రం 6.45 గంటలకు కనె్నపల్లి నుండి బయల్దేరిన సారలమ్మకు అడుగడుగునా పోలీసులు దుర్భేద్యమైన రక్షణకవచంగా నిలిచారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

పూజలు జరుగుతున్న సమయంలోనే సారలమ్మ ఆలయంలో రోప్‌పార్టీ బృందాన్ని ఏర్పాటు చేశారు. అటునుండి అమ్మవారిని ఎన్నడూలేని విధంగా మూడంచెల బందోబస్తుతో రోప్ పార్టీ మేడారానికి అమ్మవారిని తీసుకవచ్చింది.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

పర్యవేక్షించిన వారిలో జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటి తదితరులు పాల్గొన్నారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

సంతానం లేని పలువురు మహిళలు కనె్నపల్లి గుడి వద్ద బుధవారం వరంపట్టారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి తడి బట్టలతో సారలమ్మ గుడికి చేరుకుని గుడి ముందు పొర్లు దండాలు పెట్టారు.

మేడారం మహాజాతర

మేడారం మహాజాతర

అమ్మవారి ప్రతిరూపమైన పసుపు -కుంకుమలను మొంటె (వెదురుబుట్ట)లో పెట్టుకుని సారలమ్మను గద్దెపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపైనుండి దాటి వెళ్లారు.

English summary
The grand procession of pilgrims following the tribal priests who brought the deity of Saralamma from Kannepalli village to Medaram jatara venue signalled the beginning of the historic Sammakka Sarakka Jatara here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X