హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూపర్‌మూన్ మిస్సయ్యారా?: ఇక్కడ చూడండి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కార్తీక పౌర్ణమి రోజున(సోమవారం రాత్రి) ఆకాశంలో సూపర్‌మూన్‌ కనువిందు చేసింది. భూమికి దగ్గరగా వచ్చినందువల్ల ఈ చందమామ అందరినీ ఆకట్టుకుంది. 68 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా ఈ జాబిల్లి చేరడంతో ప్రజలు చూసేందుకు వీలుగా హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

అందమైన, కాషాయ వర్ణంలో ప్రత్యేకంగా కనువిందు చేస్తోన్న ఆ సూపర్‌ మూన్‌ను మీరూ చూడండి మరి.

నిండుచంద్రుడు

నిండుచంద్రుడు

సాదారణంగా చంద్రుడు దీర్ఘవృత్తాకారంలో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. దీని వల్ల కొన్ని సార్లు భూమికి దగ్గరగా వస్తుంటాడు. ఇలా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే కేంద్రాన్ని ‘పెరిజీ' అని, దూరంగా వెళ్లే కేంద్రాన్ని ‘అపోజీ' అని అంటారు.

 సూపర్ మూన్

సూపర్ మూన్

ఈ రెండు కేంద్రాల మధ్య దూరం 30 వేల కిలోమీటర్లు. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న ఈ మొత్తం దూరంలో ఇది 14 శాతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల, ‘అపోజీ చంద్రుడు' 14 శాతం చిన్నగా, ‘పెరిజీ చంద్రుడు' 14 శాతం పెద్దగా కనిపిస్తాడు. దీంతో సోమవారం రాత్రి ఏర్పడిన సూపర్‌ మూన్ (పెరిగీ చంద్రడు) ‘అపోజీ చంద్రుడి' కన్నా 14 శాతం పెద్దగా కనిపించాడు.

పెద్దగా, ప్రకాశవంతంగా..

పెద్దగా, ప్రకాశవంతంగా..

సాధారణ చంద్రుడి కంటే 30 శాతం ప్రకాశవంతంగా, మామూలుగా వచ్చే పున్నమి చంద్రుడి కన్నా 7 రెట్లు పెద్దగా, 7 రెట్లు ప్రకాశవంతంగా కనిపించాడు.

గతంలోనూ కనువిందు

గతంలోనూ కనువిందు

1948లో ఇలా నిండు చంద్రుడు గతంలో కనువిందు చేయగా, సరిగ్గా 69 ఏళ్ల తరువాత చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చాడు.

మళ్లీ అప్పుడే..

మళ్లీ అప్పుడే..

మళ్లీ ఈ అద్భుతాన్ని 2034లో చూసే అవకాశం ఉన్నప్పటికీ, సూపర్ మూన్ ను మళ్లీ చూసే అవకాశం మాత్రం 2052 నాటికి కానీ రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మళ్లీ ఈ అవకాశం వస్తుందో రాదోనన్న ఆలోచనతో పెద్ద నిండు చంద్రుడ్ని చూసేందుకు అంతా ఉత్సాహం చూపించారు.

జనం తరలారు

జనం తరలారు

పిల్లలను తీసుకుని పెద్దలు వైజాగ్ బీచ్ కు క్యూకట్టగా, హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అందంగా..

అందంగా..

అందమైన, కాషాయ వర్ణంలో ప్రత్యేకంగా కనువిందు చేశాడు చంద్రుడు. ఇప్పటికే చూసి ఉంటే సరే...లేకపోతే సూపర్‌ మూన్‌‌ను ఇలా చూసి మీరు ఆస్వాదించండి.

English summary
From Beijing to Berlin, star gazers around the world admired the supermoon — the largest, brightest full moon in nearly seven decades — as it made its way across the Earth's skies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X