వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిన యువీ: ఏడ్చిన చీర్‌గర్ల్స్, ఓదార్చిన షారుక్ (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ 9 ఎలిమినేటర్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. ఈ ఓటమికి కోల్‌కతా ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్ గర్ల్స్ అయితే ఏకంగా ఏడ్చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోను కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన సామాజిక అనుసంధాన వేదికలో పోస్ట్ చేశాడు. చీర్ గాల్స్ కన్నీరు కార్చడంపై జట్టు యజమాని షారూక్ ఖాన్ స్పందించారు. వారిని ఓదార్చుతూ ట్వీట్లు చేశారు.

క్రీడాభిమానులను బాగా అలరించాలని తానెన్నడూ చీర్ గాల్స్‌కు చెప్పలేదని అని పేర్కొన్నాడు. జట్టు ఓటమి తనతో పాటు వారినీ బాధించి ఉండవచ్చని, 'థ్యాంక్యూ అండ్ లవ్యూ గాల్స్' అని పేర్కొన్నాడు.

బాగా ఆడుతూ వచ్చిన తమ జట్టు ఈ మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేకపోయిందన్నాడు. హైదరాబాద్ జట్టుకు 'ఆల్ ది బెస్ట్' చెప్పాడు. వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీల కోసం వేచి చూస్తామన్నాడు. కాగా, ఈ మ్యాచులో యువరాజ్ రెచ్చిపోయి ఆడాడు. హైదరాబాద్ గెలుపులో యువీ పాత్ర ఎంతో ఉంది.

English summary
In the IPL 2016 Eliminator, Kolkata Knight Riders were on their way to victory at one stage but then debacled to lose the contest by 22 runs. In the process, Sunrisers Hyderabad set up a qualifier 2 with Gujarat Lions to be played on Friday in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X