వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్ విమాన సేవలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ సేవలు బుధవారం పూర్తిగా నిలిచిపోయాయి. ఇంధనం సరఫరా చేయరాదని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో స్పైస్‌ జెట్‌ విమానాలకు ఈ పరిస్ధితి ఏర్పడింది. స్పైస్‌జెట్ సర్వీసుల నిలిపివేతతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని స్పైస్‌జెట్ యాజమాన్యం మెసేజ్‌లు పంపిస్తుంది. ప్రయాణికులు స్పైస్‌జెట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు... స్పైస్‌జెట్‌ను ఒడ్డున పడేసేందుకు సహకరించాలని పౌరవిమానయాన శాఖ బ్యాంకులను కోరింది. దాదాపు 600 కోట్ల రూపాయల్ని వర్కింగ్‌ కేపిటల్‌గా ఇవ్వాలని సూచించింది.

ఈ మొత్తానికి సంస్థ చైర్మన్ కళానిధి మారన్‌ వ్యక్తిగత గ్యారెంటీగా ఉంటారని కూడా తెలిపింది. ఉద్యోగులకు బకాయి పడిన వేతనాల విడుదలతోపాటు వెండార్లకు చెల్లించాల్సిన 1,600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు స్పైస్‌జెట్‌కు డిజిసిఎ గతంలో సోమవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు అధికారులు డిజిసిఎలో వివరాలు అందజేశారు. మరిన్ని నిధులను స్పైస్‌జెట్‌కు అందిస్తానని సన్ గ్రూప్ ప్రమోటర్లలలో ఒకరైన కళానిధి మారన్ వ్యక్తిగత పూచీకత్తు నివ్వడంతో ఏఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో రోజువారీ విమాన సర్వీసుల సంఖ్య 332 ఉంటే తాజాగా వీటి సంఖ్య 239కి తగ్గిపోయింది.

నెలకు 1,800లకు పైగా విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసింది. సంస్థ చేతిలో 33 బోయింగ్‌ 737, 15 క్యు-400 ప్రాంతీయ జెట్లు ఉన్నాయి. వీటిలో 35 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. దేశీయ విమానయానరంగంలో సంస్థ మార్కెట్‌ వాటా 17 శాతం ఉంది.

 ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ సేవలు బుధవారం పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కుర్చీల్లో సేదతీరుతున్న ప్రయాణీకులు.

 ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఇంధనం సరఫరా చేయరాదని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో స్పైస్‌ జెట్‌ విమానాలకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు... స్పైస్‌జెట్‌ను ఒడ్డున పడేసేందుకు సహకరించాలని పౌరవిమానయాన శాఖ బ్యాంకులను కోరింది. దాదాపు 600 కోట్ల రూపాయల్ని వర్కింగ్‌ కేపిటల్‌గా ఇవ్వాలని సూచించింది.

 ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఈ మొత్తానికి సంస్థ చైర్మన్ కళానిధి మారన్‌ వ్యక్తిగత గ్యారెంటీగా ఉంటారని కూడా తెలిపింది. ఉద్యోగులకు బకాయి పడిన వేతనాల విడుదలతోపాటు వెండార్లకు చెల్లించాల్సిన 1,600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు స్పైస్‌జెట్‌కు డిజిసిఎ గతంలో సోమవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే.

 ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

ఇంధన సరఫరా నిలిపివేత... నిలిచిన స్పైస్‌జెట్

నెలకు 1,800లకు పైగా విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసింది. సంస్థ చేతిలో 33 బోయింగ్‌ 737, 15 క్యు-400 ప్రాంతీయ జెట్లు ఉన్నాయి. వీటిలో 35 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. దేశీయ విమానయానరంగంలో సంస్థ మార్కెట్‌ వాటా 17 శాతం ఉంది.

ఈ ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాము దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నామని... దానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని స్పైస్‌ జెట్‌ ప్రభుత్వానికి తెలిపింది. స్పైస్‌జెట్‌ సంక్షోభం అటు స్టాక్‌ మార్కెట్‌పై పడింది. బుధవారం జరిగిన స్టాక్ మార్కెట్లో స్పైస్‌ జెట్‌ షేర్‌ దాదాపు ఆరున్నర శాతం పతనమైంది.

English summary
Hours after the government threw a lifeline at loss-making airline SpiceJet, asking airport operators and fuel suppliers to give it more time to pay its bills, the country's second largest budget carrier has been grounded on Wednesday morning, with oil companies stopping jet fuel supply to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X